Trends

చాట్‌ GPT ఆస్ట్రా 6… భయపడుతున్న యువత

AI వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఓపెన్‌ఏఐ తీసుకొచ్చిన GPT-6 ఆస్ట్రా ఆ భయాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఉద్యోగాల కోసం గంటల తరబడి చేయాల్సిన పనిని ఆస్ట్రా కొన్ని నిమిషాల్లో పూర్తి చేయగలదని ఓపెన్‌ఏఐ చెబుతోంది. దీంతో సోషల్ మీడియాలో ఉద్యోగాల భవిష్యత్తుపై మళ్లీ రకరకాలుగా ఆందోళనలు మొదలయ్యాయి. కొందరైతే ఐటీ ఉద్యోగాల కంటే సొంత ఊరికి వెళ్లి వ్యవసాయం చేసుకోవడమే బెటర్ అంటూ పోస్టులు పెడుతున్నారు.

ఆస్ట్రా ఈసారి మరింత అప్డేట్ అయ్యింది. బ్రౌజర్‌లో వెతకడం, కంప్యూటర్‌లో పనులు చేయడం, ఆన్‌లైన్ ఫామ్స్ నింపడం, రీసెర్చ్ చేయడం, డాక్యుమెంట్లు తయారు చేయడం లాంటి పనులను కూడా చేయగలదు. ఓపెన్‌ఏఐ చేసిన టెస్ట్ లో మనిషికి ఐదు గంటలు పట్టే ఒక జాబ్ సెర్చ్ పనిని ఆస్ట్రా 2 నిమిషాల 51 సెకన్లలో పూర్తి చేసింది.

దీని ప్రభావం అప్పుడే మార్కెట్‌లో కూడా కనిపించింది. ఆస్ట్రా విడుదల తర్వాత సాఫ్ట్‌వేర్ కంపెనీల వ్యాపారంపై ఏఐ ప్రభావం చూపుతుందనే ఆందోళనలు పెరిగాయి. మంగళవారం సేల్స్‌ఫోర్స్, ఇంట్యూట్ షేర్లు దాదాపు 4 శాతం పడిపోగా, సర్వీస్‌నౌ 5 శాతం నష్టపోయింది. అమెరికా సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ ఇండెక్స్ 1.4 శాతం తగ్గింది.

కోడింగ్, డేటా అనాలిసిస్, కస్టమర్ సపోర్ట్ లాంటి రంగాల్లో పనిచేస్తున్న యువతకు ఇలాంటి ఏఐ మోడల్స్ పెద్ద సందేహంగా మారుతున్నాయి. సమాచారం వెతకడం నుంచి దాన్ని చదివి డాక్యుమెంట్ తయారు చేయడం వరకు ఆస్ట్రా చేయగలదని ఓపెన్‌ఏఐ తెలిపింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, ప్రొఫెషనల్ వర్క్‌లోనూ గత మోడల్స్ కంటే దీని సామర్థ్యం మరింత పెరిగింది.

అయితే ఆస్ట్రా వచ్చిందంటే వెంటనే ఉద్యోగాలు మాయమవుతాయని అనుకోవడానికి లేదని మరికొందరు నిపుణులు చెబుతున్నారు. AI మీద అవగాహన పెంచుకొని ఒక గుర్తింపు అందుకుంటే మార్కెట్ లో నిలబడవచ్చనే సలహాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ మోడల్ పరిమిత సంస్థలకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. తర్వాత ప్లస్, ప్రో, బిజినెస్, ఎంటర్‌ప్రైజ్ యూజర్లకు అందించనున్నట్లు ఓపెన్‌ఏఐ ప్రకటించింది.

This post was last modified on September 9, 2026 12:26 pm

Share

Recent Posts

పార్టీ క‌న్నా ప‌రువు కాపాడుకునేదెలా…

కొంతమంది నాయకుల విషయంలో పార్టీ ముందు.. తర్వాత నాయకులు.. అనే మాట వినిపిస్తుంది. నిజంగా రాజకీయాల్లో కొత్తగా వచ్చినవారు యువతరం…

1 minute ago

విజయవాడలో 10 కోట్లు… దేశంలోనే మొదటిసారి

సైబ‌ర్ నేరాల గురించి త‌ర‌చుగా వార్త‌లు వ‌స్తున్నాయి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్ర‌భుత్వాలు స‌హా రిజ‌ర్వ్ బ్యాంకు…

40 minutes ago

ఒక్క యాడ్‌కు 40 కోట్ల పారితోష‌కం?

చాలా ఏళ్ల నుంచి త‌మిళ సినిమాను ఏలుతున్న హీరోల్లో అజిత్ ఒక‌డు. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్, ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌ర్వాత…

46 minutes ago

ఖైర‌తాబాద్‌లో బీజేపీ క్యాండేట్‌ ఆయ‌నేనా?

తెలంగాణ‌లో కీల‌క‌మైన ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుద‌ల…

5 hours ago

బాబు.. ప‌వ‌న్‌.. జోడీకి జ‌నాలు ఫిధా!

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు, డిప్యూటీసీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల జోడీకి ప్ర‌జ‌ల్లో మ‌రింత ఆద‌ర‌ణ…

11 hours ago

బ్లడీ రోమియోకి లెక్కలు కుదురుతున్నాయి

మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…

12 hours ago