Political News

కీల‌క స‌మ‌యంలో కాడి ప‌డేస్తున్నారు

ఏ రాజ‌కీయ పార్టీకైనా కూడా ఎన్నిక‌లే కీల‌కం. తమ స‌త్తా నిరూపించేందుకు…. త‌మ బ‌లం చాటుకునేందుకు ప్ర‌జల్లో త‌మ‌కు ఉన్న హ‌వాను నిరూపించుకునేందుకు కూడా ఎన్నిక‌ల‌ను ప్రామాణికంగా తీసుకుంటారు. అందుకే ఎన్నిక‌ల వేళ ఎన్ని విభేదాలు ఉన్న‌ప్ప‌టికీ.. నాయ‌కులు క‌ల‌విడికి ప్రాధాన్యం ఇస్తారు. కార్య‌క‌ర్త‌ల నుంచి నాయ‌కుల వ‌ర‌కు కూడా కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తారు. కానీ, చిత్రంగా వైసీపీ ప‌రిస్థితి ఇప్పుడు ఇబ్బందుల్లో కూరుకుపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా నాయ‌కులు పార్టీని వీడిపోతున్నారు.

ఒక చోట, ఒక నియోజ‌క‌వ‌ర్గం అయితే ప‌రిస్థితి వేరేగా ఉండేది. కానీ, దాదాపు స‌గానికి పైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు వంద‌ల సంఖ్య‌లో ఆ పార్టీని వీడి టీడీపీ కండువా కప్పుకొంటున్నారు. ముఖ్యంగా రాజ‌ధాని ప్రాంతం మంగ‌ళ‌గిరిలో రాత్రికి రాత్రి 150 కుటుంబాల‌కు చెందిన వైసీపీ నాయ‌కులు మంత్రి లోకేష్ స‌మ‌క్షంలో సైకిల్ ఎక్కారు. ఈ ప‌రిణామం మంగ‌ళ‌గిరి స్థానిక ఎన్నిక‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంది. అస‌లే ఇబ్బందుల్లో ఉన్న పార్టీకి ఇది మ‌రింత ఆటు పోటుగా మారింది.

స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోనూ పార్టీ నుంచి నాయ‌కులు బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. నిజానికి కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డి నేతృత్వంలో స‌ర్వేప‌ల్లి వైసీపీ బ‌లంగా ఉంద‌ని అనుకుంటున్న త‌రుణంలో తాజాగా 100 మంది నాయ‌కులు, కార్య‌క‌ర్తలు.. మాజీ మంత్రి సోమిరెడ్డి సార‌థ్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. విశాఖ‌లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. ఇక‌, గుంటూరు, క‌ర్నూలులోనూ.. వైసీపీ నేత‌లు పార్టీని వీడి టీడీపీ గూటికి చేరిపోయారు. ఇలా.. నాయ‌కులు కీల‌క స‌మయంలో పార్టీ కాడి ప‌డేస్తున్న తీరు.. వైసీపీకి మైన‌స్ అయింది.

ఎందుకిలా.. ?
నాయ‌కులు కీల‌క స‌మ‌యంలో ఇలా కాడి ప‌డేయ‌డానికి ప్ర‌ధాన కార‌ణం.. ఏంట‌నేది వైసీపీలో చ‌ర్చ‌కు దారితీసింది. త‌మ‌కు న‌చ్చ‌ని వారికి స్థానికంలో అవ‌కాశం ఇవ్వ‌డంతోపాటు.. క‌నీసం త‌మ ప్రతిపాద‌న‌ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేద‌న్న వాద‌న వైసీపీలో ఉంది. అలానే.. ఇప్ప‌ట్లో ఎలానూ అసెంబ్లీ ఎన్నిక‌లు లేక‌పోవ‌డంతో స్థానికంగా అభివృద్ధి, ప‌నులు చేయించుకునేందుకు అధికార పార్టీ అయితేనే బెట‌ర్ అని భావించ‌డం కూడా దీనికి కార‌ణంగా క‌నిపిస్తోంది. మ‌రోవైపు.. ఈ కీల‌క స‌మయంలో త‌మ‌కు మ‌ద్ద‌తిచ్చేవారికి టీడీపీ కూట‌మి నాయ‌కులు ప్రాధాన్యం ఇస్తుండ‌డం కూడా ఈ చేరిక‌లకు కార‌ణంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.

This post was last modified on October 22, 2026 9:53 am

Share

Recent Posts

రజినీకి ఎంత ముట్టింది?

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఏమాత్రం కష్టపడకుండా, సుకుమారంగా సినిమాలు చేస్తూనే వందల కోట్ల వసూళ్లు రాబట్టే హీరో అంటే సూపర్…

2 hours ago

దిల్ రాజు తీసుకున్న తెలివైన నిర్ణయం

విడుదల ఇంకా పదమూడు రోజులు ఉండగానే అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టడం ఈ మధ్య కాలంలో ఏ ప్యాన్ ఇండియా సినిమాకు…

2 hours ago

స్థానిక నామినేషన్లలో డిష్యుం డిష్యుం

ఎంపిటిసీ, జడ్పిటీసీ ఎన్నికలకు సంబందించి నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. మున్సిపల్ ఎన్నికల తరహాలోనే ప్రాదేశిక ఎన్నికల నామినేషన్లలో కూడా…

9 hours ago

లిటిల్ హార్ట్స్ మౌళికి టీవీ ఛానెల్ బ్లాక్‌మెయిల్

యూట్యూబ్‌లో ఫ‌న్నీ వీడియోలు చేసుకునే మౌళి.. నైంటీస్ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్‌తో త‌న టాలెంట్ ఏంటో చూపించాడు. ఇక…

14 hours ago

ప్రేక్షకులను ఎక్కువ గ్రాంటెడ్‌గా తీసుకోవద్దు

ఒకప్పుడు ఆషామాషీ గ్రాఫిక్స్ తో సినిమా తీసినా చెల్లిపోయేది. స్క్రీన్ ప్లే మేజిక్, మంచి పాటలు పడితే ఎఫెక్ట్స్ లోపాలు…

14 hours ago

శత్రువుకు శత్రువు మనకు మిత్రుడే

ఏపీలో సుమారు 12 కార్పొరేష‌న్ల స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. అయితే.. వీటిలో రెండేరెండు కార్పొరేష‌న్లకు సంబంధించిన చ‌ర్చ జోరుగా సాగుతోంది.…

14 hours ago