విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం.. ఆ తర్వాత వెలుగు చూసిన ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రౌడీ షీటర్ అయిన సాయికృష్ణను.. ఈ ఏడాది మేలో ఓ ట్రాన్సిట్ వారెంటుపై అదుపులోకి తీసుకున్న కృష్ణ లంక పోలీసులు.. తీవ్రంగా హింసించారని.. అనంతరం.. అతను చనిపోయాడని, దీంతో శవాన్ని గుట్టు చప్పుడు కాకుండా తీసుకువెళ్లి బూడిద చేశారన్నది పోలీసులపై ఉన్న అభియోగం. ఇది రాజకీయంగా కూడా తీవ్ర సంచలనం సృష్టించింది.
దీంతో సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. నాటి ఘటనకు నిందితుడుగా భావిస్తున్న సీఐ నాగరాజును అరెస్టు చేసి.. ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉంచారు. ఇక, కానిస్టేబుళ్లు సహా.. సీఐ స్నేహితుడు సతీష్‌ను కూడా అరెస్టు చేశారు. మొత్తంగా ఈ కేసు విచారణ కొనసాగుతోంది. అయితే.. పోలీసులు చేసిన పనిపై పోలీసులతోనే విచారణ చేయించడం సరికాదని పేర్కొంటూ.. సామాజిక ఉద్యమ కారులు కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసు పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. పోలీసులకు హద్దులు అదుపులు లేకుండా పోతున్నాయని.. చట్టాలను రక్షించాల్సిన వారు.. భక్షిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా సీరియస్ వ్యవహారమని.. ఒక వ్యక్తి ఎలాంటి వాడైనా.. శిక్షించే అధికారం పోలీసులకు లేదని పేర్కొంది. అలాంటి ఒక వ్యక్తిని చంపేసి.. బూడిద చేసి.. దానికి మాస్కులు తొడుగుతున్నారని వ్యాఖ్యానించింది. ఈ కేసులో కేవలం సీఐ కానిస్టేబుళ్లను మాత్రమే బాధ్యులను చేయడం వెనుక కుట్ర ఉందన్న న్యాయవాది వాదనలను పరిగణనలోకి తీసుకుంది.
అనంతరం.. కేసును తామే విచారణకు తీసుకుంటామని పేర్కొంది. దీనిని తేలికగా వదిలేయడానికి వీల్లేదని.. తక్షణమే కేసుల రికార్డులు, హైకోర్టులో ఉన్న పిటిషన్లు.. వంటివాటిని తమకు బదిలీ చేయాలని ఆదేశించింది. సీబీఐ విచారణకు ఆదేశించాలన్న న్యాయవాది వాదనలను ఏకీభవిస్తూనే.. అవసరమని భావిస్తే.. తప్పకుండా సీబీఐ విచారణకు ఆదేశిస్తామని స్పష్టం చేసింది. ఈ కేసులో పెద్ద తలకాయల పాత్రను తేలుస్తామని హెచ్చరించింది. పోలీసులు ఏం చేస్తున్నారో.. ప్రభుత్వం కనీసం పరిశీలిస్తున్నట్టుగా లేదని వ్యాఖ్యానించడం గమనార్హం.
This post was last modified on September 24, 2026 12:25 pm
సోషల్ మీడియాలైన ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టా గ్రామ్ వంటి వాటిలో వీడియోలు, రీల్స్ చేసి.. ప్రజలకు చేరువయ్యే ఇన్‌ఫ్లుయెన్సర్లను అధికారికంగా…
బాక్సాఫీస్ వద్ద పోటీకి సంబంధించి రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దసరా పండగ టార్గెట్ గా ఈసారి క్రేజీ సినిమాలు…
గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయ పరిస్థితి ప్రస్తుతం సవాలుగా మారింది. రాజకీయంగా ఆయన తన తమ్ముడి కొడుకును…
కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాల ప్రభావం కేవలం ఒకటి రెండు భాషలకు పరిమితం కాదు. ఒక్కోసారి దేశాలు దాటిపోతుంది. వాటిలో…
నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన ప్యారడైజ్ థియేటర్లలోకి వచ్చేసింది. నిన్నటి స్పెషల్ ప్రీమియర్స్ నుంచే సినిమాకు సాలిడ్ ఓపెనింగ్స్…
రెండు సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్న ది ప్యారడైజ్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నాని కెరీర్ లో మొట్టమొదటిసారి ఇంత అడ్వాన్స్…