Political News

ఇకపై ఏ ప్రభుత్వం వచ్చినా కంపెనీలను టచ్ చెయ్యలేదు

కొత్తగా ఏర్పడిన రాష్ట్రం విఠలాచార్య సినిమాలో మాదిరిగా రాత్రికి రాత్రే అభివృద్ధి చెందదు. పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, రకరకాల వ్యాపారాలు, విద్యా సంస్థలు..ఇలా అన్నీ ఆ రాష్ట్రానికి వస్తే అప్పుడు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. 2014-19 మధ్య కాలంలో సీఎం చంద్రబాబు ఇమేజ్ వల్ల ఏపీకి అవన్నీ తరలివచ్చే ప్రయత్నం మొదలైంది. అయితే, 2019-2024 కాలంలో సీఎం జగన్ హయాంలో ఏపీతోపాటు రాజధాని అమరావతిలో పెట్టుబడులు ఆగిపోయాయి. ఏపీ ఆ అదృష్టానికి…అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచింది.

కొన్ని కంపెనీలకు…సంస్థలకు ఇచ్చిన స్థలాలను జగన్ వెనక్కి తీసుకున్నారు. జగన్ పాలన చూసి కొంతమంది ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గారు. ఇప్పుడు చంద్రబాబు సీఎం అయిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. కానీ, వారిని వెంటాడే భయం ఒకటి ఉంది.

ఒకవేళ 2029లో ప్రభుత్వం మారితే.. మళ్లీ జగన్ వస్తే తమ కంపెనీలకు ఇచ్చిన స్థలాలు వెనక్కి తీసుకుంటారేమో అని వారికి బెంగ పట్టుకుంది. అటువంటి భయాలను పటాపంచలు చేస్తూ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పెట్టుబడులను రాజకీయ మార్పుల నుంచి కాపాడేందుకు ‘ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్’ పేరిట ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిర్ణయించారు.

వచ్చే నెల అసెంబ్లీలో అందుకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టనున్నారు. అంతేకాదు, ఆ ప్రతిపాదనను కేంద్రానికి పంపి తనిఖీ చేయించనున్నారు. ఏదైనా ఒక కంపెనీకి, పరిశ్రమకు, సంస్థకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సౌకర్యాలు, భూములు, అనుమతులను తర్వాత వచ్చే ప్రభుత్వాలు తిరిగి తీసుకోకుండా చూసేలా ఈ చట్టం రూపొందించనున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.

విశాఖలో సీఐఐ ఇన్వెస్టర్ సమ్మిట్‌కు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు ఈ విషయం వెల్లడించారు. ఇకపై, ఎవరైనా ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టినా, తర్వాత వచ్చే ప్రభుత్వం దాన్ని మార్చే అవకాశం లేకుండా ఈ చట్టం రూపొందిస్తామని తెలిపారు. ఈ చట్టానికి సంబంధించి పరిశ్రమల నుంచి సలహాలు, సూచనలు కూడా తీసుకుంటామన్నారు.

This post was last modified on November 12, 2026 7:39 pm

Share

Recent Posts

ఓజి నామస్మరణకు బ్రేక్ ఇస్తే బెటర్

ఈ మధ్య తమన్ తరచుగా తెస్తున్న ప్రస్తావన ఓజి 2. తాజాగా ఇంకో అడుగు ముందుకు వేసి ఓజి 3…

41 minutes ago

శర్వానంద్‌కు ఎక్కడ ఖాళీ ఉంది?

తన ఫ్లాపుల పరంపరకు తెరదించుతూ ఈ ఏడాది సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’తో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు…

1 hour ago

అలా జరగకూడదు చిరు

విశ్వంభర డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. ఆర్టిస్ట్ ప్రవీణ్ నిన్న షేర్ చేసిన ఫోటో వైరలయ్యింది. ఇంకోవైపు కొత్త ట్రైలర్ సిద్ధమయ్యిందని…

2 hours ago

పాదయాత్ర ఒకటే సరిపోదు జగన్

వైసీపీ నేత‌ల నోటి నుంచి వినిపిస్తున్న ఏకైక మాట పాద‌యాత్ర‌. వ‌చ్చే ఏడాదిలో జ‌గ‌న్ 2.0 పేరుతో పాద‌యాత్ర ప్రారంభించ‌నున్నార‌న్న‌ది…

2 hours ago

40 కోట్ల అరంగేట్రం… ఫలితమిస్తుందా?

టాలీవుడ్లో ఎన్నో ఘనమైన అరంగేట్రాలు జరిగాయి. ఐతే ఇప్పుడు ఒక వ్యాపార కుటుంబానికి చెందిన కుర్రాడి విషయంలో.. పెద్ద సినీ…

2 hours ago

ఇడుపు కాయితం వివాదాలపై క్లారిటీ

ఈ మధ్య చిన్న సినిమాలకు వివాదాలే ప్రచార అస్త్రాలుగా మారుతున్నాయి. ఇడుపు కాయితం అనే చిన్న సినిమా విషయంలో ఇలాగే…

3 hours ago