బాలల దినోత్సవం అంటేనే పిల్లలకు ఎంతో ప్రత్యేకం. ఆరోజు పాఠశాలల్లో ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి నెలకొంటుంది. అయితే ఈసారి తమిళనాడులోని విద్యార్థులకు ఈ వేడుక మరింత ప్రత్యేకంగా మారనుంది. రాష్ట్రంలోని 61 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఉచితంగా కేకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు.. ముఖ్యమంత్రి విజయ్ తరఫున ప్రత్యేక శుభాకాంక్షల కార్డులను కూడా అందించనున్నారు.
ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ సహాయంతో నడిచే పాఠశాలల్లో చదువుతున్న మొత్తం 61,84,566 మంది విద్యార్థులకు ఈ కానుకలు అందనున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.9.27 కోట్ల నిధులను కేటాయించింది. చిన్న తరగతుల నుంచి ఉన్నత పాఠశాలలు, ఇంటర్మీడియట్ స్థాయి వరకు చదువుతున్న విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయనున్నారు.
ఈ పంపిణీ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా కేకులను కొనుగోలు చేశారు. ఒక్కో కేక్ ప్యాకెట్ 45 గ్రాముల బరువు ఉండేలా నిర్ణయించారు. అయితే కొన్ని జిల్లాల్లో విద్యార్థులకు ఒక్కోటి కాకుండా రెండు కేక్ ప్యాకెట్లు ఇవ్వనున్నారు. మిగిలిన జిల్లాల్లో ఒక్కో విద్యార్థికి ఒక ప్యాకెట్ అందజేస్తారు. మయిలాడుతురై, సేలం, తంజావూరు, మదురై, తిరువణ్ణామలై, తిరుచ్చి, కోయంబత్తూరు, తిరుప్పూర్, నీలగిరి, ఈరోడ్, నమక్కల్, కరూర్ జిల్లాల్లో రెండు ప్యాకెట్లు పంపిణీ చేయనున్నారు.
కేవలం కేకులు అందించడంతోనే ఈ కార్యక్రమం ముగియదు. పిల్లలను ప్రోత్సహించేలా ముఖ్యమంత్రి విజయ్ సంతకంతో కూడిన ప్రత్యేక శుభాకాంక్షల కార్డులను కూడా సిద్ధం చేశారు. బాలల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నుంచి నేరుగా శుభాకాంక్షల సందేశం అందడం విద్యార్థులకు మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోనుంది.
కేకుల నాణ్యత విషయంలోనూ అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఆహార భద్రతా శాఖ అధికారులు వాటిని పరిశీలించి నాణ్యతా ప్రమాణాలను ధ్రువీకరించారు. నవంబర్ 10 నుంచి 12వ తేదీ మధ్య పాఠశాలలకు కేకులను చేరవేసేలా ఏర్పాట్లు చేశారు. వాటిని పరిశుభ్రమైన వాతావరణంలో భద్రపరచాలని పాఠశాలల యాజమాన్యాలకు సూచించారు.
నవంబర్ 13న చెన్నైలోని కొళత్తూరులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. విద్యార్థులకు కేకులు, శుభాకాంక్షల కార్డులు అందించి వేడుకల్లో పాల్గొననున్నారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోనూ పంపిణీ కార్యక్రమం జరగనుంది.
జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు. నవంబర్ 14న జరుపుకునే బాలల దినోత్సవానికి ముందే పిల్లల్లో ఆనందాన్ని నింపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈసారి పుస్తకాలు, బహుమతులతో పాటు కేకులు, ముఖ్యమంత్రి సందేశం కూడా అందనుండటంతో తమిళనాడు విద్యార్థులకు బాలల దినోత్సవం మరింత గుర్తుండిపోయేలా మారనుంది.
This post was last modified on November 13, 2026 9:15 am
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఆదర్శ కుటుంబం సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మల్లారెడ్డి విద్యాసంస్థల వైస్ ఛైర్పర్సన్ డాక్టర్…
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు వున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ, తాజాగా జరిగిన…
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ జనసేన కార్యాలయంలోని కీలక నాయకుల పేర్లతో ఓ వ్యక్తి నిరుద్యోగులను మోసం చేయడం కలకలం సృష్టిస్తోంది.…
ఇటీవల కాలంలో లారెన్స్ బిష్ణోయ్ ముఠా ఆరాచకాలు ఎక్కువై పోతున్నాయి. నిన్నా మొన్నటిదాకా బాలీవుడ్ నటులను టార్గెట్ చేసిన ఈ…
పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి, సూపర్ సక్సెస్ నుంచి బ్లాక్ బస్టర్ వైపు దూసుకుపోతున్న సీన్ వసూళ్లు చాలా స్టడీగా…
కొత్తగా ఏర్పడిన రాష్ట్రం విఠలాచార్య సినిమాలో మాదిరిగా రాత్రికి రాత్రే అభివృద్ధి చెందదు. పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, రకరకాల వ్యాపారాలు,…