టీ20 వరల్డ్ కప్ 2026 విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వింత నిర్ణయం తీసుకుంది. టోర్నీలో పాల్గొనేందుకు అనుమతినిస్తూనే, ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను మాత్రం బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.
ఐసీసీ బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చినందుకు నిరసనగా, బంగ్లాకు మద్దతు తెలుపుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నా, దీని వెనుక పాక్ ఆడుతున్న పెద్ద రాజకీయ క్రీడ కనిపిస్తోంది. అయితే ఈ ‘సెలెక్టివ్ పార్టిసిపేషన్’ (నచ్చిన మ్యాచ్‌లే ఆడటం) అనేది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని ఐసీసీ ఇప్పటికే తీవ్రంగా స్పందించింది.
ఈ బహిష్కరణ వల్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కోలుకోలేని ఆర్థిక నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. భారత్ పాక్ మ్యాచ్ అంటేనే వేల కోట్ల ఆదాయం, అడ్వర్టైజింగ్ డీల్స్‌తో ముడిపడి ఉంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్ ఆడకపోతే ఐసీసీ అగ్రిమెంట్‌ను ఉల్లంఘించినందుకు గాను పీసీబీకి అందాల్సిన వార్షిక ఆదాయం నిలిపివేయడంతో పాటు, బ్రాడ్‌కాస్టర్లకు సుమారు రూ. 316 కోట్ల (38 మిలియన్ డాలర్లు) పరిహారం చెల్లించాల్సి రావచ్చు. ఇదిలాగే కొనసాగితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి పాక్ సస్పెండ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది.
ఒకవైపు పెద్దల టీమ్ ఇలా చేస్తుంటే, మరోవైపు అండర్-19 వరల్డ్ కప్‌లోనూ పాకిస్థాన్ తన బుద్ధిని చాటుకుంది. ఆదివారం భారత్‌తో జరిగిన కీలకమైన సూపర్ సిక్సెస్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 58 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. సెమీ ఫైనల్‌కు వెళ్లాలంటే 33.3 ఓవర్లలోనే 253 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉండగా, కనీస వేగం కూడా ప్రదర్శించకుండా నత్తనడకన బ్యాటింగ్ చేసి ఓటమిని కొనితెచ్చుకుంది. ఫలితంగా ఇండియా సెమీస్‌లోకి దూసుకెళ్లగా, పాకిస్థాన్ టోర్నీ నుండి వైదొలిగింది.
అండర్-19 స్థాయిలో భారత్‌తో ఆడుతున్న పాకిస్థాన్, మెయిన్ వరల్డ్ కప్‌లో మాత్రం ఆడం అనడం ఆ జట్టు డబుల్ స్టాండర్డ్స్‌ను బయటపెడుతోంది. భారత్‌తో తలపడి గెలవలేమన్న భయం ఒకవైపు, ఐసీసీని ఆర్థికంగా దెబ్బతీయాలన్న కుట్ర మరోవైపు పాక్ నిర్ణయాల్లో క్లియర్ గా కనిపిస్తోంది.
ఐసీసీని లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న ఈ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు పాక్ క్రికెట్ పతనానికి దారితీయవచ్చని మాజీ ఆటగాళ్లు సైతం అభిప్రాయపడుతున్నారు. ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటే పాక్ క్రికెట్ గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే పీఎస్ఎల్ (PSL) పై కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. మరి ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి పాక్ తన మొండివైఖరిని వీడుతుందో లేదో వేచి చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates