Health

పుల్లని పెరుగు పడేస్తున్నారా… అయితే మీరిది తెలుసుకోవాలి!

పెరుగు వల్ల మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు. అయితే పెరుగు తియ్యగా ఉంటేనే తినడానికి చాలామంది ఇష్టపడతారు.. కాస్త పులిసిన పెరుగుని పడేస్తారు. అయితే అలా వ్యర్థంగా పడేసే పెరుగులో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో మీకు తెలుసా? సరిగ్గా ఉపయోగించుకుంటే ఈ పుల్లని పెరుగు వల్ల మనకు ఎన్నో లాభాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. మరి అవి ఏమిటి? ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం..

నార్మల్ గా పుల్లని పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు అని అందరూ అనుకుంటారు.. ఇందులో కొంత నిజం కూడా ఉంది. అయితే సరియైన పద్ధతిలో ఈ పుల్లని పెరుగును తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎటువంటి నష్టం ఉండదు. పెరుగు పులవడానికి ముఖ్య కారణం అందులో ఉన్న లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. ఇది సహజంగా పెరుగును సంరక్షించడానికి జరిగే ఓ ప్రక్రియ. అయితే మరీ పుల్లగా వాసనతో కూడుకున్న పెరుగుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు.

వంటలు:

ఇక పెరుగు పుల్లగా ఉంటే డైరెక్ట్ గా తినడానికి కుదరదు.. మరి అలాంటప్పుడు పెరుగుని మనం వంటకాలలో ఉపయోగించవచ్చు. చికెన్, మటన్ లాంటివి మ్యారినేట్ చేయడానికి కాస్త పులిసిన పెరుగు అద్భుతంగా ఉంటుంది. పెరుగులో ఉన్న లాక్టిక్ ఆమ్లం మాంసంలో ఉన్న ప్రోటీన్ లను విచ్ఛిన్నం చేస్తుంది కాబట్టి అది త్వరగా ఉడుకుతుంది.దీన్ని ఉపయోగించడం వల్ల కూరకి మంచి రుచి కూడా వస్తుంది. మసాలా కూరల్లో కూడా పుల్లని పెరుగు కలపడం వల్ల రుచి పెరుగుతుంది. కేక్స్, మఫిన్లు, బ్రెడ్ వంటివి వాటికి పుల్లని పెరుగును వాడితే అవి ఎంతో మృదువుగా వస్తాయి.

బ్యూటీ:

పుల్లని పెరుగు మన చర్మానికి ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ఉన్న లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసి మృదుత్వాన్ని అందిస్తుంది. పుల్లని పెరుగుని ఉపయోగించి పలు రకాల కెమికల్ ఫ్రీ ఫేస్ మాస్క్ ఇంటి వద్ద తయారు చేసుకోవచ్చు. ఎండాకాలం సన్‌బర్న్, చమట కాయలపై పుల్లని పెరుగు రాయడం వల్ల అవి చాలా వరకు తగ్గుతాయి. పుల్లని పెరుగు వారానికి ఒకసారి జుట్టుకు మసాజ్ చేసి.. తలస్నానం చేయడం వల్ల జుట్టు మృదువుగా మెరిసిపోతుంది. దీనివల్ల హెయిర్ ఫాల్ , డాండ్రపు సమస్యలు కూడా తగ్గుతాయి.

గమనిక:

పైన ఇచ్చిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా కొత్తది ప్రయత్నించే ముందు ఒకసారి మీ డాక్టర్ లేదా డైటీషియన్ ను సంప్రదించడం మంచిది.

This post was last modified on January 4, 2025 7:23 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సీఎం కావాల‌నుంది… త్రిష సంచ‌ల‌న స్టేట్మెంట్

హీరోయిన్లు రాజ‌కీయాల్లోకి రావాల‌నే ఆకాంక్ష‌ను వెల్ల‌డించ‌డం.. అందుకు అనుగుణంగానే సినిమాల్లో కెరీర్ ముగుస్తున్న ద‌శ‌లో ఆ రంగంలోకి అడుగు పెట్ట‌డం…

5 hours ago

భ‌క్తుల‌కు చేరువ‌గా చైర్మ‌న్‌.. టీటీడీ ప్ర‌క్షాళ‌న!

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో ప్ర‌క్షాళ‌న కొన‌సాగుతూనే ఉంది. అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భ‌క్తుల‌కు-భ‌గ‌వంతుడికి మ‌ధ్య టీటీడీ బోర్డు ఉంటుంది.…

6 hours ago

చిరు పవన్ మధ్య కపూర్ ప్రస్తావన… ఎందుకంటే

నిన్న గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి గురించి గొప్పగా చెప్పడం…

6 hours ago

దేవి వాహ్…చైతు & సాయిపల్లవి వారెవ్వా

నాగచైతన్య కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీ తండేల్ నుంచి నిన్న ఓం నమః శివాయ…

6 hours ago

అకీరా అరంగేట్రంపై రేణు…

ఓవైపు నందమూరి వారసుడు మోక్షజ్ఞ అరంగేట్రానికి రంగం సిద్ధమవుతుండగా.. ఆ తర్వాత మోస్ట్ అవైటెడ్ డెబ్యూ అంటే అకీరా నందన్‌దే.…

8 hours ago

భీమ్స్‌కు ‘మెగా’ ఛాన్స్?

టాలీవుడ్లో సంగీత దర్శకుడు భీమ్స్‌ది ఎంతో ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయక ప్రయాణం. పేద కుటుంబానికి చెందిన అతను.. యుక్త వయసులో పడ్డ…

8 hours ago