Political News

నిజం గెలిచింది… నాటి చీకటి రోజులను గుర్తుచేసుకున్న లోకేష్‌

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులో అరెస్టు చేసి నిర్బంధించిన నాటి పరిణామాలను మంత్రి నారా లోకేష్‌ గుర్తుచేసుకున్నారు. 2023 సెప్టెంబరు 9న చంద్రబాబును ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్టు చేశారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో 53 రోజులపాటు ఉన్నారు. ‘‘నిజం గెలిచింది’’ అంటూ నాటి చీకటి రోజులను గుర్తుచేసుకుంటూ లోకేష్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి 53 రోజులపాటు ‘నిజం గెలవాలి’ అంటూ ఆయనకు అండగా నిలిచిందని లోకేష్‌ తెలిపారు. 2023 అక్టోబరు 31న హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యారని గుర్తుచేశారు.

అనంతరం న్యాయస్థానాల్లో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ.. ‘‘నిజం గెలిచింది’’ అని పేర్కొన్నారు. నాటి క్లిష్ట సమయంలో చంద్రబాబుకు అండగా నిలిచిన ప్రతి ఒక్క తెలుగువారికి మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా సెప్టెంబరు 9న రాష్ట్రవ్యాప్తంగా ‘నిజం గెలిచింది’ కార్యక్రమాలు నిర్వహించాలని లోకేష్‌ పిలుపునిచ్చారు. చంద్రబాబు జైలులో గడిపిన 53 రోజులకు గుర్తుగా టీడీపీ శ్రేణులు 53 దీపాలు వెలిగించి సంఘీభావం తెలియజేస్తున్నారు. 

This post was last modified on September 9, 2026 2:43 pm

Share

Recent Posts

విజయవాడలో 10 కోట్లు… దేశంలోనే మొదటిసారి

సైబ‌ర్ నేరాల గురించి త‌ర‌చుగా వార్త‌లు వ‌స్తున్నాయి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్ర‌భుత్వాలు స‌హా రిజ‌ర్వ్ బ్యాంకు…

36 minutes ago

ఒక్క యాడ్‌కు 40 కోట్ల పారితోష‌కం?

చాలా ఏళ్ల నుంచి త‌మిళ సినిమాను ఏలుతున్న హీరోల్లో అజిత్ ఒక‌డు. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్, ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌ర్వాత…

42 minutes ago

ఖైర‌తాబాద్‌లో బీజేపీ క్యాండేట్‌ ఆయ‌నేనా?

తెలంగాణ‌లో కీల‌క‌మైన ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుద‌ల…

5 hours ago

బాబు.. ప‌వ‌న్‌.. జోడీకి జ‌నాలు ఫిధా!

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు, డిప్యూటీసీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల జోడీకి ప్ర‌జ‌ల్లో మ‌రింత ఆద‌ర‌ణ…

11 hours ago

బ్లడీ రోమియోకి లెక్కలు కుదురుతున్నాయి

మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…

12 hours ago

డ్రాగన్ మాట మీద నిలబడితే చాలు

ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…

12 hours ago