ప్రతి ఏడాది కొత్త ఐఫోన్ వస్తుంది. కెమెరా మారుతుంది, చిప్ వేగం పెరుగుతుంది. కానీ ఈసారి ఐఫోన్ 18 ప్రోతో పాటు ధర కూడా ఉహించని విధంగానే మారింది. అమెరికాలో ఐఫోన్ 18 ప్రో ధర 1,199 డాలర్లు, ప్రో మ్యాక్స్ 1,299 డాలర్ల నుంచి మొదలవుతోంది. గత ఏడాది ప్రో మోడల్స్‌తో పోలిస్తే రెండింటిపైనా 100 డాలర్లు పెరిగాయి.
దీని వెనుక ఆసక్తికరమైన కారణం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ డేటా సెంటర్ల నిర్మాణం భారీగా పెరుగుతుండటంతో మెమరీ చిప్స్‌కు డిమాండ్ పెరిగింది. అదే సమయంలో వాటి ధరలు కూడా పైకి వెళ్తున్నాయి. ఈ మెమరీ ఖర్చుల కారణంగానే కొత్త ప్రో మోడల్స్ ధరను 100 డాలర్లు పెంచాల్సి వచ్చిందని సమాచారం.
ఫోన్‌లో మాత్రం కొత్త ఏ20 ప్రో చిప్ వచ్చింది. ఇది 2 నానోమీటర్ టెక్నాలజీతో తయారైంది. గత ఏ19 ప్రోతో పోలిస్తే 50 శాతం ఎక్కువ మెమరీ బ్యాండ్‌విడ్త్ ఉంది. గ్రాఫిక్స్ పనితీరు 40 శాతం వరకు పెరిగిందని యాపిల్ చెబుతోంది. ఏఐ పనుల కోసం డ్యూయల్ 16 కోర్ న్యూరల్ ఇంజిన్ ఇచ్చారు.
కెమెరాలో 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సర్‌కు తొలిసారి వేరియబుల్ అపర్చర్ వచ్చింది. వెలుతురును బట్టి అపర్చర్ మారుతుంది. ప్రో మ్యాక్స్‌లో వీడియో ప్లేబ్యాక్ 43 గంటల వరకు వస్తుందని యాపిల్ పేర్కొంది. 15 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ చేసుకునే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉంది.
భారత్‌లో ఐఫోన్ 18 ప్రో ధర రూ.1,64,900 నుంచి, ప్రో మ్యాక్స్ రూ.1,79,900 నుంచి మొదలవుతోంది. 256 జీబీ నుంచి 2 టీబీ వరకు స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. సెప్టెంబర్ 12 నుంచి ప్రీ ఆర్డర్లు మొదలవుతాయి. సెప్టెంబర్ 18 నుంచి భారత్‌లో అమ్మకాలు ప్రారంభమవుతాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates