Political News

దావోస్ తరహాలో హైదరాబాద్.. రేవంత్ మాస్టర్ ప్లాన్!

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ 2026 హైదరాబాద్ వేదికగా ప్రారంభమైంది. శుక్ర, శనివారాల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల నుంచి 1,000 మందికి పైగా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎంపీలు, మంత్రులు, ఆర్థిక నిపుణులు, పర్యావరణవేత్తలు, సీనియర్ జర్నలిస్టులు ఇందులో పాల్గొంటున్నారు. తెలంగాణను పెట్టుబడులకు అనుకూలమైన గమ్యస్థానంగా ప్రపంచానికి పరిచయం చేయడం, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడమే ఈ సదస్సు ప్రధాన లక్ష్యం.

అయితే ఈ సదస్సు రాజకీయ విమర్శలకు కూడా వేదికైంది. ప్రభుత్వ నిధులతో పార్టీ కార్యక్రమంలా భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్నారని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి దీనిని ‘భారత్ సమ్మిట్’ కాదని, ‘భారత వ్యతిరేక సమ్మిట్’ అని విమర్శించారు. అసలు ఇలాంటి సదస్సు నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కేంద్ర పథకాలను సమర్థంగా వినియోగించుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. మరోవైపు, ఈ సదస్సు పేరుతో రూ.50 నుంచి రూ.100 కోట్ల వరకు ప్రజాధనం ఖర్చు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.

ఈ విమర్శలను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా తిప్పికొట్టారు. రాష్ట్రాన్ని నాశనం చేసినవారు, విభజన చట్టంలోని హామీలను కూడా అమలు చేయని వారు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలోని వనరులు, అవకాశాలను ఉపయోగించుకుని ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు తీసుకురావడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. తద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్, తెలంగాణ ప్రాధాన్యతలను ప్రపంచానికి వివరించి పెట్టుబడులు, పర్యాటక రంగ అభివృద్ధికి ఈ సదస్సు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

భారత్ సమ్మిట్‌తో లాభాలు ఏమిటి?

స్విట్జర్లాండ్‌లోని దావోస్ తరహాలో హైదరాబాద్‌ను అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక, సామాజిక చర్చలకు కేంద్రంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ఆలోచన. 70 దేశాలకు చెందిన ప్రతినిధులు ఒకే వేదికపైకి రావడం ద్వారా తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఏఐ, వాతావరణ మార్పులు, ఆర్థిక న్యాయం, ప్రపంచ శాంతి వంటి కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి.

వివిధ దేశాల నాయకులు, ప్రగతిశీల రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొనడం వల్ల అంతర్జాతీయ సంబంధాలు, సహకారానికి కొత్త అవకాశాలు ఏర్పడవచ్చు. ముఖ్యంగా పెట్టుబడులు, పర్యాటకం, యువతకు ఉపాధి కల్పన విషయంలో తెలంగాణకు ఈ సదస్సు ఎంతవరకు ఉపయోగపడుతుందనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

This post was last modified on November 13, 2026 9:48 pm

Share

Recent Posts

చంద్రబాబు-సముద్రం… ఏపీకి ఇంకేం కావాలి..

"ఏపీకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. ఆయనకు విజన్ ఉంది. ఇక ఈ రాష్ట్రానికి సుదీర్ఘ సముద్ర తీరం కూడా ఉంది.…

11 minutes ago

Pics: రాషా లుక్ అదుర్స్!

శ్రీనివాస మంగాపురంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ రాషా తడాని. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తెగా సినీ ప్రేక్షకులకు…

19 minutes ago

కుటుంబం స్టామినాని సరిగా వాడుకోలేదు

ఆదర్శ కుటుంబం ఏకె 47 ఏదో అనుకుంటే ఏదో చేసింది. నిజమే. కానీ మొదటి మూడు రోజులు హడావిడి చేసి…

28 minutes ago

జ‌న‌సేన పేరుతో రూ.7 కోట్ల మోసం..

కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ పేరు ఉపయోగించుకుని భారీ మోసానికి పాల్పడ్డారు కొందరు వ్యక్తులు. ప్రభుత్వ…

30 minutes ago

ప్రపంచ కాలుష్య నగరాల్లో టాప్ మనదే

అభివృద్ధి పేరుతో ప్రకృతిని ఎంతగా నిర్లక్ష్యం చేస్తున్నామో చెప్పడానికి ఢిల్లీ వాయు కాలుష్యమే మరో నిదర్శనం. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య…

43 minutes ago

ఇప్పుడు దేశానికి మోదీఏ కరెక్ట్

వ‌చ్చే 2029 సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ కూట‌మిగానే ముందుకు వెళ్తామ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. గ‌తంలో 2014లో కూడా కూట‌మిగానే…

2 hours ago