ఎట్టకేలకు స్పందించిన ఏబీఎన్ RK అల్లుడు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కూతురు అంజిలి పెళ్లి గురించి చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఎలహంకలోని తన ఇంట్లో భద్రతా కారణాల రీత్యా అంజిలి పెళ్లి అక్కడ జరపడానికి వీల్లేదని జగన్ అంటున్నారని విమర్శలు వస్తున్నాయి. అయితే, అది జగన్, షర్మిలల ఉమ్మడి ప్రాపర్టీ అని…కాబట్టి అందులో షర్మిల హక్కు ఉంటుందని కొందరు అంటున్నారు. ఇక, అసలు లెక్క ప్రకారం అది షర్మిలదేనని…కానీ, జగన్ ఉమ్మడి ప్రాపర్టీలాగా చూపిస్తున్నారని విజయమ్మ కూడా అన్నట్లు ఒక లేఖ ప్రచారంలో ఉంది.

ఈ క్రమంలోనే ఈ వివాదం గురించి ఆంధ్రజ్యోతి పత్రికలో ఓ కథనం ప్రచురితమైంది. ఆ క్రమంలోనే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ అల్లుడు కోగంటి భాను చేసిన ట్వీట్ సంచలనం రేపింది.

“కొంతమంది మీడియా వారు పక్కింటి విషయాలు చూడటంలో బిజీగా ఉంటూ, తమ సొంతింట్లో ఏం జరుగుతుందో పట్టించుకోవడం లేదు” అంటూ కోగంటి భాను చేసిన ట్వీట్ మీడియా, సోషల్ మీడియా వర్గాల్లో సంచలనం రేపింది. అక్టోబర్ 8, 2026 నుంచి ఏబీఎన్ డైరెక్టర్‌ హోదా నుంచి కోగంటి భాను ప్రకాశ్‌ను తొలగించిన నేపథ్యంలో ఆ ట్వీట్ కు విపరీతమైన ప్రాధాన్యత వచ్చింది.

ఏబీఎన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న వేమూరి రాధాకృష్ణ..ఛైర్మన్‌గా పదోన్నతి పొందారు. ఆర్కే కుమారుడు ఆదిత్య వేమూరి ఎండీగా, కుమార్తె అనూష వేమూరి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా…భాను ప్రకాశ్ స్థానంలో శ్రుతి కీర్తికి డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలోనే జగన్ ను టార్గెట్ చేసిన ఆర్కేను ఆయన అల్లుడు టార్గెట్ చేశాడని వైసీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది.

ఈ క్రమంలోనే తన ట్వీట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారని భాను ప్రకాశ్ క్లారిటీనిచ్చారు. తాను ఇప్పటికీ ఏబీఎన్ లోనే కొనసాగుతున్నానని, కేవలం హైరార్కీ మాత్రమే మారిందని భాను మరో క్లారిఫికేషన్ ట్వీట్ చేశారు. తాను ఇప్పటికీ ఏబీఎన్ లో భాగస్వామినే అని స్పష్టం చేశారు. తన ట్వీట్ తమ మీడియా గురించి కాదని అన్నారు. ఆ మెసేజ్ ఎక్కడికి చేరాలో అక్కడికి చేరింది అని క్లారిటీనిచ్చారు.