ఈ సారి కాంగ్రెస్ ను ఓడించగలిగేది అదేనా?

2028లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సారి గెలుపు తమదంటే తమదని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. హైడ్రాతో పాటు పలు కారణల వల్ల రేవంత్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని విమర్శలు వస్తున్నాయి. ఆ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంతోపాటు మరోసారి కేసీఆర్ మ్యాజిక్ రిపీట్ అవుతుందని, గులాబీ జెండా రెపరెపలాడుతుందని బీఆర్ఎస్ నేతలు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే, 2028 ఎన్నికలలో కాంగ్రెస్ ను ఓడించగలిగేది ..ప్రతిపక్షాలు కాదు..ప్రకృతి విపత్తు. అవును, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించేది ఎల్ నినో ఎఫెక్ట్ అనడం ఏ మాత్రం తొందరపాటు కాదు. ఇక, సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్తును 2027 సమ్మర్ డిసైడ్ చేస్తుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

తెలంగాణలో ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల ఎఫెక్ట్ వచ్చే ఏడాది కాదు..ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తోంది. సాగునీరివ్వలేమని, తాగునీరు మాత్రమే ఇవ్వగలమని, హైదరాబాద్ వాసులు ప్రతి ఒక్కరు కనీసం 20 శాతం నీటి వాడకం తగ్గించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ రిక్వెస్ట్ కమ్ డిమాండ్ చేశారు. ఎల్ నినో వల్ల ఎఫెక్ట్ తో తెలంగాణలో మొత్తం 21,500 చెరువులలో 6,123 చెరువులు పూర్తిగా ఎండిపోవడమే అందుకు కారణం. మరో 7,141 చెరువుల్లో పావు వంతు కంటే తక్కువ నీరు మాత్రమే ఉండడం, 75 శాతానికి పైగా నిండిన చెరువులు కేవలం 550 మాత్రమే ఉండడంతో అధికారులు కూడా చేతులెత్తేశారు.

ఇక, రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గుతుండడంతో తెలంగాణలో రైతులు ఆరుతడి పంటలు, కూరగాయలు మాత్రమే సాగు చేయాలని రేవంత్ కోరారు. రైతులు నీటి వృథాను అరికట్టాలని పిలుపునిచ్చారు.
రిజర్వాయర్లలో 462 టీఎంసీలకు బదులు 200 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండడం రేవంత్ ను కలవరపెడుతోంది. ప్రధాన రిజర్వాయర్లు మంజీరా, సింగూరు, కృష్ణా బేసిన్ లో నీటి నిల్వలు తగ్గడంతో హైదరాబాద్ మరియు జిల్లా కేంద్రాల్లో ట్యాంకర్ల ద్వారా ఆల్రెడీ నీటిని సరఫరా చేస్తున్నారు  

ఎల్ నినో చాలా దేశాల్లో ఉందని, ప్రకృతి విపత్తులను ఆపలేమని రేవంత్ చెప్పిన విషయం కరెక్టే. కానీ, తెలంగాణ ఓటర్లు రాబోయే ఎన్నికల్లో ఆ విషయాన్ని అర్థం చేసుకునే పరిస్థితులు ఉండకపోవచ్చు. ఎందుకంటే, వాస్తవాలు ప్రజలకు వివరించడంలో రేవంత్ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేలా కాంగ్రెెస్ మంత్రుల స్టేట్మెంట్లు ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. వచ్చే వానాకాలం వరకు ప్రజల అవసరాలకు సరిపడా రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఉన్నాయని బల్లగుద్ది చెబుతున్నారు. మిషన్ భగీరథకు కావాల్సిన నీళ్లను రిజర్వాయర్లలో నిల్వ చేశామని ఉత్తమ్ చెప్పారు. కానీ, రేవంత్ మాత్రం నీటి వాడకం తగ్గించుకోవాలని, కరువు రాబోతోందని వార్నింగ్ ఇచ్చారు.

దీంతో, కాంగ్రెస్ నేతల పరస్పర విరుద్ధ స్టేట్మెంట్లకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేదనడం ఇటీవల విన్న జోకుల్లో బెస్ట్ అంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ జోకర్లను ఎన్నుకుంటే ఇలాంటి సర్కస్ చూడాల్సి వస్తుందని కేటీఆర్ చురకలంటించారు.