Political News

సామాజిక న్యాయ సుడిగుండంలో ‘వైసీపీ’ ..!

2019 ఎన్నికల్లో వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచిన రెడ్డి సామాజిక వర్గం, 2024 ఎన్నికల నాటికి, ఆ తర్వాత కాలంలో తీవ్ర‌ అసంతృప్తికి లోనైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్‌ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు, పార్టీలో జరిగిన కొన్ని పరిణామాలు, సీనియర్ నేతల దూరం వంటి అంశాల వల్ల సొంత సామాజిక వర్గంలోనే కొంత చీలిక లేదా వైముఖ్యం కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

వైసీపీ మాత్రం అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఇస్తున్నామని, సామాజిక న్యాయం తమ సిద్ధాంతమని చెబుతుండగా, రాజకీయ విశ్లేషకులు మాత్రం రెడ్డి వర్గం మద్దతును తిరిగి కూడగట్టుకోవడం లేదా ఇతర సామాజిక వర్గాలపై (కాపు, బీసీలు వంటివి) దృష్టి సారించడంపై పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కానీ.. జ‌గ‌న్ మాత్రం దీనికి భిన్నమైన వాద‌న‌నే తీసుకుంటున్నారు. రెడ్డి ముద్ర ప‌డితే.. కేవ‌లం ఒక వ‌ర్గానికి మాత్ర‌మే తాము ప‌రిమితం అవుతామ‌న్న‌ది ఆయ‌న వాద‌న.

ఇది రాజ‌కీయంగా వైసీపీ భ‌విష్య‌త్తును చాలా చింద‌ర‌వంద‌ర చేస్తోంద‌ని అంటున్నారు. రెడ్లు బ‌లంగా ఉన్న నెల్లూరు, చిత్తూరు, అనంత‌పురం(కార్పొరేష‌న్ మాత్ర‌మే గెలిచారు) వంటి ప్రాంతాల్లో వైసీపీ ఘోర ప‌రాజ‌యం పాల‌వ‌డానికి .. ముఖ్యంగా పులివెందుల‌లోనూ క‌లిసి రాక‌పోవ‌డానికి ఇంకా రెడ్డి సామాజిక‌వ‌ర్గంలో నెల‌కొన్న తీవ్ర‌మైన అసంతృప్తే కార‌ణ‌మ‌ని అంద‌రూ చెబుతున్నారు. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. అయినా.. జ‌గ‌న్ మారుతాడ‌ని అనుకున్నామ‌ని.. ఆయ‌న మాత్రం మార‌డం లేద‌ని మెజారిటీ నాయ‌కులు చెబుతున్నారు. ఇది సామాజిక వ‌ర్గాల ప‌రంగా ఇబ్బంది పెడుతోంది.

మార్పు ఎప్పుడు.. ?
సామాజిక న్యాయం పేరుతో.. ఇప్ప‌టికీ వైసీపీ చేస్తున్న విన్యాసాలు రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని ఇర‌కాటంలోకి నెడుతున్నాయి. తాజాగా విజ‌య‌వాడ‌ను జ‌న‌ర‌ల్ కేట‌గిరీలో ఇచ్చారు. దీంతో ఇక్క‌డ నుంచి కీల‌క‌మైన రెడ్డి నాయ‌కుడు ఒక‌రు పోటీ చేయాల‌ని అనుకున్నారు. కానీ, అవ‌కాశం ఇవ్వ‌లేదు. అలానే.. గెలిచేందుకు అవ‌కాశం ఉన్న గుంటూరులోనూ ప్ర‌యోగాలు చేశారు. అస‌లు అక్కడ రెడ్ల‌ను స‌మ‌న్వ‌యం చేయ‌లేద‌న్న వాద‌న ఉంది. ఇక‌, సొంత జిల్లా క‌డ‌ప‌లోనూ.. రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని స‌మ‌న్వ‌యం చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఇలా.. రాష్ట్రంలో కీల‌క‌మైన 6 ప్ర‌ధాన జిల్లాల్లో రెడ్డి వ‌ర్గాన్ని దూరం చేసుకున్న ద‌రిమిలా.. వైసీపీకి ఇబ్బందులు త‌ప్ప‌డం లేద‌ని చెబుతున్నారు. అన్ని వేళ‌లా సామాజిక న్యాయం అంటేకుద‌ర‌ద‌ని కుండ బ‌ద్ద‌లు కొడుతున్నారు.

This post was last modified on November 6, 2026 3:04 pm

Share

Recent Posts

45 నిమిషాల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే..

నగరాల్లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. ముఖ్యంగా పర్యాటకులు, భక్తులు అధికంగా వచ్చే ప్రాంతాల్లో రహదారులపై ప్రయాణం చేయడం పెద్ద…

1 hour ago

నటి ఫోన్ కాల్.. డాక్టర్‌కు ఊహించని షాక్!

మలయాళీ సినీ పరిశ్రమకు చెందిన ఇద్దరు నటులు క్రిమినల్ కేసులో అరెస్టు కావడం కేరళలో సంచలనం సృష్టించింది. వైద్య సహాయం…

1 hour ago

చంద్ర‌బాబు క‌ల నెర‌వేరిందా… ?

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల నెర‌వేరిందా? ఆయ‌న ఆశిస్తున్న‌ట్టుగా మ‌రిన్ని పెట్టుబ‌డులు రాష్ట్రానికి చేర‌నున్నా యా? అంటే.. అవున‌నే స‌మాధాన‌మే…

2 hours ago

సంక్షేమ పథకాలకు ఓటర్ కార్డు ఎందుకు?

సర్ వెనక ఏదో కుట్ర జరుగుతుందని ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. తొలుత రోహింగ్యాల ఓట్లను…

2 hours ago

కూట‌మి వాల్యూ తెలిసిందా త‌మ్ముళ్లూ.. !

ఏపీ రాజకీయాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమి అత్యంత కీలకమైన రాజకీయ సమీకరణంగా మారింది. ఈ మూడు పార్టీలు కలిసి…

5 hours ago

ఆదర్శ కుటుంబం.. సగానికి సగం

నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి క్లాసిక్స్ అందించిన జోడీ విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లది. ఐతే ఆ చిత్రాలకు…

5 hours ago