మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ (రాధా) విజయవాడ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున నామినేషన్ వేస్తుండడం విజయవాడలో రాజకీయంగా ఉత్కంఠకు దారితీసింది. ఈ సీటును టీడీపీ నేతలు ఆశించడం.. పొత్తులో భాగంగా ఇది జనసేనకు ఇచ్చేయడంతో టీడీపీ శ్రేణులు, నాయకులు దిగ్బ్రాంతిలో ఉన్నారు. మరోవైపు.. పుష్కరకాలం తర్వాత.. రాధాకు ఊపు రావడంతో కాపు సామాజిక వర్గంతోపాటు రంగా అభిమానులు కూడా వేలాదిగా విజయవాడకు చేరుకున్నారు. దీంతో పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి.. ఎలాంటి ఉద్రిక్తతలు
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తరపున జనసేన అభ్యర్థిగా ఆయనను ఎంపిక చేసినా.. కూటమి పార్టీల మధ్య ఈ సీటు విషయంలో సయోధ్యను కుదర్చలేక పోయారన్నది వాస్తవం. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా తన వారసుడిగా రవితేజను ఎంట్రీ ఇప్పించాలని అనుకున్నారు. కానీ, ఆయనకు ఆశాభంగం ఏర్పడింది. ఈయన కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడే కావడంతో పరిస్తితి ఏ క్షణంలో ఎలా ఉంటుందోనన్న చర్చ సాగుతోంది. ఇది కూడా పోలీసులు అలెర్ట్ అయ్యేలా చేసింది.
ఇక, నామినేషన్ ఘట్టాన్ని భారీగా నిర్వహించాలని రాధా ప్లాన్ చేవారు. తన తండ్రి స్వర్గీయ వంగవీటి మోహన రంగా విగ్రహానికి నివాళులర్పించి, అభిమానులు, కూటమి శ్రేణులు మరియు జనసేన కార్యకర్తలతో కలిసి లక్ష మందితో భారీ ర్యాలీగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేయనున్నారు. జనసేన పార్టీకి చెందిన ప్రసిద్ధ వారాహి వాహనంపై ఈ నామినేషన్ ర్యాలీ నిర్వహించడంతో రోడ్లన్నీ జనసందోహంగా మారాయి.
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో, కూటమి నేతల మద్దతుతో ఈ కార్యక్రమం జరగడం, అలాగే బెజవాడ రాజకీయాల్లో కీలకమైన వంగవీటి రంగా అభిమానులు, కాపు సామాజికవర్గ నేతలు రాష్ట్రం నలుమూలల నుండి భారీగా తరలిరావడంతో విజయవాడలోని ప్రధాన రహదారులన్నీ పూర్తిగా దిగ్బంధమయ్యాయి. సుమారు 12 ఏళ్ల తర్వాత వంగవీటి రాధా నేరుగా ఎన్నికల బరిలో (మేయర్ అభ్యర్థిగా) దిగుతుండటంతో బెజవాడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates