వీసీ సజ్జనార్ ఐపీఎస్..ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారుండరు. 2008లో వరంగల్ ఎస్పీగా సజ్జనార్ పనిచేస్తున్నప్పుడు యాసిడ్ దాడికి పాల్పడిన ముగ్గురు నిందితుల ఎన్ కౌంటర్, 2019లో సైబరాబాద్ సీపీగా ఉన్నపుడు దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెలంగాణ ఆర్టీసీ ఎండీగా పనిచేసిన సజ్జనార్ అక్కడ కూడా తన మార్క్ చూపించి వార్తల్లో నిలిచారు. 14 నెలలుగా హైదరాబాద్ సీపీగా పనిచేస్తున్న సజ్జనార్ ను హఠాత్తుగా రేవంత్ సర్కార్ బదిలీ చేసిన వైనంతో సజ్జనార్ మరోసారి వార్తల్లో నిలిచారు.
సజ్జనార్ ను ప్రభుత్వం ఉరుములు లేని మెరుపుల్లా…ఆఘమేఘాల మీద ఎందుకు బదిలీ చేసింది అన్న విషయంపై ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. సాధారణ బదిలీ అయితే…ఇంత చర్చ జరిగేది కాదు. తనకు అప్పగించిన శాఖపై తమ ముద్ర వేసేలా విధులు నిర్వహిస్తూ ఇటు ప్రభుత్వ..అటు ప్రజల మద్దతు చూరగొన్న అతికొద్దిమంది పోలీసు అధికారులలో సజ్జనార్ ఒకరు. అందుకే, ఉన్నపళంగా సజ్జనార్ బదిలీ కావడం వెనుక కారణాలపై చర్చలు, విశ్లేషణలు మొదలయ్యాయి.
అంతేకాదు, హైదరాబాద్ సీపీ వంటి పవర్ ఫుల్ పోస్ట్ నుంచి ఫైర్ సర్వీసెస్ డీజీ వంటి ఇంపార్టెన్స్ లేని పోస్ట్ కు బదిలీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అటు బీఆర్ఎస్ హయాంలో…ఇటు కాంగ్రెస్ హయాంలో…సజ్జనార్ కు ప్రాధాన్యత దక్కింది. ఏరి కోరి సజ్జనార్ ను సీపీగా ఎంపిక చేసిన రేవంత్ సర్కార్…హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు, కీలక ఘటనల నేపథ్యంలోనే సజ్జనార్ ను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంటున్నారంటూ సజ్జనార్ పై కొందరు కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి ఇటీవల ముఖ్యమంత్రి విషయంలో జరిగిన కొన్ని పుకార్లు, పరిణామాల నేపథ్యంలో సజ్జనార్ పై సీఎం రేవంత్ రెడ్డి కూడా గరంగరంగా ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, తన ఇంట్లో శుభకార్యం కోసం సెలవు పై వెళ్తున్నారని మరో ప్రచారం తెరపైకి వచ్చింది. అందుకే, ఆయన అప్రాధాన్యమైన ఆ పోస్ట్ లోకి వెళ్లారని పుకార్లు వస్తున్నాయి.
అంతేకాదు, కొంతకాలం తర్వాత సజ్జనార్ తిరిగి కీలక హోదాలో కమ్ బ్యాక్ ఇస్తారన్న టాక్ కూడా వస్తోంది. 2028 అక్టోబర్ లో రిటైర్మెంట్ కాబోతున్న సజ్జనార్ పవర్ ఫుల్ పోస్ట్ లో..అంటే డీజీపీ హోదాలో రిటైర్ అవుతారని కూడా కొందరు జోస్యం చెబుతున్నారు. ఈ క్రమంలోనే తన ట్రాన్స్ ఫర్ పై సజ్జనార్ స్పందించారు. హైదరాబాద్ సీపీగా పని చేసిన కాలం అపురూప ప్రయాణం అని అన్నారు. తనకు అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
This post was last modified on November 13, 2026 3:03 pm
ఏపీలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ పారిశ్రామిక సదస్సు రెండో రోజు ఆయన చాలా…
పదేళ్లకు పైగా సరైన విజయం లేక ఇబ్బంది పడ్డ తమిళ స్టార్ హీరో సూర్య.. కేవలం ఆరు నెలల వ్యవధిలో…
ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేసిన శాండ్‌పేపర్ వివాదం ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ మొదలైంది. 2018లో జరిగిన బాల్ ట్యాంపరింగ్ గురించి మాజీ…
తన తాత ముత్తాతల ప్రభావంతో దేవాంశ్ కూడా సినిమాల వైపు వెళతాడేమోనని భయంగా వుందని మంత్రి నారా లోకేష్ చెప్పిన…
ఏఐ రంగంలో ఎన్విడియా పేరు తెలియనివాళ్లు ఉండరు. ప్రపంచంలోని పెద్ద పెద్ద టెక్నాలజీ కంపెనీలకు అవసరమైన చిప్స్ అందిస్తున్న ఈ…
నిన్న రాత్రి హైదరాబాద్ ఏఎంబీ మల్టీప్లెక్సులో వేసిన ఇట్లు అర్జున ప్రీమియర్ షోకు దాదాపు టాలీవుడ్ మొత్తం హాజరయ్యిందేమో అన్నంత…