Political News

జ‌గ‌న్ చేయ‌లేన‌న్నారు… బాబు చేసి చూపించారు!

ఏపీలో ప్ర‌భుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌.. పింఛ‌ను విధానం. 2004 సెప్టెంబరులోను.. ఆ త‌ర్వాత‌ ఉద్యోగాల్లో చేరిన వారికి పింఛ‌ను స‌మ‌స్య తెర‌మీదికి వచ్చింది. వీరికి అప్ప‌ట్లో రూపొందించిన రూల్స్ మేర‌కు కంట్రిబ్యూట‌రీ పింఛ‌ను విధానం(సీపీఎస్‌) అమ‌లు చేశారు. అంటే.. ప్ర‌భుత్వ ఉద్యోగి జీతం నుంచే పింఛ‌ను నగ‌దును ఉప‌సంహ‌రిస్తారు. ప్ర‌భుత్వ వాటా నామ‌మాత్రంగానే ఉంటుంది. కానీ .. దీనికి ముందు ఉన్న పాత పింఛ‌ను విధానంలో ఉద్యోగి నుంచి ఎంత మొత్తం క‌ట్ చేస్తే.. అంతా ప్ర‌భుత్వం కూడా త‌న వాటాగా వేసేది. దీంతో కొత్త‌గా తెచ్చిన సీపీఎస్ విధానం ఉద్యోగుల‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది.

దేశ‌వ్యాప్తంగా ఉద్యోగులు ఉద్య‌మాలు చేసినా ఫ‌లించ‌లేదు. ఇక‌, ఏపీ విష‌యానికి వ‌స్తే.. సీపీఎస్ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా కూడా ప్రాధాన్యం సంత‌రించుకుంది. 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు పాద‌యాత్ర చేసిన వైసీపీ అధినేత జ‌గ‌న్.. తాను అధికారంలోకి వ‌చ్చిన రెండు వారాల్లోనే ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని చెప్పారు. దీంతో ఉద్యోగులు ఆయ‌న‌ను న‌మ్మి.. వైసీపీకి ఓటేసేశారు. ఫ‌లితంగా 151 స్థానాల్లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. కానీ.. జ‌గ‌న్ మాత్రం ఉద్యోగుల‌కు ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకోలేక పోయారు. ఉద్యోగులు ఏళ్ల త‌ర‌బ‌డి నిర‌స‌న చేసినా.. స్పందించ‌లేదు. పైగా ఒక‌టిరెండు సంద‌ర్భాల్లో స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి మీడియా ముందుకు వ‌చ్చి.. జ‌గ‌న్‌కు తెలియ‌క ఆ హామీ ఇచ్చార‌ని పేర్కొన్నారు.

ఇదేస‌మ‌యంంలో గ్యారెంటీ పింఛ‌ను స్పీమ్‌(జీపీఎస్‌) అంటూ.. కొత్త విధానాన్ని వైసీపీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చింది. కానీ,దీనిని ఉద్యోగులు తిర‌స్క‌రించారు. ఈ స‌మ‌యంలోనే జ‌గ‌న్‌.. సీపీఎస్ బ‌దులు పాత పింఛ‌ను విధానాన్ని అమ‌లు చేయ‌లేమ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ఇది.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీకి తీవ్ర ఎదురు దెబ్బ‌త‌గిలేలా చేసింది. ఇదిలావుంటే.. 2024 ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు ఈ విష‌యంపై ఎక్క‌డా మాట్లాడలేదు. ఉద్యోగుల‌కు ఎలాంటి హామీ కూడా ఇవ్వ‌లేదు. కానీ.. త‌ర‌చుగా ఉద్యోగులు మాత్రం చంద్ర‌బాబును క‌లుస్తూ.. త‌మ డిమాండ్‌ను ఆయ‌న ముందు పెట్టారు.

ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు ప‌లుమార్లు ఢిల్లీ వెళ్లిన‌ప్పుడు.. కేంద్రంతో చ‌ర్చించారు. సీపీఎస్ స్థానంలో ఓల్డ్ పింఛ‌ను స్కీమ్‌(ఓపీఎస్‌)ను అమ‌లు చేసేలా నిబంధ‌న‌లు మార్చాల‌ని కోరారు. ఈ నేప‌థ్యంలో తాజాగా కేంద్రం ఈ నిబంధ‌న‌ల్లో స‌వ‌ర‌ణ తీసుకువ‌చ్చింది. ఫ‌లితంగా 2004 సెప్టెంబ‌రు స‌హా.. ఆ ఏడాది చివ‌రి వ‌ర‌కు జ‌రిగిన అన్ని నియామ‌కాల‌కు సీపీఎస్‌కు బ‌దులు ఓపీఎస్ ఎంచుకునే వెసులు బాటు క‌ల్పించింది.

దీంతో తాజాగా ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఉద్యోగులు, రిటైరైన వారు.. స‌హా.. 2004లో ఉద్యోగాలు పొందిన వారు అర్హుల‌ని భావిస్తే.. ఓపీఎస్‌కు మారాల‌ని పేర్కొంది. సో..మొత్తంగా నాడు జ‌గ‌న్ హామీ ఇచ్చి కూడా నెర‌వేర్చ‌ని ఈ విష‌యాన్ని ఎలాంటి హామీ ఇవ్వ‌కుండానే చంద్ర‌బాబు చేసి చూప‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు సంబ‌రాలు చేసుకుంటున్నారు.

This post was last modified on November 10, 2026 6:59 am

Share

Recent Posts

‘పార్టీని నాశనం చేస్తున్న అవినాష్ రెడ్డి’

కడప జిల్లాలో ఎంపీ అవినాష్ రెడ్డి వైసీపీని సర్వనాశనం చేస్తున్నారని ఓ  సామాన్య కార్యకర్త జగన్ కు లేఖ రాయడం…

13 minutes ago

టపాసులు కాలిస్తే రోగాలు పోతాయా?

దీపావళి అంటే దీపాల వెలుగులు, కుటుంబ సభ్యుల సందడి, మిఠాయిలు, బాణసంచా హడావుడి గుర్తుకొస్తాయి. పండుగ వేళ టపాసులు కాల్చడం…

14 minutes ago

అనిరుధ్ పెళ్లి… అవతారం మార్చేసిన మాజీ సీఎం

కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, సన్ గ్రూప్ యజమాని కళానిధి మారన్ తనయురాలు కావ్య మారన్…

2 hours ago

అన్నా కొణిదెలతో పవన్ విడాకులు!

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా కొణిదెలతో విడాకులు తీసుకుంటున్నట్లు సంచలన సంయుక్త ప్రకటన…

7 hours ago

వియత్నాం ఎయిర్‌పోర్టులో మన పరువు తీశారుగా!

విదేశాలకు వెళ్లడం అంటే కేవలం కొత్త ప్రాంతాలను సందర్శించడం, ఫొటోలు దిగడం, అక్కడి అందాలను ఆస్వాదించడం మాత్రమే కాదు. మన…

9 hours ago

అంతా మనోళ్లే.. అయినా ఓటమి ఎలా? బాబు సీరియస్

ముఖ్యమంత్రి చంద్రబాబుకు పని రాక్షసుడిగా పేరున్న విషయం తెలిసిందే. ఏదైనా అనుకుంటే ఆ పని పూర్తి చేసేవరకు వొదిలిపెట్టారని ఆయనను…

10 hours ago