నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్ పేపర్ లీకేజికి వ్యతిరేకంగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ లు చేపట్టిన ఉద్యమం విజయంతం అయ్యాక వైసీపీ లో తరచుగా కాక్రోచ్, జెన్ జీ పేర్లు వినిపిస్తున్నాయి. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న జగన్ జెన్ జీ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, దీక్షలు కూడా చేయించారు. ఇప్పుడు ఏకంగా తనకు తాను కాక్రోచ్ గా అభివర్ణించుకుంటున్నారు.
ఈ మధ్య వెన్వెంటనే మీడియా సమావేశాలు పెట్టి గంటల తరబడి మాట్లాడుతున్న జగన్ డీఎస్సీ అక్రమాలపై మరోసారి అదే ఆరోపణ చేశారు. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని, నేను నాలుగు ప్రశ్నలు అడిగితే ఒక్క దానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ నేరుగా జవాబు చెప్పడం లేదన్నారు. అధికారులను ముందుకు తీసుకొని వచ్చి వారి చేత సమాధానం చెప్పించే ప్రయత్నం చేయడం ద్వారా సమస్య నుంచి ముఖం చాటేస్తున్నట్లు భావించాల్సి వస్తుందన్నారు. అధికారులు కూడా అభ్యర్థులు సమర్పించిన స్పోర్ట్స్ సర్టిఫికెట్లు వరిజినల్ సర్టిఫికెట్లుగా తేల్చి చెప్పలేక పోతున్నారని చెప్పారు.
పాలకులు వ్యవస్థలను చెడగొడుతున్నారని, ఇలాంటప్పుడే కాక్రోచ్ లు పుట్టుకొని వస్తారని, నాలాంటోడు కాక్రోచ్ అవుతున్నాడని కామెంట్ చేశారు. డీఎస్సీపై సిబిఐ విచారణకు ఆదేశించాలని, విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని, లేకపోతే కాక్రోచ్ లు రాక తప్పదని, పాలకుల మెడలు వంచక తప్పదని హెచ్చరించారు.
దీంతో సోషల్ మీడియాలో టీడీపీ ఐటీ సెల్ విరుచుకొని పడుతుంది. కాక్రోచ్ పార్టీ ఒక పార్ట్ టైం పార్టీగా తెరమీదకు వచ్చిందని, ఇప్పటికే రెండు ముక్కలయిందని గుర్తు చేస్తున్నారు. డీఎస్సీలో అక్రమాలు జరిగితే సాక్ష్యాలతో కోర్టుకు వెళ్లాలని, అలాంటిది చేయకుండా ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు చేస్తే లాభం లేదని కౌంటర్ ఇస్తున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు ప్రత్యారోపణలు చేసేందుకు ఆపసోపాలు పడుతున్నారు.
This post was last modified on September 11, 2026 12:51 pm
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…