Political News

అస‌దుద్దీన్ నేతృత్వంలో కొత్త `కూట‌మి`

దేశంలో ప్ర‌స్తుతం జాతీయ స్థాయిలో రెండు కూట‌ములు కొన‌సాగుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోనిఎన్డీయే, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో `ఇండియా` కూట‌ములు ఉన్నాయి. జాతీయ స్థాయిలో అయినా.. ప్రాంతీయ స్థాయిలో అయినా.. ఈరెండు కూట‌ములే ఇప్ప‌టివ‌ర‌కు రాజ‌కీయాలు చేస్తున్నాయి. అయితే.. తాజాగా హైద‌రాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఒవైసీ.. కొత్త కూట‌మికి శ్రీకారం చుట్టారు. `సామాజిక పరివర్తన మోర్చా`(ఎస్‌పీఎం) పేరుతో ఏర్పాటు చేసిన ఈ కూట‌మి వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తుంద‌ని ప్ర‌క‌టించారు.

ఎవ‌రెవ‌రు క‌లిశారు?

కేవ‌లం యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల కోసమే ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ తో కలిసి ‘సామాజిక పరివర్తన మోర్చా’ పేరుతో కొత్త కూటమిని ఏర్పాటు చేశామ‌ని ఒవైసీ తెలిపారు.  సామాజిక పరివర్తన మోర్చా తరఫున ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నగీనా ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్‌ను ప్రకటించారు. రాబోయే 2027 అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో తమ కూటమి పోటీ చేస్తుందని ప్ర‌క‌టించారు.

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మూడోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన ఉద్దేశమని, దళితులు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాలు, రైతులు, యువతకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో మెరుగైన వైద్యం, 12వ తరగతి వరకు ఉచిత విద్య, యువతకు ఉపాధి అవకాశాలు, రైతుల సమస్యల పరిష్కారానికి తాము ప్రాధాన్యత ఇస్తామని ఈ కూట‌మి సీఎం అభ్య‌ర్థి చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు.

ఎవ‌రికి ఇష్టం.. ఎవ‌రికి న‌ష్టం..

సామాజిక ప‌రివ‌ర్త‌న పార్టీ కూట‌మితో మైనారిటీ ఓటు బ్యాంకు చీలిపోయే ప్ర‌మాదంఉంద‌ని కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు అంచ‌నా వేస్తున్నారు. అంతిమంగా ఇది.. బీజేపీకి లాభించే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం యూపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం స‌మాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ స‌హా.. ఇత‌ర చిన్నా చిత‌క పార్టీలు క‌లిసి.. ఇండియా కూట‌మిగా ఉన్నాయి. వీటికి మైనారిటీ ఓటు బ్యాంకు కీల‌కం. అయితే.. ఇప్పుడు కొత్త కూట‌మి కార‌ణంగా ఆ ఓటు చీలిపోతే.. మ‌రోసారి బీజేపీ ల‌బ్ధి పొందే అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on November 16, 2026 6:21 am

Share

Recent Posts

`క‌రువు`లో ఉన్నాం.. 30 వేల కోట్లివ్వండి

తెలంగాణ రాష్ట్రంలో ఎల్-నినో ప్రభావం వల్ల నెలకొన్న వర్షాభావం, కరువు పరిస్థితుల నేప‌థ్యంలో రాష్ట్రాన్ని, రైతులను ఆదుకునేందుకు కేంద్రం నుంచి…

18 minutes ago

చంద్రబాబు దార్శనికతకు నిదర్శనం

తిరుమల అంటే కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే ఈ పుణ్యక్షేత్రంలో…

2 hours ago

వైసీపీ ట్రాప్‌.. చిక్కుకుపోయిన టీడీపీ..?

రాష్ట్ర వ్యాప్తంగా కాదుకానీ.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల విష‌యంలో వైసీపీ స్థానిక నేత‌లు ప‌న్నిన వ్యూహానికి టీడీపీ…

4 hours ago

కాకినాడ‌, శ్రీకాకుళంపై పట్టు వదలని పవన్!

ఇటీవ‌ల జ‌రిగిన మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో మిగిలిపోయిన కార్పొరేష‌న్ స్థానాల‌కు, అలానే మునిసిపాలిటీల‌కు త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో…

8 hours ago

బాబు నివాసానికి షర్మిల… వివాహ ఆహ్వానం కోసమే కాదు!

ఏపీ సీఎం చంద్ర‌బాబుతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల భేటీ అయ్యారు. ఆదివారం సాయంత్రం ష‌ర్మిల‌.. హైద‌రాబాద్‌లోని…

9 hours ago

ఆమె వ‌ద్ద‌ని.. ఆమెతోనే రెండు సినిమాల‌కు కాంట్రాక్ట్

వ‌చ్చే శుక్ర‌వారం ద‌క్షిణాదిన మంచి అంచ‌నాల మ‌ధ్య విడుద‌ల కాబోతున్న సినిమా.. ఆకాశంలో ఒక తార‌. దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా…

10 hours ago