Political News

ఎన్నికల ఫలితాలపై AI ప్రభావం

AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం ఉండొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హెచ్చరించారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో మాట్లాడుతూ, ఏఐని ఆమె ‘రెండు వైపుల కత్తి’ అన్నట్లు పోల్చారు.

ప్రజలకు తెలియకుండానే వారి అభిప్రాయాలను ప్రభావితం చేసే శక్తి ఏఐకి ఉందని నిర్మలా చెప్పారు. ఒక వ్యక్తి ఏం చూస్తున్నాడు, ఏ విషయాలపై స్పందిస్తున్నాడు, ఏ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడనే సమాచారం ఆధారంగా అతనికి ప్రత్యేకంగా కంటెంట్ చూపించే అవకాశం ఉందన్నారు.

ఇలాంటి టెక్నాలజీని రాజకీయ ప్రచారంలో ఉపయోగిస్తే ఓటర్ల నిర్ణయాలపైనా ప్రభావం పడొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. చివరకు ఎన్నికల ఫలితాలనే ప్రభావితం చేసే స్థాయికి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఏఐ వల్ల వచ్చే ప్రయోజనాలతో పాటు ఇలాంటి రిస్కులను కూడా ముందుగానే గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.

ఫైనాన్స్ రంగంలో కూడా ఇదే సమస్య ఉందని నిర్మలా చెప్పారు. బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు మోసాలను గుర్తించడానికి ఏఐని ఉపయోగిస్తున్నాయి. అదే సమయంలో మోసగాళ్లు కూడా ఏఐ సహాయంతో కొత్త పద్ధతులు ఉపయోగించే అవకాశం ఉందన్నారు. అందుకే ఏఐని ఉపయోగించే సంస్థలు భద్రతపై మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

కొత్త టెక్నాలజీ వేగంగా ముందుకు వెళ్తున్న సమయంలో రూల్స్ కూడా అదే వేగంతో మారాల్సిన అవసరం ఉందని నిర్మలా చెప్పారు. ప్రజల డేటా, డబ్బు, ఎన్నికలు వంటి సున్నితమైన విషయాల్లో AI ఎలా వాడాలి అనే విషయంలో స్పష్టమైన నియంత్రణ అవసరమని ఆమె పేర్కొన్నారు.

This post was last modified on September 12, 2026 2:33 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

1 hour ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

2 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

2 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

3 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

3 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

3 hours ago