బీజేపీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా ఎదిగిన నటీమణి కంగనా రనౌత్‌పై హిమాచల్ ప్రదేశ్ పోలీసులు కేసు పెట్టారు. షిమ్లా పరిధిలోని బాలుగంజ్ పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ ఎస్) సెక్షన్లు 196(1)(బీ), 353(2), 356(2) కింద కంగనా రనౌత్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా పెను చర్చసాగుతోంది. ఈ క్రమంలో కంగనా ఏం చేశారు? ఏం జరిగింది? అనేది ఆసక్తిగా మారింది. గతంలో కూడా అనేక వివాదాల్లో కంగనా చిక్కుకున్నా.. అప్పట్లో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. కానీ, తాజాగా కేసు పెట్టడం వెనుకు ఆమెను వ్యతిరేకించే బీజేపీ నాయకుల వ్యూహం కూడా ఉండి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ సహా గాంధీల కుటుంబంపై కంగనా రనౌత్ నోటికి పని చెప్పారు. సోనియా గాంధీ రాసిన బిలాంగింట్: ఏ జర్నీ ఆఫ్ లవ్ ఆత్మకథ పుస్తకంలోని పలు అంశాలను ఉటంకిస్తూ.. తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే ఆమెపై కేసు నమోదైంది. ముఖ్యంగా సోనియా గాంధీని “అనుమానాస్పద విదేశీయురాలు` అని కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు. ఆమె భారత రాజకీయాల్లోకి ఎలా వచ్చారనే దానిపై పలు ప్రశ్నలు లేవనెత్తారు.
1968లో రాజీవ్ గాంధీని వివాహం చేసుకున్న సోనియా గాంధీ.. దాదాపు 15 ఏళ్ల తర్వాత 1983లో భారత పౌరసత్వం ఎందుకు తీసుకున్నారని కంగనా ప్రశ్నించారు. సోనియా గాంధీ తన జీవిత ప్రయాణంపై రాసిన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్స అనే పుస్తకాన్ని ప్రస్తావిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అదేసమయంలో ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీల మరణాలపై కూడా ఆమె పోస్టుల్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా రాహుల్ గాంధీని ఉద్దేశించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
కంగనా రనౌత్ చేసిన ఈ పోస్టులు సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని సిమ్లాకు చెందిన అతుల్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై కేసు పెట్టారు. కాగా.. ఇలాంటి కేసులు తన భావ ప్రకటనను ఆపలేవని కంగనా వ్యాఖ్యానించారు. విమర్శలు తట్టుకోలేని వారికి ఆత్మ కథ రాసేందుకు అవకాశం ఉండదన్నారు. “జీవితాలను నాలుగు గోడల మధ్య ఉంచుకుంటే.. ఎవరూ మీ జోలికి రారు.“ అంటూ కేసు నమోదయ్యాక కూడా రనౌత్ సోనియాను ఉద్దేశించి వ్యాఖ్యానించడం గమనార్హం. మరోవైపు.. కంగనా వ్యాఖ్యలకు తమకు సంబంధం లేదని హిమాచల్ బీజేపీ అధ్యక్షుడు ప్రకటించడం గమనార్హం.
This post was last modified on November 14, 2026 2:50 pm
ఆన్‌లైన్ ఫ్లాట్ ఫార్మ్ నుంచి వచ్చే ఆర్డర్లను ఇంటికి చేర్చే గిగ్ వర్కర్స్‌పై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష…
తణుకు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ బలగం సీతారాం కుమారులు బలగం బాబీ, బలగం రాజ్‌కుమార్‌లతో పాటు వారి కుటుంబ సభ్యులు…
దేశంలో నిన్న మొన్నటి వరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్), కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా…
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మళ్లీ తన దేశానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 2026 డిసెంబర్ లో ఆమె…
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న సంగతి తెలిసిందే. ఆమె నటిగా సత్తా చాటుకుంది.…
రోజూ ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్‌లో నోటిఫికేషన్లు చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే…