Trends

టీమ్ఇండియా సిరీస్‌లో కొత్త టెక్నాలజీ

క్రికెట్‌లో బ్యాటుకు బంతి తగిలిందో లేదో తెలుసుకోవడానికి థర్డ్ అంపైర్లు టెక్నాలజీ సాయం తీసుకుంటారు. ముఖ్యంగా వికెట్ కీపర్ క్యాచ్ పట్టినప్పుడు బ్యాటర్ అవుటా కాదా అని తేల్చడం కొన్నిసార్లు కష్టమవుతుంది. ఇలాంటి నిర్ణయాల కోసం ఇప్పుడు మరో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. న్యూజిలాండ్‌తో టీమ్ఇండియా ఆడబోయే సిరీస్‌లో తొలిసారిగా ‘సోనిక్’ అనే టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ఇందుకు ఐసీసీ అనుమతి ఇచ్చింది.

సోనిక్ అనేది బంతి బ్యాటుకు తగిలినప్పుడు వచ్చే శబ్దాన్ని పరిశీలించే టెక్నాలజీ. సాధారణంగా బ్యాటర్ బంతిని ఆడే సమయంలో బ్యాటు, ప్యాడ్ దగ్గరగా ఉంటాయి. బంతి దేనికి తగిలిందో కెమెరాలో స్పష్టంగా కనిపించకపోవచ్చు. అలాంటి సమయంలో శబ్దాన్ని విశ్లేషించి బ్యాటుకు బంతి తగిలిందా లేదా అని తెలుసుకోవడానికి సోనిక్ ఉపయోగపడుతుంది. థర్డ్ అంపైర్ డీఆర్ఎస్‌లో నిర్ణయం తీసుకునేందుకు ఇది అదనపు సాయం చేస్తుంది.

న్యూజిలాండ్‌కు చెందిన వర్చువల్ ఐ సంస్థ ఈ టెక్నాలజీని రూపొందించింది. ఇదే సంస్థ 2008 నుంచి బంతి ప్రయాణాన్ని చూపించే బాల్ ట్రాకింగ్ టెక్నాలజీని అందిస్తోంది. ఇప్పుడు సోనిక్‌కు కూడా అనుమతి రావడంతో డీఆర్ఎస్‌కు అవసరమైన బాల్ ట్రాకింగ్, ఎడ్జ్ డిటెక్షన్ రెండింటినీ వర్చువల్ ఐ అందించనుంది. సోనిక్ పనితీరును పలుమార్లు పరీక్షించిన తర్వాతే అనుమతి ఇచ్చారు. ఈ ప్రక్రియలో ఐసీసీతో పాటు బీసీసీఐ కూడా భాగస్వామ్యమైంది.

న్యూజిలాండ్ క్రికెట్ అధికారులు ఈ టెక్నాలజీ కోసం చాలా కాలంగా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అంపైర్ల నిర్ణయాలు కచ్చితంగా ఉండటం ముఖ్యమని పేర్కొన్నారు. అయితే సోనిక్ వచ్చిందని డీఆర్ఎస్ నిబంధనలు మారడం లేదు. బ్యాటుకు బంతి తగిలిందో లేదో తెలుసుకునేందుకు ఉపయోగించే టెక్నాలజీ మాత్రమే మారుతోంది. తుది నిర్ణయం థర్డ్ అంపైర్‌దే.

అక్టోబర్ 22న ప్రారంభమయ్యే భారత్, న్యూజిలాండ్ సిరీస్‌తో సోనిక్ వాడకం మొదలవుతుంది. ఈ పర్యటనలో ముందుగా ఐదు టీ20లు, నవంబర్ 4 నుంచి 15 వరకు ఐదు వన్డేలు జరుగుతాయి. నవంబర్ 19 నుంచి డిసెంబర్ 1 వరకు రెండు టెస్టులు నిర్వహిస్తారు. ప్రస్తుతానికి ఈ సిరీస్‌లో మాత్రమే సోనిక్ వినియోగానికి అనుమతి లభించింది. ఇతర సిరీస్‌ల్లో ఉపయోగించాలంటే ఐసీసీ నుంచి మళ్లీ ఆమోదం అవసరం.

This post was last modified on October 22, 2026 12:19 pm

Share

Recent Posts

నువ్వు బీజేపీ వదిలిన బాణం అని మాకు తెలుసులే…

వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన కొన్ని గంటలు కూడా కాలేదు. అప్పుడే ఆ…

23 minutes ago

జటాయు మీద భారం వేసిన కాంబినేషన్

హీరో రోషన్ మేక, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ కలయికలో కొత్త సినిమా మొదలయ్యింది. టైటిల్ అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు…

33 minutes ago

త్రివిక్రమ్ శ్రీనివాస్ చుట్టూ కొత్త ప్రచారాలు

ఇటీవలే విడుదలైన ఆదర్శ కుటుంబం ఏకె 47తో రికార్డులు బద్దలు కొడతారనుకుంటే దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీవ్రంగా నిరాశ పరచడం…

2 hours ago

ప్యారడైజ్ మీద సీనియర్ నటుడి ఆగ్రహం

థియేటర్ల నుంచి వెళ్ళిపోయి ఓటిటిలో వచ్చినప్పుడు కూడా ట్రోలింగ్ బారిన పడిన ది ప్యారడైజ్ ఇప్పుడప్పుడే సోషల్ మీడియా నుంచి…

2 hours ago

ఆ మ్యూజిక్ డైరెక్టర్ స్టూడియో కాలిపోయి..

తెలుగులో ఉన్న ఒరిజినల్ మ్యూజిక్ డైరెక్టర్లలో వివేక్ సాగర్ ఒకడు. ‘పెళ్ళిచూపులు’ దగ్గర్నుంచి మొదలుపెడితే.. ఎన్నో అద్భుతమైన ఆల్బమ్స్ ఇచ్చిన…

2 hours ago

పీఆర్పీ ముస్లిం ఎమ్మెల్యే టిక్కెట్లు ఖరారు చేసిన సాయిరెడ్డి

ఎట్టకేలకు విజయసాయి రెడ్డి సొంత రాజకీయ పార్టీ పెట్టేశారు. ముందే చెప్పినట్టు 11:11:11 కు పరివర్తన్ రాజనీతి పార్టీ అని…

3 hours ago