ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ(ప్రస్తుతం ప్రత్యేక జిల్లా)లో వైసీపీ ఘోరంగా దెబ్బతింది. గత 2019 ఎన్నికల్లో బలమైన ప్రభావం చూపించిన పార్టీ 2024 కూటమి ప్రభావానికి కుదేలైంది. అయితే.. ఆ తర్వాత మళ్లీ పుంజుకుంటున్నామన్న సంకేతాలు ఇచ్చింది. ముఖ్యంగా నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది. కానీ.. ఆశించిన మేరకు స్థానిక ఎన్నికల్లో వైసీపీ పుంజుకోలేక పోయింది. దీంతో పార్టీ పూర్తిగా చతికిల పడింది. దీనికి కారణం.. సొంత పార్టీ నాయకులేనన్న వాదన వినిపించింది.
కోనసీమ జిల్లా వ్యాప్తంగా అధికార కూటమి క్లీన్ స్వీప్ చేయడంతో వైసీపీ నేతల పనితీరు, అంతర్గత విభేదాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కోనసీమ పరిధిలోని రామచంద్రపురం, అమలాపురం, ముమ్మిడివరం ప్రాంతాల్లోని మునిసిపాలిటీల్లో వైసీపీకి కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా దక్కలేదని అంటున్నారు. దీనికి అంతర్గత కలహాలతోపాటు సీనియర్ నాయకులు గడప దాటక పోవడం కూడా కారణమని వెల్లడిస్తున్నారు. ఇది అంతిమంగా పార్టీని పునాదుల స్థాయిలోనే దెబ్బతీసిందన్న వాదన వినిపించేలా చేసింది.
రామచంద్రాపురంలో అంతర్గత కలకలం: రామచంద్రాపురం పురపాలక ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైన తర్వాత పార్టీలో తీవ్ర అసంతృప్తి వెల్లడైంది. వైసీపీ చైర్పర్సన్ అభ్యర్థి చింతపల్లి నాగేశ్వరరావు తన ఓటమికి సొంత పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆయన కుమారుడు సూర్యప్రకాష్లే కారణమంటూ బహిరంగంగా ఒక వీడియో విడుదల చేశారు. పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను ఎవరూ నమ్మవద్దని ఆయన ఆరోపించడం పార్టీలో నేతల మధ్య ఉన్న సమన్వయ లోపాన్ని బయటపెట్టింది.
అమలాపురంలో ఖాతా తెరవని వైనం: అమలాపురం మున్సిపాలిటీలో వైసీపీ ఘోర వైఫల్యాన్ని చవిచూసింది. అక్కడ కూటమి తరఫున నిలిచిన జనసేన చైర్పర్సన్ అభ్యర్థి నల్లా శ్రీధర్ భారీ ఆధిక్యంతో విజయం సాధించగా, వైసీపీ కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయింది. నిజానికి మాజీ మంత్రి సహా అనేక మంది కీలక నాయకులు ఇక్కడే ఉన్నారు. పైగా ఎస్సీ సామాజిక వర్గం మొత్తం తమ వెంటే ఉందని వైసీపీ అంచనా వేసింది. కానీ.. ఎస్సీలు కూడా వైసీపీకి ఓటేలేదన్న విషయం ఎన్నికలు ముగిశాక తెలిసింది. దీనికి కూడా నేతలు సరిగా సమన్వయం చేయలేదన్న వాదనను బలం చేకూర్చింది.
ముమ్మిడివరంలో పరాజయం: ముమ్మిడివరం నగర పంచాయతీలోనూ వైసీపీ అభ్యర్థిని సానబోయిన సునీలా దేవిపై కూటమి (జనసేన) అభ్యర్థి గుబ్బల గంగా రత్న భవాని 2,299 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం 23 కౌన్సిలర్ స్థానాలకు గాను టీడీపీ 15, జనసేన 3 కైవసం చేసుకోగా, వైసీపీ కేవలం 5 స్థానాలకే పరిమితమైంది. అయితే.. వైసీపీలో నెలకొన్న అంతర్గత విభేదాలే ఇక్కడ దెబ్బతీశాయని చెబుతున్నారు. బలమైన నాయకుల ఎంపిక నుంచే వివాదాలు నెలకొన్నాయని అంటున్నారు. ఎలా చూసుకున్నా.. కోనసీమ జిల్లాలో వైసీపీ నేతలే దెబ్బేశారని అంటున్నారు.
This post was last modified on November 11, 2026 7:48 am
బరువు తగ్గాలంటే ఆహార నియంత్రణ, వ్యాయామం, క్రమశిక్షణ అవసరమనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుత రోజుల్లో చాలామంది శారీరక…
ఖచ్చితంగా విడుదల తేదీలో మార్పు ఉండదనే దిశగా సంకేతాలు వస్తున్నాయి కాబట్టి వారణాసి రిలీజ్ కాబోయే ఏప్రిల్ 7 కోసం…
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం ఓటర్లపై ఎంతవరకు పడింది అనే అంశంపై…
ఒకప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ అంటే బ్యాటింగ్ ఫైర్ అనేవాళ్లు. ట్రిపుల్ సెంచరీ దగ్గర ఉన్నప్పుడు సిక్సర్ కొట్టాలంటే దానికి చాలా…
ప్రాణాలు విడిచిన భర్తకు.. ఇప్పటి వరకు ఏ భార్యా తలకొరివి పెట్టిన సంఘటనలు జరగలేదు. ఆ దంపతులకు కుమారులు లేకపోతే..…
ప్రపంచ సాంకేతిక రంగంలో అగ్రగామిగా ఉన్న ఓ సంస్థ చుట్టూ ఇప్పుడు గూఢచర్య ఆరోపణలు, వ్యక్తిగత సంబంధాలు, భారీ వ్యాపార…