అన్నా కొణిదెలతో పవన్ విడాకులు!

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా కొణిదెలతో విడాకులు తీసుకుంటున్నట్లు సంచలన సంయుక్త ప్రకటన చేశారు. తామిద్దరం పరస్పర అవగాహనతో ఒకరిపై ఒకరు గౌరవంతోనే విడిపోతున్నామని చెప్పారు. తమ వివాహ బంధం ఒక ముగింపునకు వచ్చిందని పవన్, అన్నా ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. భార్యాభర్తలుగా తమ విడిపోయినప్పటికీ స్నేహితులుగా తాము కలిసే ఉంటామని చెప్పారు. తమ పిల్లల బాధ్యతలను చూసుకుంటామని చెప్పారు. ఇది తామిద్దరం పూర్తి అవగాహనతో తీసుకున్న వ్యక్తిగత నిర్ణయం అని, ఈ సమయంలో తమ గోప్యతను గౌరవించాలని కోరారు.

1996లో నందిని పవన్ వివాహం చేసుకున్నారు. పరస్పర విభేదాల తర్వాత 2008లో వీరికి విడాకులు మంజూరయ్యాయి. ఆ తర్వాత ప్రముఖ నటి రేణు దేశాయ్ ను పవన్ 2009లో వివాహం చేసుకుని, 2012లో విడాకులు తీసుకున్నారు. వీరికి అకిరా నందన్, ఆద్య సంతానం. రష్యన్ నటి అన్నా లెజెనేవా (అన్నా కొణిదెల)ను 2013లో పవన్ పెళ్లి చేసుకున్నారు. 13 ఏళ్ల వివాహ బంధం తర్వాత పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు సంయుక్త ప్రకటన ద్వారా వెల్లడించారు.