Trends

వైరల్ వీడియో: వరద నీటిలో వేలాది గ్యాస్ సిలిండర్లు

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాయగడ జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం పడుతుండడంతో అక్కడ పాతాళ గంగ నది పొంగిపొర్లుతోంది. దీంతో, పలు గ్రామాలు నీటమునిగిపోయాయి. అంతేకాదు, వరద నీటి ఉధృతికి హెచ్ పీసీఎల్ గ్యాస్ ప్లాంట్ నుంచి ఎల్పీజీ సిలిండర్లు నీటిలో కొట్టుకుపోయాయి. ఖాలాపూర్ తాలూకాలోని చావణే ప్రాంతంలో ఉన్న హెచ్ పీసీఎల్ ప్లాంట్‌లోకి భారీగా వరద నీరు చేరుకుంది.

కొండ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరద నీరు ప్లాంట్ చుట్టూ ఉన్న రక్షణ గోడలను కూడా దాటుకొని లోపలకు చేరుకుంది. ప్లాంట్ లో నిల్వ ఉంచిన దాదాపు 3 వేల గ్యాస్ సిలిండర్లు వరద నీటిలో మునిగిపోయాయి. వరద నీటి ఉధృతికి సిలిండర్లు కొట్టుకుపోయాయి. ప్లాంట్ కు సమీపంలో పాతాళ గంగ నదిపై ఉన్న బ్రిడ్జి కింద నీటి ప్రవాహంలో సిలిండర్లు కొట్టుకుపోతున్నాయి. అలా పాతాళ గంగ నదిలో కొట్టుకుపోతున్న సిలిండర్లను కొందరు గ్రామస్థులు తీసుకువెళుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఆ సిలిండర్లలో గ్యాస్ ఉందా లేదా అవి ఖాళీగా ఉన్నాయా అనే విషయంపై క్లారిటీ లేదు. అంతేకాదు, వాటికి ఉన్న వాషర్లు లీక్ అయ్యే ఛాన్స్ ఉందని, వరద నీటిలో రాళ్లకు తగిలి సిలిండర్లు డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉందని ప్లాంట్ సిబ్బంది చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వాటిని ముట్టుకోవడం, ఓపెన్ చేయడానికి ప్రయత్నించడం లేదా వాడాలని చూడటం అత్యంత ప్రమాదకరమని ప్రజలను హెచ్చరిస్తున్నారు. సిలిండర్లు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించి, వాటికి దూరంగా ఉండాలని వార్నింగ్ ఇస్తున్నారు.

This post was last modified on July 9, 2026 12:12 pm

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

33 minutes ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

2 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

3 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

4 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

4 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

4 hours ago