కోటీశ్వరుడితో పెళ్ళి, కానీ ప్రేమికుడి కోసం….

పెళ్ల‌యిన త‌ర్వాత‌.. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు జ‌ర‌గ‌డం కామ‌న్‌. ఈ క్ర‌మంలో ఒక‌ప్పుడు భార్య‌ల‌ను చంపే భ‌ర్త‌ల వ్య‌వ‌హారాలు పెద్ద ఎత్తున వెలుగు చూసేవి. అయితే.. ఇటీవల కాలంలో భార్య‌లే ముదిరిపోయారు. భ‌ర్త‌ల‌ను వారే వ‌దిలించుకుంటున్నారు. తాజాగా దీనిని మించిన ఘ‌ట‌న ఒక‌టి వెలుగు చూసింది. ఇంకా పెళ్లి కూడా కాని స‌మ‌యంలోనే కాబోయే భ‌ర్త‌ను ఓ యువ‌తి దారుణంగా చంపేసింది. దీనికి ఆమె ప్రియుడి స‌హ‌కారం కూడా తోడైంది.పైగా.. ఈ ఘ‌ట‌న‌ను ప్ర‌మాదంగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేసినా.. చివ‌ర‌కు ఆ యువ‌తి చేసిన ఘ‌ట‌నను పోలీసులు త‌మ‌దైన శైలిలో వెలుగులోకి తీసుకువ‌చ్చారు.

ఏం జ‌రిగింది?

మ‌హారాష్ట్ర‌లోని పుణేకు చెందిన ప్ర‌ముఖ రియ‌ల్ ఎస్టేట్ కంపెనీ నిర్వ‌హిస్తున్న కుటుంబానికి చెందిన కేత‌న్ అగ‌ర్వాల్‌(26ఏళ్లు) కు.. ఇదే ప్రాంతానికి చెందిన సియా గోయెల్‌(23)కు వివాహం నిశ్చ‌య‌మైంది.ఈ ఏడాది న‌వంబ‌రులో భారీ ఎత్తున వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజ‌స్థాన్‌లోని ఉద‌య్ పూర్ ప్యాలెస్‌ను 17 కోట్ల రూపాయ‌లు పెట్టి బుక్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఆహ్వాన ప‌త్రాల‌ను కూడా రెడీ చేసుకుంటున్నారు. ఇంత‌లో ఈ నెల 19న కాబోయే పెళ్లి కుమార్తె సియా పుట్టిన రోజు వ‌చ్చింది. దీనిని సెల‌బ్రేట్ చేసుకుందామ‌ని కాబోయే భ‌ర్త‌ను ఆమె ఆహ్వానించింది.

దీంతో ఇరువురు క‌లిసి మ‌హారాష్ట్ర‌లోని చారిత్ర‌క లోహ‌గ‌ఢ్‌కు వెళ్లారు. అక్క‌డి లోతైన ప్రాంతాల మ‌ధ్య పుట్టిన రోజు వేడుక‌లు నిర్వ‌హించాల‌ని భావించారు. ఈ క్ర‌మంలో త‌న‌ను ఫొటోలు తీయాల‌ని సియా కోర‌డంతో కేత‌న్ ఈ ప్ర‌య‌త్నంలో ఉన్నాడు. ఇంత‌లోనే 400 అడుగుల‌ లోతైన లోయ‌లో ప‌డి ఆయ‌న మృతి చెందారు. విష‌యం తెలిసిన వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకున్నారు. అయితే.. ఇది ప్ర‌మాద‌శాత్తు జ‌రిగింద‌ని, త‌న‌ను ఫొటోలు తీస్తున్న స‌మయంలో బ‌లంగా వీచిన గాలుల‌కు కేత‌న్ అదుపు త‌ప్పిలోయ‌లో ప‌డ్డాడ‌ని సియా వివ‌రించింది.

దీంతో పోలీసులు కూడా తొలుత నిజ‌మే అనుకున్నారు. కేత‌న్ అంత్య‌క్రియ‌లు కూడా జ‌రిగిపోయాయి. ఆ త‌ర్వాత‌.. కేసు పూర్వాప‌రాల‌ను తెలుసుకునేందుకు సియాను సంప్ర‌దించ‌గా.. ఆమె తొలి రెండు రోజులు ఊళ్లోనే ఉండి కూడా రాక‌పోవ‌డం.. వ‌చ్చిన త‌ర్వాత నిర్ల‌క్ష్యంగా స‌మాధానం చెప్ప‌డం.. ఏమాత్రం ఆమెలో బాధ లేక‌పోవ‌డం వంటి అంశాల‌ను పరిశీలించిన పోలీసులు.. ఘ‌ట‌న వెనుక‌ ఆమె కుట్ర దాగి ఉంద‌ని భావించి.. ఆ కోణంలో విచార‌ణ చేశారు. దీంతో ఆమె వాస్త‌వాలు ఒప్పుకోక త‌ప్ప‌లేదు.

అస‌లు విష‌యం ఇదీ..

ఈ పెళ్లి నిశ్చ‌యం కాక‌ముందే.. సియా ప్రేమ‌లో ఉంది. ఆమె ప్రియుడు, ఆమె క‌లిసి జీవించాల‌ని భావించారు. కానీ, పెళ్లి నిశ్చ‌యం కావ‌డంతో కేత‌న్‌ను వ‌దిలించుకోవాలిన ప్లాన్ చేసింది. ముందు రోజే ప్రియుడుని పుట్టిన రోజు వేడుక‌ల స్పాట్‌కు చేరుకునేలా చేసి.. మాక్ డ్రిల్ నిర్వ‌హించారు. ఏ ప్రాంతం అయితే.. అనుమానం రాకుండా ఉంటుందో రెక్కీ నిర్వ‌హించారు. అనంత‌రం.. కేత‌న్‌ను అక్క‌డే నిల‌బెట్టి.. అనంత‌రం ఇద్ద‌రూక‌లిసి బ‌ల‌వంతంగా లోయ‌లోకి తోసేశారు.