నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం. మర్యాదల్ని వదిలేయటం.. ఎంత మాట పడితే అంత మాట అనేయటం ఈ మధ్యన రాజకీయాల్లో ఎక్కువైంది. ఎవరెంత కసిగా మాట్లాడితే అంత పోటుగాడన్నట్లుగా తెలుగు రాజకీయాలు మారిపోయాయి. వయసును పట్టించుకోకుండా..అనుభవాన్ని పరిగణలోకి తీసుకోకుండా.. తానున్న పదవికి తగ్గట్లుగా మాట్లాడాలన్న ఆలోచన లేని నేతలు ఎక్కువ అవుతున్నారు. ఫైర్ బ్రాండ్ నేత అన్నంతనే ఏపీ అధికార పక్షంలో బోలెడంత మంది ముందుకు వస్తారు. వీరిలో చంద్రబాబును.. ఆయన కొడుకును నోటికి వచ్చినట్లుగా తిట్టటంలో మొదట ఎవరుంటారనే దానికి కొడాలి నాని..వల్లభనేని వంశీ తెగ పోటీపడుతుంటారు. కొడాలితో పోలిస్తే.. వల్లభనేని వంశీ ఆర్టిస్టిక్ గా తిడుతుంటారు.
కొడాలికి మాత్రం ఇవేమీ పట్టవు. రోత మాటల్ని అదే పనిగా మాట్లాడే ఆయన తీరు అంతకంతకూ ముదిరిపోతోంది. అదేమంటే.. చంద్రబాబు చేష్టలు గుర్తుకువస్తే చాలు ఒళ్లు మండిపోతోందన్నట్లుగా ఆయన మాటలు ఉంటాయి. బాబు మీద ఫస్ట్రేషన్ పీక్స్ కు చేరుకున్న వేళ.. లాజిక్ లేకుండా మాట్లాడే మాటలు ఎక్కువ అవుతున్నాయి. దీనిపై తీవ్ర విమర్శలతో పాటు.. అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా విలేకరులతో మాట్లాడి సందర్భంగా కొడాలి నాని చేసిన వ్యాఖ్యల్లో ఆణిముత్యాల్లాంటివి చూస్తే..
- ముఖ్యమంత్రి పదవి కోసం పిల్లనిచ్చిన మామ నుంచి పార్టీని లాక్కున్నాడు. చంద్రబాబు దగ్గర నేర్చుకోవాలా? నాకు రాజకీయ భిక్ష చంద్రబాబు పెట్టాడంట. ఆడే పెద్ద భిచ్చగాడు రాష్ట్రంలో. నాకు రాజకీయ భిక్ష పెట్టటం ఏంది చంద్రబాబు?
- మొన్నకూడా జోలె పట్టుకొని అడుక్కున్నాడు. చంద్రబాబుకు ఇందిరాగాంధీ రాజకీయ భిక్ష పెట్టింది. ఎన్టీఆర్ పెట్టారు రాజకీయ భిక్ష.
- నాకు ఎవరైనా రాజకీయ భిక్ష పెట్టింది ఎవరైనా అంటే.. అది ఎన్టీఆర్.. వాళ్ల అబ్బాయ్ హరిక్రిష్ణ.. ఎన్టీఆర్ మనమడు జూనియర్ ఎన్టీఆర్. నాకు రాజకీయ భిక్ష పెట్టిందంటే ఆ ముగ్గురే. వీడే పెద్ద అడుక్కుతినేవాడు. నాకు రాజకీయ భిక్ష పెట్టేదేంటి?
- చంద్రబాబు అడుక్కుతినేవాడు. పెద్ద బెగ్గర్ గాడు. నాకు రాజకీయ భిక్ష పెట్టేదేమిటి? హరిక్రిష్ణ తెలుగు యువత అధ్యక్ష పదవి ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ నాకు సీటు ఇవ్వమని అడిగాడు వాళ్ల పార్టీని. సీటు ఇప్పించాడు.
- ఎన్టీఆర్ ను చూసి పార్టీలోకి వెళ్లా. అంతేకానీ చంద్రబాబును.. ఆయన బాబు కర్జూరనాయుడ్ని.. వాళ్ల తాత లవంగ నాయుడ్ని చూసి పార్టీలోకి వెళ్లానా?
- నేను రుణపడి ఉండేది ఎన్టీఆర్ కుటుంబానికి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి. వారి దగ్గర తల దించుకొని ఉంటాను కానీ.. చంద్రబాబు దగ్గర చంద్రబాబు బాబు దగ్గర తల దించుకునే ప్రసక్తే ఉండదు
తాజాగా కొడాలి నాని చేసిన వ్యాఖ్యల్ని చూసినప్పుడు.. ఎన్టీఆర్ మీద తనకున్న అభిమానాన్ని గొప్పగా చెప్పినంత వరకు ఓకే. తాజా ఎపిసోడ్ లో అదే ఎన్టీఆర్ కుమార్తె మీద అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని ఏమనాలి? ఎన్టీఆర్ మీద అంత అభిమానం ఉన్నప్పుడు.. చంద్రబాబు మీద గుస్సా ఉంటే.. అది బాబు మీద తీర్చుకోవాలే కానీ.. ఎన్టీఆర్ కుమార్తెను అనుచిత వ్యాఖ్యలతో ఇబ్బంది పెడుతుంటే ఊరుకోకూడదు కదా?
అంతేకాదు.. జూనియర్ ఎన్టీఆర్ తనకు టికెట్ ఇప్పించారని.. అతడు కూడా తనకు రాజకీయ భిక్ష పెట్టిన జాబితాలో చేర్చిన కొడాలి నాని మాటలు.. తారక్ కు డ్యామేజ్ చేసేలా ఉన్నాయని అంటున్నారు. భువనేశ్వరి మీద చేసిన వ్యాఖ్యల్ని తారక్ ఖండించినప్పుడు.. కొడాలి నాని కూడా ఖండించాలి కదా? మరి.. అలా చేయని తీరు చూస్తే.. చెప్పే మాటలకు చేసే పనులకు ఏ మాత్రం పొంతన లేదన్న భావన కలుగక మానదు. ఇలాంటివి కొడాలి ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేస్తాయన్న వాస్తవాన్ని ఆయన గమనిస్తే మంచిది.