తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌లను వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని నానా బూతులు తిట్టడం కొత్తేమీ కాదు. ఐతే ఇప్పుడు కొడాలి నాని.. పవన్ కళ్యాణ్ మీదికి వచ్చారు. ఓవైపు చంద్రబాబును తిడుతూనే.. ఆయనకు మద్దతు ఇస్తే పవన్ కళ్యాణ్‌ను కూడా అంత తేలిగ్గా వదిలేది లేదని నాని హెచ్చరించాడు.
చంద్రబాబు రక్తంలోనే వెన్నుపోటు ఉందని.. ఆయన తన అవసరానికి ఎవ్వరినైనా వాడుకుని, తర్వాత పక్కన పడేస్తాడని కొడాలి నాని అన్నాడు. తనకు రాజకీయంగా పునర్జన్మ ఇచ్చిన ఎన్టీఆర్‌నే చంద్రబాబు వదిలిపెట్టలేదని.. ఆయన్నుంచి పార్టీని లాక్కుని బయటికి గెంటేశారని.. ఎన్టీఆర్ కంటే ఎవరూ గొప్ప కాదని నాని పేర్కొన్నాడు. పవన్ కళ్యాణ్‌ను కూడా తన ప్రయోజనాల కోసం ఉపయోగించుకుని.. తర్వాత నడిరోడ్డులో వదిలేస్తాడని.. కాబట్టి చంద్రబాబును నమ్మొద్దని పవన్‌ను హెచ్చరించాడు నాని.
కొత్త తరహా రాజకీయాలు చేస్తానంటున్న పవన్.. ఆ క్రమంలో తమ పార్టీని లేదా టీడీపీని తప్పుబడితే.. తమను ఢీకొంటే అభ్యంతరం ఏమీ లేదని.. అలా కాకుండా చంద్రబాబుతో కలిసి వచ్చి తమను టార్గెట్ చేస్తానంటే మాత్రం ఊరుకునేది లేదని నాని వార్నింగ్ ఇచ్చాడు. అలా చేస్తే మాత్రం కచ్చితంగా పవన్‌కు బుద్ధి చెబుతామని.. బట్టలూడదీసి నడి రోడ్డు మీద నిలబెడతామని నాని పేర్కొన్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates