Political News

పొత్తుల్లో భిన్నాభిప్రాయాలు సహజమే

రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు వున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ, తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి. అద్భుతమైన విజయం సొంతం చేసుకున్నాయి. అయితే ఎన్నికల్లో ఏక పక్షంగా విజయం సాధించినప్పటికీ అక్కడక్కడా మాత్రం సమన్వయ లోపం కనిపించింది. దాంతో పిల్లి పిల్లి పోరులో ఎలుక విజయం సాధించింది అన్న సామెత తరహాలో మధ్యలో వైసీపీ విజయం సాధించింది. ఈ విషయం మీద మూడు పార్టీల మధ్య సీరియస్ గా చర్చ జరుగుతుంది. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ సమ్మిట్‌ 2026లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే విషయం గురించి మాట్లాడారు.

రాజకీయాల్లో పార్టీల పొత్తుల్లో ఉన్నప్పుడు భిన్నాభిప్రాయాలు, మనస్పర్థలు రావడం అత్యంత సహజమైన విషయమని చంద్రబాబు స్పష్టం చేశారు. కూటమి పార్టీల మధ్య తరచూ సయోధ్య లేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఈ కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. కూటమి పార్టీల మధ్య విభేదాలు ఎప్పుడు వస్తాయా అని గోతికాడి గుంటనక్కలు ఎదురుచూస్తున్నాయని, అయితే తమ మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ వుందని చెప్పారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా కూటమిలోని మూడు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని తెలిపారు. భిన్నాభిప్రాయాలు, తమ మధ్య ఎలాంటి అభిప్రాయ బేధాలు మాత్రం లేవని ఆయన స్పష్టం చేశారు. విశ్వసనీయత గల లీడరైన పవన్ కళ్యాణ్ పోషిస్తున్న పాత్ర చాలా కీలకమైందన్నారు. పవన్ కళ్యాణ్ తో కలిసి రాష్ట్రాన్ని
అభివృద్ధి చేసేందుకు కలిసికట్టుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.

లోకల్ బాడీ ఎన్నికల్లో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొన్న మాట నిజమేనని అంగీకరించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఈ సమస్యను అధిగమిస్తామన్నారు. రెబల్ అభ్యర్థుల వలన నష్టపోయిన నాయకులకు న్యాయం చేస్తామని చెప్పారు. కూటమిలో ముఖ్యంగా టీడీపీ, జనసేన మధ్య విభేదాలున్నట్టు కొందరు వ్యక్తులు చేస్తున్న ప్రచారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో చెక్ పెట్టినట్టయ్యిందని విశ్లేషకులు చెబుతున్నారు.

This post was last modified on November 12, 2026 11:19 pm

Share

Recent Posts

జనసేన నేతల పేరుతో మోసం… నిరుద్యోగులకు 7 కోట్ల టోపీ

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ జనసేన కార్యాలయంలోని కీలక నాయకుల పేర్లతో ఓ వ్యక్తి నిరుద్యోగులను మోసం చేయడం కలకలం సృష్టిస్తోంది.…

34 minutes ago

చంపేస్తాం అంటూ మాజీ సీఎంకు ఫోన్ కాల్

ఇటీవల కాలంలో లారెన్స్ బిష్ణోయ్ ముఠా ఆరాచకాలు ఎక్కువై పోతున్నాయి. నిన్నా మొన్నటిదాకా బాలీవుడ్ నటులను టార్గెట్ చేసిన ఈ…

3 hours ago

సీన్ నుంచి నేర్చుకోవాల్సింది స్క్రీన్‌ప్లేనే

పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి, సూపర్ సక్సెస్ నుంచి బ్లాక్ బస్టర్ వైపు దూసుకుపోతున్న సీన్ వసూళ్లు చాలా స్టడీగా…

3 hours ago

ఇకపై ఏ ప్రభుత్వం వచ్చినా కంపెనీలను టచ్ చెయ్యలేదు

కొత్తగా ఏర్పడిన రాష్ట్రం విఠలాచార్య సినిమాలో మాదిరిగా రాత్రికి రాత్రే అభివృద్ధి చెందదు. పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, రకరకాల వ్యాపారాలు,…

4 hours ago

ఓజి నామస్మరణకు బ్రేక్ ఇస్తే బెటర్

ఈ మధ్య తమన్ తరచుగా తెస్తున్న ప్రస్తావన ఓజి 2. తాజాగా ఇంకో అడుగు ముందుకు వేసి ఓజి 3…

4 hours ago

శర్వానంద్‌కు ఎక్కడ ఖాళీ ఉంది?

తన ఫ్లాపుల పరంపరకు తెరదించుతూ ఈ ఏడాది సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’తో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు…

5 hours ago