Political News

2024తో పోలిస్తే కూటమికి ఎంత లాభం? వైసీపీకి ఎంత నష్టం?

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల తర్వాత స్థానిక ఎన్నికలు జరిగాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్ల కంటే ఇప్పుడు మరిన్ని ఓట్లు పెరిగాయి, స్థానిక సంస్థల్లో సీట్లు పెరిగాయి. నిన్నా మొన్నటిదాకా అసెంబ్లీ నియోజకవర్గం స్థాయిలో బలంగా వున్న కూటమి ఇప్పుడు వార్డు స్థాయిలో కూడా బలపడింది. క్షేత్రస్థాయిలో కూడా అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంది. మున్సిపల్, పరిషత్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి సాధించిన విజయాన్ని విశ్లేషించారు.

స్థానిక ఎన్నికల్లో కూటమికి 58.9 శాతం ఓట్లు రాగా వైసీపీకి 33.56 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చి చూస్తే వైసీపీకి 6.25 శాతం ఓట్లు తగ్గాయని, కూటమికి 3.6 శాతం ఓట్లు పెరిగాయని వివరించారు. మొత్తం మీద స్థానిక ఎన్నికల్లో కూటమికి, వైసీపీకి మధ్య 25.34 శాతం గ్యాప్ ఉందన్నారు. పట్టణాల్లో కూటమికి 59.09 శాతం లభించగా వైసీపీకి 34.03 శాతం వచ్చాయని తెలిపారు. 94 శాతం విజయాలు నమోదు చేశామన్నారు. 659 జడ్పీటీసీ స్థానాల్లో కూటమి 575 స్థానాల్లో విజయం సాధించిందని, 9818 ఎంపీటీసీ స్థానాలకు గాను 7803 చోట్ల కూటమి గెలుపు జెండా ఎగరేసిందని చెప్పారు.

ఇన్నాళ్లుగా వైసీపీకి ఎదురులేదని చెప్పుకునే మార్కాపురం జిల్లాలో ఇప్పుడు ఒక్క జడ్పీటీసీ కూడా గెలవలేక పోయిందని, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, పల్నాడు, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో కూడా వైసీపీ ఒక్క జడ్పీటీసీని గెలుచుకోలేక బోల్తా పడిందనిముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. జడ్పీటీసీ ఎన్నికల్లో 28 జిల్లాల్లో 27 చోట్ల కూటమి పార్టీలు విజయ పతాకం ఎగరేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో 90 శాతం మండల అధ్యక్షులను గెలుచుకోవడం కూటమి పాలనకు ప్రజల మద్దతు ఏ స్థాయిలో వుందో తెలియజేస్తుందన్నారు.

ఇన్నాళ్ళూ గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఈవీఎం ట్యాంపరింగ్ చేసినట్లు వైసీపీ ప్రచారం చేస్తూ వచ్చిందని, ఇప్పుడు బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు నిర్వహిస్తే రిగ్గింగ్ చేసినట్లు ఆరోపిస్తున్నారని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్లలో వచ్చిన మెజారిటీని ఏమంటారో చెప్పాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 65.07 శాతం కూటమికి పోస్టల్ ఓట్లు పడ్డాయాని, 27.42 శాతం వైసీపీకి వేశారని చెప్పారు. పరిషత్ ఎన్నికల్లో 62.83 శాతం కూటమికి, 31.46 వైసీపీకి పోస్టల్ ఓట్లు పడినట్లు తెలిపారు. మొత్తం మీద పోస్టల్‌ బ్యాలెట్‌లో కూటమికి 67 శాతం ఓట్లు వచ్చాయన్నారు.

ఈ ఓటమిని వైసీపీ ముందే ఊహించిందని, అందుకే ఎన్నికలు జరగకుండా అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసిందని చంద్రబాబు తెలిపారు. చివరికి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా కోర్టుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. రప్పా రప్పా రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని చెప్పిన ఆయన మా కష్టాన్ని ప్రజలు గుర్తించి పట్టం కట్టారని సంతోషం వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాల్లోనూ కూటమిని ప్రజలు ఆదరించారని ధన్యవాదములు తెలిపారు.

This post was last modified on November 9, 2026 2:15 pm

Share

Recent Posts

చెల్లికి ద్రోహం… తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ సినిమా!

మ‌హిళా సెంటిమెంటు రాజ‌కీయాల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తుంద‌న్న‌ది తెలిసిందే. అందునా.. రాజ‌కీయ నేత‌ల కుటుంబాల‌కు చెందిన మ‌హిళ‌ల విష‌యంలో మ‌రింత‌గా…

1 hour ago

జ‌గ‌న్ ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చి ఉంటే.. !

"జ‌గ‌న్ ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చి ఉంటే.. స్థానిక ఎన్నిక‌ల్లో ఫ‌లితం ఎలా ఉండేది"- ఇదీ ఇప్పుడు వైసీపీని వెంటాడుతున్న ప్ర‌శ్న‌.…

2 hours ago

జడ్పీ పీఠాలపై వారసుల కన్ను!

పరిషత్ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెళ్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో అల్లూరి మన్యం జిల్లా మినహాయించి మిగిలిన 27 జిల్లాల్లో అధికశాతం…

2 hours ago

నయనతారకిది ఊహించని అవమానమే

దీపావళి పండగ సందర్భంగా వంద కోట్ల బొమ్మగా ప్రచారం చేసుకుని విడుదలైన మూకుతి అమ్మన్ 2 (మహాశక్తి) దారుణంగా బోల్తా…

3 hours ago

500 కోట్ల రాజ్యంలో రఘురాముడి విహారం

కొన్ని నెలల క్రితం నెగటివిటీని మోసుకుని టీజర్ ట్రైలర్ టైంలో విమర్శలను చవి చూసిన రామాయణ అంచనాలకు మించి బాక్సాఫీస్…

3 hours ago

రజిని కమల్ ఎంతటి తెలివైనవాళ్ళో

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, లోక నాయకుడు కమల్ హాసన్ నిర్మాతగా గతంలో ఒక సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే.…

4 hours ago