Trends

హార్దిక్ పాండ్య ఏం సాధించాడు?

గత కొన్నేళ్లలో మోస్ట్ అన్ పాపులర్ ఇండియన్ క్రికెటర్ ఎవరు అంటే మరో మాట లేకుండా హార్దిక్ పాండ్య పేరు చెప్పేయొచ్చు. ఇప్పుడు భారత క్రికెట్లో అతనంత వ్యతిరేకతను ఎవ్వరూ ఎదుర్కోవట్లేదు అంటే అతిశయోక్తి కాదు. చిన్న వయసులోనే ఐపీఎల్‌లో ఆల్ రౌండ్ మెరుపులతో అభిమానుల దృష్టిని ఆకర్షించి.. ఈ తరానికి మరో ‘కపిల్ దేవ్’ అనిపించుకున్నాడు ఈ బరోడా క్రికెటర్.

ముంబయి ఇండియన్స్ తరఫున నిలకడగా రాణించడంతో త్వరగానే భారత జట్టులో చోటు దక్కింది. మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు ఆడుతూ మంచి పేరు సంపాదించాడు. చాలా ఏళ్ల పాటు ఐపీఎల్‌లో ముంబయికే ఆడిన హార్దిక్.. 2022లో అప్పుడే లీగ్‌లోకి అడుగు పెట్టిన గుజరాత్ టైటాన్స్‌కు మారిపోయాడు.

ఆ జట్టు కెప్టెన్ అయ్యాడు. తొలి సీజన్లోనే జట్టును అద్భుతంగా నడిపించి టైటిల్ అందించాడు. దీంతో హార్దిక్ పేరు మార్మోగింది. ఆ వెంటనే అతను భారత టీ20 జట్టుకు కూడా కెప్టెన్ అయ్యాడు. అది హార్దిక్ కెరీర్లో పీక్ మూమెంట్.
అప్పటిదాకా వచ్చిన పేరును నిలబెట్టుకుంటూ ముందుకు సాగిపోయి ఉంటే బాగుండేది. కానీ 2024 సీజన్‌కు ముందు ముంబయి ఇండియన్స్‌కు రావాలన్న తన నిర్ణయం తన కెరీర్‌ను తలకిందులు చేసింది.

కెప్టెన్సీ ఇస్తేనే ముంబయికి వస్తా అని కండిషన్ పెట్టి అనుకున్నది సాధించుకున్నాడు కానీ.. భారత క్రికెట్ ప్రేమికుల దృష్టిలో విలన్ అవుతానని ఊహించలేకపోయాడు. ముంబయికి ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మను బలవంతంగా తప్పించి హార్దిక్‌ను కెప్టెన్‌ను చేయడంతో తీవ్ర వ్యతిరేకత తప్పలేదు.

హార్దిక్ ముంబయి కెప్టెన్ అయి ఇది మూడో సీజన్. ఇంకా కూడా అతడి మీద అభిమానుల వ్యతిరేకత తగ్గలేదు. దీనికి తోడు ముంబయి ప్రదర్శన పడిపోవడంతో హార్దిక్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ సీజన్లో 9 మ్యాచ్‌లు ఆడి ఏడు ఓటములు ఖాతాలో వేసుకున్న ముంబయి దాదాపుగా ప్లేఆఫ్స్ రేసుకు దూరమైంది.

ముంబయి ఇంత ఘోరమైన ప్రదర్శన చేయడం అరుదు. ఈ వైఫల్యానికి హార్దిక్‌నే ప్రధాన బాధ్యుడిగా చూస్తున్నారు. ఆట ఇలా తయారైతే.. ఇంకోవైపు వ్యక్తిగత ప్రవర్తన కూడా హార్దిక్ మీద తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. నటాషాకు విడాకులు ఇచ్చాక కొత్త అమ్మాయితో రిలేషన్‌షిప్ మొదలుపెట్టిన అతను.. ఆమెతో కలిసి వేస్తున్న వేషాలు అన్నీ ఇన్నీ కాదు.

గ్రౌండుకు ఆమెను తీసుకొచ్చి చేస్తున్న అతి.. సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు చిరాకు పుట్టిస్తున్నాయి జనాలకు. దీంతో వ్యతిరేకత ఇంకా పెరుగుతోంది. గుజరాత్ కెప్టెన్‌గా గొప్ప పేరు సంపాదించిన వాడు.. అక్కడే ఉండుంటే ఐపీఎల్ మేటి కెప్టెన్లలో ఒకడిగా కొనసాగేవాడు. ఎంతో గౌరవం ఉండేది. కానీ ముంబయికి వచ్చి మొత్తం పేరు పోగొట్టుకున్నాడు. తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నాడు. చేజేతులా కెరీర్‌ను దెబ్బ తీసుకోవడం అంటే ఏంటో చెప్పడానికి హార్దిక్‌ పాండ్యనే ఉదాహరణ.

This post was last modified on May 3, 2026 5:20 pm

Share

Recent Posts

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

7 minutes ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

8 minutes ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

1 hour ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

2 hours ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

3 hours ago

వంగ ఏం మాట్లాడినా కాంట్రవర్సీ తప్పదా

సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…

3 hours ago