Political News

దేవాంశ్‌ సినిమాల్లోకి వెళతాడేమో అని భయంగా వుంది

తన తాత ముత్తాతల ప్రభావంతో దేవాంశ్‌ కూడా సినిమాల వైపు వెళతాడేమోనని భయంగా వుందని మంత్రి నారా లోకేష్ చెప్పిన మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం దేవాంశ్‌ డైనోసార్ల నేపథ్యంతో ఒక పాడ్‌కాస్ట్ మరియు యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ విద్యా వినోద కార్యక్రమానికి డైనో డీట్స్ అని పేరు పెట్టారు.

మే 2026లో ప్రారంభమైన ఈ పాడ్‌కాస్ట్ ఇప్పటివరకు 25కు పైగా ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ప్రతి ఎపిసోడ్‌కు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. సినిమాల్లో చూపించే డైనోసార్ల పట్ల ప్రజల్లో అనేక అపోహలున్నాయి. ప్రాచీన జీవరాశుల గురించి ఆసక్తికరమైన నిజాలను సులభంగా సైన్స్ పట్ల ఆసక్తి వున్న చిన్న పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా దేవాంశ్‌ వివరిస్తున్న తీరుకు ప్రశంసలు వస్తున్నాయి. కొన్ని ఎపిసోడ్లలో దేవాంశ్‌
తన స్నేహితులతో కలిసి లెగో డైనోసార్ బిల్డింగ్ ఛాలెంజ్‌లు చేయడం, యువ శిలాజ శాస్త్రవేత్త అశ్వత బిజు వంటి ప్రముఖులతో ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించడం వంటివి ఈ షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

విశాఖ పెట్టుబడుల సదస్సులో మంత్రి లోకేష్ ను అపోలో ఆస్పత్రుల ఉపాధ్యక్షురాలు ఉపాసన ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్బంగా ఆమె దేవాంశ్‌ గురించి ప్రస్తావించారు. మీరెవరైనా దేవాంశ్‌ చేసే డైనోసార్ పాడ్‌కాస్ట్‌ చూశారా? నిజంగా అద్భుతం. పిల్లల్లో అంత ఆత్మవిశ్వాసాన్ని ఊహించలేమని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. డైనో డీట్స్ చూస్తుంటే మీ అబ్బాయి కూడా అసాధారణంగానే కనిపిస్తున్నాడని పేర్కొన్నారు. దీనికి స్పందించిన లోకేష్ మాట్లాడుతూ…డైనోసార్ పాడ్‌కాస్ట్‌లో దేవాన్ష్ మాట్లాడే తీరు, ఆత్మవిశ్వాసం చూస్తుంటే నాకు నిజంగా భయమేస్తోంది.. ఎక్కడ సినిమాలను తన కెరీర్‌గా ఎంచుకుంటాడో అని చమత్కరించారు. పిల్లలు మనల్ని ఎప్పుడూ అత్యుత్తమ రీతిలో ఆశ్చర్యపరుస్తూనే ఉంటారని కొడుకు సృజనాత్మకతను మెచ్చుకున్నారు.

This post was last modified on November 13, 2026 12:25 pm

Share

Recent Posts

ఒక మగాడి బలహీనత వల్ల లక్షల కోట్ల సామ్రాజ్యం కుదేలు

ఏఐ రంగంలో ఎన్విడియా పేరు తెలియనివాళ్లు ఉండరు. ప్రపంచంలోని పెద్ద పెద్ద టెక్నాలజీ కంపెనీలకు అవసరమైన చిప్స్ అందిస్తున్న ఈ…

27 minutes ago

అందరూ చేయందించడం అర్జున అదృష్టం

నిన్న రాత్రి హైదరాబాద్ ఏఎంబీ మల్టీప్లెక్సులో వేసిన ఇట్లు అర్జున ప్రీమియర్ షోకు దాదాపు టాలీవుడ్ మొత్తం హాజరయ్యిందేమో అన్నంత…

36 minutes ago

రామసీత రావణుల్లో ఎవరికి లాభం

రామాయణ పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద స్టడీగా ఉంది. వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ వెయ్యి కోట్ల మార్కు అందుకుంది.…

43 minutes ago

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు

ప్రపంచ టెక్నాలజీ రంగంలో అగ్రగామి సంస్థగా ఎదిగిన ఎన్విడియా ఇప్పుడు అనూహ్యమైన వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. సంస్థ మాజీ ముఖ్య…

2 hours ago

జపాన్ కు ఆంధ్రా అవసరం!

ప్రపంచంలో ఎలక్ట్రిక్ కార్లు, అత్యాధునిక యుద్ధ విమానాలు, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీకి కొన్ని ప్రత్యేకమైన ఖనిజాలు అవసరం. వీటి ప్రాసెసింగ్‌లో…

2 hours ago

10 లక్షలకు కొని.. ఇప్పుడు రూ.18 కోట్లకు వదిలేసింది!

ఐపీఎల్‌లో హార్దిక్ పాండ్యా మరో జట్టుకు ట్రేడ్ అయిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ నుంచి పంజాబ్ కింగ్స్‌కు వెళ్లిన…

3 hours ago