ఫ్యాక్షన్ గొడవలకు దిగొద్దు అంటున్న జేసీ

రాయలసీమకు సాహిత్య, సాంస్కృతిక చరిత్ర వుంది. సినిమా వాళ్ళు, కొందరు రాజకీయ నాయకుల పుణ్యమాని ఫ్యాక్షన్ ప్రాంతంగా పేరు పడిపోయింది. ఎంతగా అంటే… రాయలసీమ అనగానే ఫ్యాక్షన్ గుర్తొచ్చేంతగా… అలాంటి రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాల్లో తలపండిన నాయకుడు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు నేను మంచివాడిగా మారాను, నా మాట వినండి, ఫ్యాక్షన్ గొడవలు మానండి అని చెబుతున్న మాటలు చర్చనీయాంశంగా మారాయి.

ఫ్యాక్షన్ రాజకీయాలతో గొడవలు జరిగి ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, తలచుకుంటే బాధేస్తుందని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్షన్ గొడవలతో ప్రజలు సాధించేది ఏమీ లేదని స్పష్టం చేశారు. జరిగిందేదో జరిగిపోయింది ఇకపై ఎలాంటి గొడవలు వద్దు, పిల్లల చదువులు, వారి భవిష్యత్తు, ఇకపై ఎలాంటి గొడవలు వద్దు.. పిల్లల చదువులు, కుటుంబ భవిష్యత్తు, కుటుంబ సభ్యుల జీవితంపై దృష్టి పెట్టాలని సూచించారు.

రాయలసీమలో వ్యక్తిగత విభేదాల కంటే రాజకీయ విభేదాలే ఎక్కువని ప్రచారంలో ఉన్నమాట తెలిసిందే. రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు చంపుకోవడం గతంలో జరిగింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి రావద్దని చెబుతున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. రాజకీయ విభేదాలు వ్యక్తిగత శత్రుత్వాలుగా మారకూడదని, దానివల్ల ఆశాంతి తప్ప మరేమి. మిగలదన్నారు. రాజకీయ నేతల మధ్య ఉన్న విభేదాల కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడటం బాధాకరమని, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు.

తాను కూడా గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలు చేశానని గుర్తు చేసిన జేసీ అందుకుగాను తనను క్షమించాలని కోరారు. ఒకప్పుడు నేను మంచివాడ్ని కాకపోవచ్చు, ఇప్పుడు మారాను, కాబట్టే ఫ్యాక్షన్ కు దూరంగా ఉండమని చెబుతున్నాను అన్నారు. ప్రజలకు మంచి జరగాలని, రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రాజకీయాల కంటే నాలుగు చెరువులు నింపడానికే ప్రయత్నం చేస్తానని జేసీ స్పష్టం చేశారు.