ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో విధ్వంసం సృష్టించేందుకు ఏపీ మాజీ సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కావాలనే గొడవలు రేపి ఎన్నికలు జరగకుండా చేసేందుకు ఓ పక్క కోర్టు కేసులు..మరో పక్క గొడవలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇక, సొంత మేనకోడలు పెళ్లి తన ఇంట్లో జరగడానికి వీల్లేదంటూ జగన్ చెబుతున్న వైనంపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ వ్యవహారాలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ సందర్భంగా జగన్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు.
తండ్రి వివేకాను చంపి కూతురు సునీతను ముద్దాయిగా జగన్ చిత్రీకరించారని చంద్రబాబు మండిపడ్డారు. ఇక, తన సొంత చెల్లి షర్మిల కూతురి పెళ్లి తన ఇంట్లో జరగకూడదంటూ జగన్ అడ్డుపడుతున్నారని, మేనమామగా కూడా ఆయన ఫెయిల్ అయ్యారని దుయ్యబట్టారు.
ఇక, రాష్ట్రాన్ని విధ్వంసం చేసి సీఎంగా ఫెయిల్ అయ్యాడని విమర్శించారు. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా విలువలతో కూడిన రాజకీయాలు చేయకుండా అలా కూడా జగన్ విఫలమయ్యారని చురకలంటించారు. శాసన సభకు వస్తే చర్చ జరుగుతుందని, నిజానిజాలు తెలుస్తాయని, కానీ, అక్కడకి రాకుండా ఎమ్మెల్యేగా ఫెయిల్ అయ్యారని అన్నారు.
జగన్ వంటి క్రిమినల్ లిటిగెంట్స్ రాజకీయాల్లో ఉంటే ప్రమాదకరమని చంద్రబాబు అన్నారు. తానే విధ్వంసానికి దిగి.. తానే కోర్టుకు వెళ్లడమనే ఆలోచనలు ఆయనలాంటి వారికే వస్తాయని విరుచుకుపడ్డారు. సుప్రీం కోర్టు తీర్పులను కూడా వక్రీకరించేలా గొడ్డలి పార్టీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పును వైసీపీ వక్రీకరిస్తోందని మండిపడ్డారు. అభివృద్ధికి, సంక్షేమానికి వైసీపీ నేతలు అడ్డంకులు కల్పిస్తున్నారని విమర్శించారు. అలాంటి వారిని ప్రోత్సహించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates