Political News

దేశంలో గందరగోళం సృష్టించేందుకు లైసెన్స్ ఇవ్వలేదు

ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో ఆందోళన చేపట్టిన ప్రతిపక్ష కాంగ్రెస్, కాక్రోచ్ జనతా పార్టీల మీద అధికార ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ ఎదురుదాడి మొదలుపెట్టింది. విపక్షాల ఆందోళనలు రోజురోజుకు తీవ్రతరం కావడంతో ఏమి చేయాలో పాలుపోని కమలనాధులు చివరకు ప్రత్యారోపణలను ఎక్కు పెడుతున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

యువశక్తిని వాడుకొని విపక్షాలు దేశంలో ఆరాచకాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన దేశంలో గందరగోళం సృష్టించేందుకు విపక్షాలకు లైసెన్స్ ఇవ్వలేదని ఘాటైన విమర్శలు చేశారు. కాక్రోచ్ పార్టీతో కలిసి ఆందోళన చేయడాన్ని పరోక్షంగా ప్రస్థావించారు. దేశంలోని యువతను కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పావులుగా వాడుకుంటుందని ఆరోపించారు. పైకి సర్ ప్రక్రియ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా గురించి మాట్లాడుతున్నారు కానీ వారి ఆందోళనల వెనక అసలు ఉద్దేశ్యం వేరుగా వుందన్నారు. ప్రజాస్వామ్య సంస్థల్ని కూల్చి వేసి దేశాన్ని తగల బెట్టడమే వారి ఏకైక అజెండా అని తీవ్రమైన ఆరోపణలు చేశారు.

రాజ్ నాధ్ సింగ్ ఆరోపణలపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశ ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేస్తోంది ఎవరో ప్రజలకు బాగా తెలుసని చెబుతున్నారు. కేవలం ఒక వ్యక్తిని కాపాడ్డం కోసం మొత్తం కేంద్ర ప్రభుత్వం కాపు కాయడం వెనక అసలు ఉద్దేశ్యం రుణం తీర్చుకోవడమేనా అని ప్రశ్నిస్తున్నారు. ఈసీ రాజీనామా చేయమని అడిగితే బీజేపీ నాయకులు ఎందుకు ఉలిక్కి పడుతున్నారో చెప్పాలని నిలదీయడంతో ఢిల్లీ రాజకీయాలు వేడెక్కాయి.

ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజు నుంచి ఆందోళనలు చేపట్టడం తెలిసిందే. నిరసనకారుల డిమాండ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనవసరంగా పట్టుదలకు పోతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీని వల్ల అంతిమంగా బీజేపీకే నష్టం చేకోరుతుందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. అటు విపక్షాలు ఇటు అధికార పార్టీ తెగేదాకా లాగుతుండటం వల్ల మధ్యలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, త్వరగా ఒక ముగింపు ఇస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.

This post was last modified on October 16, 2026 3:37 pm

Share

Recent Posts

అనిరుధ్, కావ్య పెళ్లి విందుకు రండి

అనిరుధ్ ర‌విచంద‌ర్ పేరుకు త‌మిళ సంగీత ద‌ర్శ‌కుడే కానీ.. ప్ర‌స్తుతం ఇండియాలో అత‌నే నంబ‌ర్ వ‌న్ అన‌డంలో ఎవ‌రికీ సందేహాలు…

2 hours ago

పెళ్లి కోసం హ‌త్య‌: 23 ఏళ్లుగా ప్రేమ ఖైదీలు!

ఆ యువ‌తీ యువ‌కులు.. గాఢంగా ప్రేమించుకున్నారు. త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుని స్థిర‌ప‌డ‌దామ‌ని అనుకున్నారు. కానీ, విధి వ‌క్రించింది. ఓ వ్య‌క్తిని…

2 hours ago

నాగార్జున మళ్ళీ పంచులు వేశారు

కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి రిలీజ్ డేట్ల వ్యవహారం గురించి పంచులు వేశారు. నేరుగా సినిమా పేర్లు ప్రస్తావించకపోయినా, అన్నది…

4 hours ago

ఏపీలో నామినేష‌న్ల తొలిరోజు: ర‌ణ‌రంగ‌మే!

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు శుక్ర‌వారం తెర‌దీశారు. నామినేష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. అయితే.. తొలిరోజే ఉమ్మ‌డి క‌డ‌ప, ఉమ్మ‌డి…

5 hours ago

సీబీఐకి సాయికృష్ణ కేసు: హైకోర్టు సంచ‌ల‌న తీర్పు!

విజ‌య‌వాడ కృష్ణ‌లంక‌కు చెందిన గాదె సాయికృష్ణ డెత్ మిస్ట‌రీ కేసులో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఈ కేసును సీబీఐ ద‌ర్యాప్తున‌కు…

5 hours ago

జైలర్ 2 కత్తిరింపుల మీద అనుమానాలు

నిన్న రిలీజైన జైలర్ 2 టాక్, కలెక్షన్లు కాసేపు పక్కనపెడితే ఫ్యాన్స్ నుంచి వచ్చిన కంప్లయింట్స్ కొన్ని ఉన్నాయి. వాటిలో…

5 hours ago