డీఎస్సీ-2025లో అక్రమాలు జరిగాయని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మరోసారి ఆరోపించారు. ఈ విషయంపై అన్ని ఆధారాలను గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు వివరించానన్నారు. ఇక, మిగిలింది.. మంత్రి లోకేష్ రాజీనామా చేయడమేనని డిమాండ్ చేశారు. తాజాగా బుధవారంసాయంత్రం ఆయన గవర్నర్ నజీర్‌ను లోక్‌భవన్‌లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్సీ-2025లో స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆయనకు వివరించారు. సీబీఐ విచారణకు ఆదేశించేలా ప్రభుత్వాన్ని కోరాలని గవర్నర్‌ను అభ్యర్థించారు. అనంతరం.. జగన్ లోక్‌భవన్ ముందు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నాలుగు కీలక అంశాలను ఆయన వివరించారు.
డీఎస్సీ అక్రమాలకు పాల్పడిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం లోక్‌భవన్‌లో గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్‌తో భేటీ అయ్యారు. శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ నాయకులపై జరిగిన దాడికి సంబంధించి ఆయన గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే డీఎస్సీ–2025లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. గవర్నర్‌తో భేటీ అనంతరం వైఎస్ జగన్ లోక్‌భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు.
This post was last modified on September 24, 2026 12:48 pm
సోషల్ మీడియాలైన ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టా గ్రామ్ వంటి వాటిలో వీడియోలు, రీల్స్ చేసి.. ప్రజలకు చేరువయ్యే ఇన్‌ఫ్లుయెన్సర్లను అధికారికంగా…
బాక్సాఫీస్ వద్ద పోటీకి సంబంధించి రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దసరా పండగ టార్గెట్ గా ఈసారి క్రేజీ సినిమాలు…
గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయ పరిస్థితి ప్రస్తుతం సవాలుగా మారింది. రాజకీయంగా ఆయన తన తమ్ముడి కొడుకును…
కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాల ప్రభావం కేవలం ఒకటి రెండు భాషలకు పరిమితం కాదు. ఒక్కోసారి దేశాలు దాటిపోతుంది. వాటిలో…
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన ప్యారడైజ్ థియేటర్లలోకి వచ్చేసింది. నిన్నటి స్పెషల్ ప్రీమియర్స్ నుంచే సినిమాకు సాలిడ్ ఓపెనింగ్స్…
రెండు సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్న ది ప్యారడైజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నాని కెరీర్ లో మొట్టమొదటిసారి ఇంత అడ్వాన్స్…