స్విమ్మింగ్ పూల్ లో డీఎస్పీ రాసలీలలు.. వీడియో వైరల్

బాధ్యతాయువతమైన పదవిలో ఉన్న ఓ డీఎస్పీ.. అందరూ సిగ్గుపడేలా ప్రవర్తించాడు. పబ్లిక్ అందరూ చూస్తుండగా… కానిస్టేబుల్ తో కలిసి.. స్విమ్మింగ్ పూల్ లో సరసాలు ఆఢాడు. కాగా.. దీనికి సంబంధించిన ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాజస్థాన్ పోలీస్ సర్వీస్ లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్, డిప్యూటీ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్( డీఎస్పీ) లు స్విమ్మింగ్ పూల్ లో స్నానాలు ఆడుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ వీడియో ఇప్పుడు బయటకు రాగా.. అందులో.. సదరు ఇద్దరు పోలీసులు అసభ్య రీతిలో కనిపించడం గమనార్హం.

వీరితో పాటు ఆరేళ్ల చిన్నారి కూడా ఉండటం గమనార్హం. . ఆ చిన్నారి సమక్షంలోనే వీరిద్దరూ సరససల్లాపాల్లో మునిగితేలడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. రాజస్థాన్ పోలీసు ఉన్నతాధికారులు వీరు చేసిన పనిపై సీరియస్ అయ్యారు. వెంటనే వీరిపై యాక్షన్ కూడా తీసుకున్నారు. వీరిద్దరినీ విధుల నుంచి సస్పెండ్ చేశారు. కాగా ఆ మహిళా కానిస్టేబుల్ జైపూర్ కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. సదరు డీఎస్పీ అజ్మేర్ జిల్లాలో పనిచేస్తున్నారు.