స్కిల్ డెవపల్మెంట్ స్కామ్ లో చంద్రబాబునాయుడు అరెస్టు వెనుక బీజేపీ పెద్దల హస్తం కూడా ఉందా ? ఇపుడిదే అనుమానం బాగా పెరిగిపోతోంది. దీనికి రెండు కారణాలున్నాయి. మొదటిదేమో చంద్రబాబు అరెస్టును ఖండిస్తు కమలంపార్టీ పెద్దలు ఇప్పటివరకు ఎవరు నోరిప్పకపోవటం. రెండో కారణం ఏమిటంటే చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ పెద్దల హస్తముందని టీడీపీ నేతలు డైరెక్టుగా ఆరోపిస్తున్నా బదులివ్వకపోవటం. ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు అరెస్టు వెనుక కచ్చితంగా బీజేపీ పెద్దల హస్తముందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
టీడీపీని బలహీనం చేసేందుకు జగన్మోహన్ రెడ్డిని ముందుంచి వెనుకనుండి బీజేపీని అన్నీ వ్యవహారాలను నడిపిస్తోందా ? అనే అనుమానాలు బలపడుతున్నాయి. అవకాశముంటే చంద్రబాబును లొంగదీసుకుని అంటే టీడీపీని బీజేపీలో విలీనం చేసేట్లుగా ఒత్తిడి పెట్టాలని కమలనాదులు అనుకున్నారట. అది సాధ్యంకానపుడు ఏదో రకంగా ఇబ్బందులు పెట్టాలనే టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇబ్బందులు పెట్టాలన్న టార్గెట్ ను జగన్ ద్వారా అమలు చేయిస్తున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన సోమువీర్రాజు అనేక సందర్భాల్లో మాట్లాడుతు టీడీపీని బలహీనపరిస్తే కానీ బీజేపీ బలపడదన్న విషయాన్ని బహిరంగంగా చాలాసార్లు చెప్పారు. టీడీపీని నేతలమట్టం చేయటమే తమ టార్గెట్ అని కూడా అన్నారు. అయితే రాజకీయంగా టీడీపీని నేలమట్టం చేయటం బీజేపీ వల్లకాదు. ఎందుకంటే రాజకీయంగా టీడీపీని దెబ్బకొట్టేంత సీన్ బీజేపీకి లేదని అందరికీ తెలిసిందే. అందుకనే సైకిల్ పార్టీని దెబ్బకొట్టాలంటే బలమైన జగన్ మద్దతు అవసరమని కమలనాదులు నిర్ణయించుకున్నారట.
ఇందులో భాగంగానే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడల్లా టీడీపీని దెబ్బకొడుతున్నారు. బీజేపీ పెద్దల మద్దతుతోనే చంద్రబాబును జగన్ అరెస్టుచేయించారని తమ్ముళ్ళు బలంగా అనుమానిస్తున్నారు. అందుకనే సీనియర్ తమ్ముడు చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతు బీజేపీ అగ్రనేతలకు తెలిసే చంద్రబాబు అరెస్టు జరిగిందని ఆరోపించింది. చింతకాయల ఇంత డైరెక్టుగా ఆరోపించినా బీజేపీ నేతలు ఎవరూ నోరిప్పలేదు. దాంతో చింతకాయల ఆరోపణలకు మద్దతు పెరిగిపోతోంది. మరి చివరకు ఏమి తేలుతుందో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates