Political News

మేం రెడీ… క‌విత‌క్క ప్ర‌క‌ట‌న‌!

ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక ఖాయ‌మే అయినా.. ఇంకా షెడ్యూల్ రాలేదు.. నోటిఫికేష‌న్ కూడా ప్ర‌క‌టించ‌లేదు. అస‌లు ఇంకా కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఈ నియోజ‌క‌వ‌ర్గం ఖాళీ అయిన‌ట్టుగా గెజిట్ నోటిఫికేష‌న్ కూడా జారీ చేయ‌లేదు. హైకోర్టు, సుప్రీంకోర్టులు దానం నాగేంద‌ర్‌పై అన‌ర్హ‌త వేటు వేసిన‌ట్టు తీర్పు ఇచ్చాయి. దీని పూర్తి కాపీని ఎన్నిక‌ల సంఘం ప‌రిశీలించి.. గెజిట్ ప్ర‌క‌ట‌న చేయాల్సి ఉంది. ఆ త‌ర్వాత ఆరు మాసాల‌లోగా ఉప పోరు తెర‌మీదికి రానుంది.

అయితే.. అంద‌రిక‌న్నా ముందే అన్న‌ట్టుగా తెలంగాణ ర‌క్ష‌ణ సేన అధ్య‌క్షురాలు.. క‌ల్వ‌కుంట్ల క‌విత తాజాగా సంచల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే ఉప ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ పోటీ చేస్తుంద‌న్నారు. త్వ‌ర‌లోనే తాను ఖైర‌తాబాద్‌లో ప‌ర్య‌టి స్తాన‌ని చెప్పారు. పాద‌యాత్ర‌గా వెళ్లి అక్క‌డి ప్ర‌జ‌ల‌ను ప‌ల‌క‌రిస్తాన‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా బీఆర్ ఎస్ నేత‌ల పై క‌విత నిప్పులు చెరిగారు. గ‌తంలో ఎమ్మెల్యేగా ఉన్న‌వారు ఎవ‌రూ ఖైర‌తాబాద్‌ను ప‌ట్టించుకోలేద‌ని చెప్పారు. ఇక్క‌డ నుంచి గెలిచి.. టీఆర్ఎస్ త‌న స‌త్తాను చాటుతుంద‌న్నారు.

ఫాం హౌస్‌పై..

కేసీఆర్ ఫాం హౌస్ రాజ‌కీయాలు చేస్తున్నారంటూ.. క‌విత ఎద్దేవా చేశారు. బ‌య‌ట‌కు వ‌స్తే.. గ‌త ప్ర‌భుత్వ లోపాల‌పై ప్ర‌జ‌లు నిల‌దీస్తార‌ని ఆ పెద్దాయ‌న భ‌య‌ప‌డుతున్నారంటూ వ్యాఖ్యానించారు. అందుకే ఫామ్ హౌస్‌లోనే ఉంటున్నారని వ్యాఖ్యానించారు. ఎక్క‌డున్నా.. ప్ర‌శ్నించి తీరుతామ‌న్నారు. ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెట్ట‌డం ఎవ‌రి వ‌ల్లా కాద‌ని వ్యాఖ్యానించారు. ఇక‌, సీఎం రేవంత్‌పైనా క‌విత విమ‌ర్శ‌లు గుప్పించారు. 22ఏ భూముల గురించి మాట్లాడ‌మంటే.. ఫామ్ హౌస్‌ల‌పై మాట్లాడార‌ని అన్నారు.

కానీ, ఎలాంటి చ‌ర్య‌లు ఉండ‌వ‌ని.. ఎద్దేవా చేశారు. ఇదంతా ఊక‌దంపుడు ఉప‌న్యాస‌మేన‌ని క‌మిటీల కాల‌యాప‌నేన‌ని అన్నారు. రెండు పార్టీలు మిలాఖ‌త్ అయిన‌యి.. అని వ్యాఖ్యానించారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఫామ్ హౌస్ రాజ‌కీయాల‌కు తెర‌దీసింద‌ని క‌విత దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌జ‌ల త‌ర‌ఫున కొట్లాడేందుకు.. తాను సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పుకొచ్చారు.

This post was last modified on September 28, 2026 6:20 am

Share

Recent Posts

`వ‌ర్గాల‌`కు దూర‌మ‌వుతున్న వైసీపీ.. ?

రాష్ట్ర రాజకీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌తో వైరం ఎలా ఉన్నా.. ప్ర‌జ‌ల‌తో మాత్రం పార్టీల‌కు సాన్నిహిత్యం ఉండాలి. అది కొర‌వ‌డితే.. ఎప్పటికీ చేరువ…

8 minutes ago

నాని సినిమాలో ఆ పార్ట్… ద‌ర్శ‌కుడికీ న‌చ్చ‌లేద‌ట‌

నేచుర‌ల్ స్టార్ నాని కెరీర్లో ప్ర‌త్యేకంగా చెప్పుకోద‌గ్గ చిత్రాల్లో శ్యామ్ సింగ‌రాయ్ ఒక‌టి. ట్యాక్సీవాలాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన రాహుల్…

18 minutes ago

నాని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు

పెద్ద బ‌డ్జెట్ పెట్టి, చాలా కాలం క‌ష్ట‌ప‌డి, ఎన్నో ఆశ‌ల‌తో చేసిన సినిమాకు నెగెటివ్ టాక్ వ‌స్తే త‌ట్టుకోవ‌డం తేలిక…

20 minutes ago

అమ‌రావతికి పంచ సూత్రాలు… చంద్ర‌బాబు భారీ ప్లాన్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో అత్యంత శ్ర‌ద్ధ చూపిస్తున్న విష‌యం తెలిసిందే. రైతుల నుంచి భూములు స‌మీక‌రించ‌డం(పూలింగ్‌)…

2 hours ago

త్రివిక్ర‌మ్ మొద‌టి డైలాగ్ రాసిందెవ‌రికి?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? ర‌చ‌యిత‌గా త‌న తొలి సినిమా స్వ‌యంవ‌రం కాబ‌ట్టి.. ఆ సినిమాకే…

6 hours ago

గ‌న్న‌వ‌రంలో వంశీ సెంటిమెంటు రాజ‌కీయం.. !

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…

7 hours ago