వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి తన కొత్త పార్టీ పేరును ఈ రోజు ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం ప్రకటించినట్లుగానే నవంబరు 11వ తేదీ ఉదయం 11 గంటల 11 నిమిషాలకు తన పార్టీ పేరును వెల్లడించారు. ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (PRP) పేరుతో తన రాజకీయ ప్రస్థానంలో రెండో ఇన్నింగ్స్ ను సాయిరెడ్డి షురూ చేశారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ(పీఆర్పీ)ని గుర్తుకు తెచ్చేలా సాయిరెడ్డి తన పార్టీ పేరు పెట్టిన వైనం చర్చనీయాంశమైంది.
జనం కోసం..జనహితం కోసం..దేశం కోసం..ధర్మం కోసం…అన్న నినాదంతో సాయిరెడ్డి ముందుకు పోతున్నారు. పీఆర్పీ జెండాను కూడా ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రంలో కుటుంబాల ఆధిపత్యానికి, అవినీతికి మరియు కక్షపూరిత రాజకీయాలకు ముగింపు పలకాలన్న ఉద్దేశ్యంతోనే ఈ పార్టీ పెడుతున్నానని సాయిరెడ్డి గతంలో చెప్పారు.
యువతకు (25 నుండి 40 ఏళ్ల మధ్య వయసు వారికి 66 శాతం టికెట్లు) కేటాయించడం, ఉచిత విద్యుత్, ప్రతి ఎకరానికి నీరు అందించడం, ఉద్యోగ అవకాశాలు మరియు ధరల నియంత్రణ వంటి అంశాలపై దృష్టి సారించడం తన పార్టీ ఎజెండా అని తెలిపారు. ఇక, తాను లేదా తన కుటుంబం నుండి 2029లో ఎవరూ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయరని, తాను కేవలం ఒక మార్గదర్శిగా (మెంటార్‌గా) మాత్రమే ఉంటానని గతంలోనే ఆయన ప్రకటించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
