Political News

సీట్ల సర్దుబాటుపై మంత్రి సంధ్యారాణి ఎమోషనల్

స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం, సర్దుబాటుపై చర్చ మొదలైంది. రిజర్వేషన్ల ప్రకారం, అక్కడ ఆయా పార్టీల బలాబలాలు, పలు సమీకరణాలను బట్టి సీట్ల సర్దుబాటు జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసి సీట్ల పంపకంపై తుది నిర్ణయం తీసుకున్నారు. అయితే, కొన్ని చోట్ల టీడీపీ నేతలకు, కొన్ని చోట్ల జనసేన నేతలకు సీట్ల పంపకాల విషయంలో అసంతృప్తి ఉంది. ఈ క్రమంలోనే మంత్రి గుమ్మడి సంధ్యారాణి తన ఆవేదన చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు.

చైర్మన్..కౌన్సిలర్లు..మనవాళ్లు ఉంటే ఇంకా బాగుంటుందని ఆవేదనతోనే తాను ఈ విషయం చెబుతున్నానని సంధ్యారాణి అన్నారు. అంతేగానీ, పార్టీని ప్రశ్నించాలనో, క్రమశిక్షణ తప్పాలనో కాదని క్లారిటీనిచ్చారు. మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో జరిగిన నియోజకవర్గ స్థాయి నేతల సమావేశంలో ఆమె తన ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు నియోజకవర్గాలలో మూడు ఎస్టీలు..ఒక ఎస్సీ ఉన్నాయని, బీసీలకు అన్యాయం జరిగిందని ఆమె అన్నారు. ప్రజా ప్రతినిధులుగా తమను భుజాల మీద మోసి గెలిపించింది బీసీలని ఎమోషనల్ అయ్యారు.

కాబట్టి ఈ రోజు వారికి అవకాశం రావాలి అనుకున్నామని, కానీ, మూడింటిలో రెండు జనసేనకు కేటాయించడం ధర్మమా, న్యాయమా, ఇది పొత్తా అని ప్రశ్నించారు. తాను తన కార్యకర్తలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నానంటూ సంధ్యారాణి కన్నీటిపర్యంతమయ్యారు. అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు రెడీగా ఉన్నామని, కానీ, జిల్లా పరిషత్ కూడా ఎస్టీ అభ్యర్థికి కేటాయించారని అన్నారు. దాన్ని కూడా ఏం చేయలేకపోయామని, కొన్ని ఏమీ చేయలేమని, కానీ, చేయగలిగినవి…మన చేతిలో ఉన్నవి..దయచేసి చేయాలని అభ్యర్థించారు.

This post was last modified on October 17, 2026 12:49 pm

Share

Recent Posts

పులివెందులలో ఫైరింగ్… హై టెన్షన్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ సందర్భంగా రాష్ట్రంలో పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. పులివెందులలో పోలీసులపైకి వైసీపీ కార్యకర్తలు…

58 minutes ago

టైగర్ వచ్చాడు… డబుల్ సెంచరీ దాటేశాడు

సూపర్ స్టార్ రజనీకాంత్ సత్తా ఏంటో మరోసారి బాక్సాఫీస్ సాక్షిగా బయట పడుతోంది. టాక్ యునానిమస్ లేకపోయినా ఎబోవ్ యావరేజ్…

1 hour ago

ఇక‌ ఎదురుదాడికే సై అంటున్న బీజేపీ

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల‌న్న డిమాండ్‌తో పాటు... ప్ర‌స్తుత దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతు న్న…

3 hours ago

న‌న్ను ఉరేయండి… అభిజిత్ దీప్కే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఢిల్లీలో నిర‌స‌న‌లు చేప‌ట్ట‌డం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచాల‌ని భావిస్తున్న కాక్రోచ్ జ‌న‌తా పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజిత్ దీప్కేపై పోలీసులు…

4 hours ago

మాట తప్పకు కుటుంబం… ముంచుకొస్తోంది సమయం

ప్యాన్ ఇండియా మూవీ కాకపోయినా, వందల కోట్ల బడ్జెట్ పెట్టకపోయినా ఆదర్శ కుటుంబం ఏకే 47 వాయిదాలు దగ్గుబాటి అభిమానులను…

4 hours ago

జనసేన అభ్యర్థుల జాబితా విడుదల… విజయవాడ ఆయనకే

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంది. ఈ క్రమంలోనే కూటమి పార్టీల అధినేతలు ఒక అవగాహనకు వచ్చి సీట్ల…

4 hours ago