Political News

అన్నగా ఫెయిల్.. మామగా ఫెయిల్.. సీఎంగా ఫెయిల్

ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో విధ్వంసం సృష్టించేందుకు ఏపీ మాజీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కావాలనే గొడవలు రేపి ఎన్నికలు జరగకుండా చేసేందుకు ఓ పక్క కోర్టు కేసులు..మరో పక్క గొడవలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇక, సొంత మేనకోడలు పెళ్లి తన ఇంట్లో జరగడానికి వీల్లేదంటూ జగన్ చెబుతున్న వైనంపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ వ్యవహారాలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ సందర్భంగా జగన్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు.

తండ్రి వివేకాను చంపి కూతురు సునీతను ముద్దాయిగా జగన్ చిత్రీకరించారని చంద్రబాబు మండిపడ్డారు. ఇక, తన సొంత చెల్లి షర్మిల కూతురి పెళ్లి తన ఇంట్లో జరగకూడదంటూ జగన్ అడ్డుపడుతున్నారని, మేనమామగా కూడా ఆయన ఫెయిల్ అయ్యారని దుయ్యబట్టారు.

ఇక, రాష్ట్రాన్ని విధ్వంసం చేసి సీఎంగా ఫెయిల్ అయ్యాడని విమర్శించారు. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా విలువలతో కూడిన రాజకీయాలు చేయకుండా అలా కూడా జగన్ విఫలమయ్యారని చురకలంటించారు. శాసన సభకు వస్తే చర్చ జరుగుతుందని, నిజానిజాలు తెలుస్తాయని, కానీ, అక్కడకి రాకుండా ఎమ్మెల్యేగా ఫెయిల్ అయ్యారని అన్నారు.

జగన్‌ వంటి క్రిమినల్‌ లిటిగెంట్స్‌ రాజకీయాల్లో ఉంటే ప్రమాదకరమని చంద్రబాబు అన్నారు. తానే విధ్వంసానికి దిగి.. తానే కోర్టుకు వెళ్లడమనే ఆలోచనలు ఆయనలాంటి వారికే వస్తాయని విరుచుకుపడ్డారు. సుప్రీం కోర్టు తీర్పులను కూడా వక్రీకరించేలా గొడ్డలి పార్టీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును వైసీపీ వక్రీకరిస్తోందని మండిపడ్డారు. అభివృద్ధికి, సంక్షేమానికి వైసీపీ నేతలు అడ్డంకులు కల్పిస్తున్నారని విమర్శించారు. అలాంటి వారిని ప్రోత్సహించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

This post was last modified on October 24, 2026 4:53 pm

Share

Recent Posts

తెలుగు కుర్రాళ్ల దెబ్బ… కివీస్‌ అబ్బా

టీమ్ఇండియాకు మరోసారి బ్యాటర్లే విజయాన్ని అందించారు. న్యూజిలాండ్‌తో రెండో టీ20లో 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ ఒక…

18 minutes ago

గాడ్ ఆఫ్ వార్… త్రివిక్రమ్ తొలి పలుకులు

ఇప్పటిదాకా త్రివిక్రమ్ శ్రీనివాస్ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, యాక్షన్ సినిమాలే తీశాడు. తన సమకాలీన దర్శకులు, తనకంటే జూనియర్లు…

53 minutes ago

బురకాలు వేసుకునివచ్చి మిలిటెంట్లుగా వ్యవహారిస్తున్నారు

స్థానిక ఎన్నికలు ఒక్కొక్కటిగా వాయిదా పడుతున్నాయి. ప్రతిపక్ష వైసీపీ ఏదో ఒక లిటిగేషన్ సృష్టించడమే కాకుండా చీటికీ మాటికీ కోర్టుకు…

1 hour ago

హనుమంతరావు మాటలకు బాధపడ్డ బాబు

“ఆంధ్రాలో ఎన్నికలంటే కొట్టుకుంటారని, తెలంగాణలో అలా ఉండదని” హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అలాంటి…

2 hours ago

కాయితంకి కలిసి వస్తున్న వివాదాలు

చిన్న సినిమాలకు మార్కెటింగ్ చేసుకుని ఓపెనింగ్స్ వచ్చేలా ప్రేక్షకులని ప్రభావితం చేయడం నిర్మాతలకు పెద్ద సవాల్ గా మారిపోయింది. దీంతో…

5 hours ago

మన తెలుగులో ఎప్పటికి ఇలాంటి సినిమా రాదు

రాష్ట్రాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి ఆహార అలవాట్లు ఎలా వేర్వేరుగా ఉంటాయో సినిమాలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. గత…

5 hours ago