ఆ ఒక్క రాత్రి మందు పార్టి ఖరీదు 120 కోట్లా…?

అమ్మ బాబోయ్ అంటూ అదిరిపడుతున్నారు జనం. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ కుమారుడు, సోదరుడు అనిల్ రెడ్డి కూతురి వివాహం ఇప్పుడు టాక్ ఆఫ్ కంట్రీ అయ్యింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లికి వందలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లి రోజు రాత్రి ఇచ్చిన మందు పార్టీకి 120 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వస్తున్న కథనాలు విస్తుగొలుపుతున్నాయి. దేశ విదేశాలకు చెందిన అరుదైన బ్రాండ్ మందును పెళ్ళిలో అతిధులకు సర్వ్ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయ వివాహం చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అట్టహాసంగా జరిగిన ఈ వివాహ వేడుకలకు దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపార దిగ్గజాలు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, ఏపీ మాజీ సీఎం జగన్, కేటీఆర్, అదాని హాజరయ్యారు. పెళ్లి సందర్బంగా జరిగిన సంగీత్ పార్టీలో అతిథులకు అత్యంత ఖరీదైన మద్యం సర్వ్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. దీని విలువ 120 కోట్ల రూపాయలకు పైమాటే అని చెబుతున్నారు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన బ్రాండ్లుగా పేరున్న 1762 గాటియర్ కగ్నాక్, క్రోయిజట్ 1858 కువిలియోని, లూయిస్ 13 కాగ్నాక్, రోజ్ గోల్డ్ 1996 షాంపెయిన్, రోమని కాంటి గ్రాండ్ కృ 1945 వంటి ప్రీమియర్ లిక్కర్ బ్రాండ్లను విదేశాల నుంచి తెప్పించినట్లు సోషల్ మీడియా కోడై కూస్తుంది. అనిల్ రెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో మద్యం వ్యాపారాలతో సంబంధాలు ఉండటంతో అరుదైన బ్రాండ్లను తెప్పించగలిగినట్లు లిక్కర్ వ్యాపార దిగ్గజాలు చెబుతున్నారు. ఇందులో కొన్ని బ్రాండ్ల మద్యం అంత ఆషామాషీగా లభ్యం కాదంటున్నారు.

మద్యం సంగతి కాసేపు పక్కన పెడితే కళ్లు చెదిరేలా పెళ్లి ఖర్చు చేసినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కేవలం ఫ్లవర్ డెకరేషన్ కోసమే దాదాపు 25 కోట్ల నుండి ₹100 కోట్ల రూపాయల వరకు వెచ్చించినట్లు ప్రచారం జరుగుతుంది. కేటరింగ్ కోసం మరో 130 కోట్లు ఖర్చు చేసినట్లు సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ అంచనా వేస్తున్నాయి. మొత్తం మీద ఈ వివాహ వేడుక రాజకీయ, వ్యాపార వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. అటు గిట్టని వాళ్ళు ఓ రకంగా, ఇటు సోషల్ మీడియా ప్రతినిధులు ఇంకో రకంగా తెగ ప్రచారం చేస్తున్నారు. దీంతో నిన్నా మొన్నటిదాకా ఎవరికి తెలియని అనిల్ రెడ్డి ఇప్పుడు పాపులర్ అయిపోయాడు.