డిజిటలీక‌ర‌ణ అవినీతిని అంతం చేస్తుందా?

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం త్వ‌ర‌లోనే పూర్తిస్థాయిలో డిజిట‌ల్ పాల‌న‌ను అందించేందుకు సిద్ధ‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు కూడా పాల‌న విష‌యాల్లో చాలా వ‌ర‌కు డిజిట‌ల్, సాంకేతిక‌త‌ను వినియోగిస్తున్నారు. మ‌న మిత్ర యాప్ ద్వారా ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే ఫిర్యాదులను తీసుకుని ప‌రిష్క‌రిస్తున్నారు. అలానే.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లను కూడా ఆన్‌లైన్‌లో తీసుకుని ప‌రిష్కారాలు చూపుతున్నారు. అనేక యాప్‌ల‌ను అందు బాటులోకి తీసుకువ‌చ్చారు. అయిన‌ప్ప‌టికీ.. అసెంబ్లీ నుంచి సెక్ర‌టేరియ‌ట్ వ‌ర‌కు అనేక రూపాల్లో పేప‌ర్‌పైనే కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇప్పుడు ఈవిష‌యంలోనూ మార్పులు చేయ‌నున్నారు.

ఎక్క‌డెక్క‌డ ?

ముఖ్యంగా ప్ర‌జ‌ల‌తో సంబంధాలు ఎక్కువ‌గా ఉండే పోలీసు, రెవెన్యూ, ఫైర్, రోడ్ ట్రాన్స్‌పోర్ట్‌.. వంటి కీల‌క‌ విభాగాల్లో వ‌చ్చే జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో డిజిట‌ల్ కార్య‌క్ర‌మాల‌నే అమ‌లు చేయ‌నున్నారు. దీనికి సంబంధించి ప్ర‌భుత్వం తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌జ‌ల నుంచి తీసుకునే అర్జీల నుంచి పరిష్కారాల వ‌ర‌కు అన్నీ ఆన్‌లైన్‌లోనే న‌మోదు చేయాలి. అలానే.. ప్ర‌జ‌ల నుంచి వ‌సూలు చేసే వివిధ‌ర‌కాల రుసుములు, జ‌రిమానాలు కూడా అన్నీ పూర్తిగా డిజిట‌ల్ విధానంలోనే ఉండాల‌ని పేర్కొంది. ఇక‌, అసెంబ్లీ కార్య‌క్ర‌మాల‌కు సంబంధించిన ప్ర‌శ్న‌లు, స‌మాధానాలు, మంత్రులు ఇచ్చే ఉత్త‌ర్వులు కూడా పూర్తిస్థాయిలో డిజిట‌లీక‌ర‌ణ చేయ‌నున్నారు. త‌ద్వారా మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త పెరుగుతుంద‌ని అంటున్నారు.

రీజ‌నేంటి?

రెవెన్యూ, వాణిజ్య ప‌న్నులు, రోడ్ ట్రాన్స్‌పోర్టు, పోలీసు విభాగాల‌కు సంబంధించిన ప‌లు అంశాల్లో అవినీతి పెరుగుతోంద‌ని ఫిర్యాదులు అందుతున్నాయి. అదేస‌మయంలో ఆధారాలు కూడా ల‌భ్యం కావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో పూర్తిగా డిజిటలీక‌ర‌ణ చేయ‌డంతో ఆయా విభాగాల్లో మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త పెరిగి.. అవినీతి త‌గ్గుతుంద‌ని ప్ర‌భుత్వం అంచ‌నా వేస్తోంది. అదేస‌మ‌యంలో అధికారుల‌కు కూడా బాధ్య‌త పెర‌గ‌డంతోపాటు.. ప్ర‌జ‌లు స‌కాలంలో సేవ‌లు చేరువ అవుతాయ‌ని అంచ‌నా వేస్తోంది.

ఇప్ప‌టికే ఉన్న డిజిట‌ల్ సాధాన‌ల‌తో పాటు యాప్ ఆధారిత సేవ‌ల‌ను కూడా మ‌రింతగా విస్త‌రించ‌నున్నారు. త‌ద్వారా.. ప్ర‌జ‌ల‌కు స‌మయానుకూలంగా సేవ‌లు అంద‌డంతోపాటు.. ప్ర‌భుత్వానికి కూడా మంచి పేరు వ‌స్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. దీనికి సంబంధించి ‘నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్’  ను వినియోగించ‌నున్నారు.  దీనికి సంబంధించి అధికారులు, సిబ్బందికి శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు.