చిన్న వయసులోనే ఓ బుజ్జాయి తన ప్రత్యేకతతో ప్రపంచ రికార్డులో చోటు సంపాదించింది. పుట్టిన నెల రోజులకే ఆ చిన్నారికి ఏకంగా 6 నుంచి 7 సెంటీమీటర్ల పొడవైన జుట్టు పెరగడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. సహజసిద్ధంగా పెరిగిన జుట్టుతో బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించి ప్రత్యేక గుర్తింపు పొందింది.
అనకాపల్లి జిల్లాకు చెందిన ఈ చిన్నారి పేరు దియ్య యశికశ్రీ. మునగపాక మండలం ఉమ్మలాడ గ్రామానికి చెందిన సందీప్ దొర, భవాని దంపతులకు సెప్టెంబరు 18న కుమార్తె జన్మించింది. పుట్టినప్పటి నుంచే చిన్నారికి ఒత్తయిన జుట్టు ఉండటం కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరిచింది. నెల రోజుల వయసు వచ్చేసరికి ఆమె జుట్టు 6 నుంచి 7 సెంటీమీటర్ల పొడవు పెరిగింది.
సాధారణంగా ఆ వయసులో పిల్లలకు ఉండే జుట్టు పొడవుతో పోలిస్తే యశికశ్రీ జుట్టు దాదాపు ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో తల్లిదండ్రులు చిన్నారిలోని ఈ ప్రత్యేకతను రికార్డుగా నమోదు చేయించాలని భావించారు. ఈ క్రమంలో ఆమె వివరాలను బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థకు ప్రతిపాదించారు.
ఈ ప్రతిపాదనను పరిశీలించిన సంస్థ ప్రతినిధులు చిన్నారికి సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం ఆమె ప్రత్యేకతను గుర్తించి రికార్డుల్లో పేరును నమోదు చేశారు. అక్టోబరు 19న అధికారిక ధ్రువపత్రాన్ని పంపించారు. దీంతో అతి చిన్న వయసులోనే యశికశ్రీ అరుదైన గుర్తింపు పొందినట్లయింది.
తమ కుమార్తెకు ఇంత చిన్న వయసులోనే ప్రపంచస్థాయి గుర్తింపు రావడంతో సందీప్ దొర, భవాని దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా పిల్లలు పెరిగే కొద్దీ వారి ప్రత్యేకతలు బయటపడుతుంటాయి. కానీ యశికశ్రీ మాత్రం పసిప్రాయంలోనే తన సహజసిద్ధమైన జుట్టుతో ప్రత్యేక గుర్తింపు పొందడం విశేషం. ఈ చిన్నారి రికార్డు గురించి తెలుసుకున్న స్థానికులు తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేస్తున్నారు.
This post was last modified on November 14, 2026 12:20 pm
రోజూ ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్‌లో నోటిఫికేషన్లు చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే…
ఈ నెల నవంబర్ 20 విడుదల కాబోతున్న ఓమ్ మీద మూవీ లవర్స్ లో ప్రత్యేకమైన అంచనాలున్నాయి. పేరుకు తమిళ…
ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన ఎన్విడియాలో ఊహించని పరిస్థితి నెలకొంది. కంపెనీని 33 ఏళ్ల పాటు నడిపించిన జెన్సన్…
వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ జరగనుండగా టీమ్ఇండియాకు ఓ సమస్య పెద్ద తలనొప్పిగా మారుతోంది. స్వదేశంలో భారీ స్కోర్లు…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో ఈ నగరానికి ఏమైంది రిపీట్ మీద బయ్యర్ వర్గాలు చాలా ఆశలు పెట్టుకున్నాయి.…
హిట్ మెషీన్‌గా పేరున్న అనిల్ రావిపూడి.. సంక్రాంతికి తన సినిమాను తీసుకొచ్చాడంటే అది బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే. ఈ ఏడాది…