కొండా సురేఖ వివాదం కాంగ్రెస్ పార్టీని ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. కొండా సురేఖ బర్తరఫ్ తర్వాత ఆమె కూతురు సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద విరుచుకొని పడటం దీనికి సంకేతంగా భావించాలి. సురేఖ బర్తరఫ్ ను తీవ్రంగా ఖండించిన ఆమె అదే స్థాయిలో రేవంత్ రెడ్డి మీద విమర్శలు గుప్పించడం సంచలనంగా మారుతుంది. సీఎం రేవంత్ తన తల్లి మీద పోటీ చేసి గెలవాలని సవాల్ చేయడంతో తెలంగాణాలో కొండా వివాదం మీద రాజకీయ పార్టీల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
సురేఖ బర్తరఫ్ తర్వాత సుస్మిత మీడియాతో మాట్లాడారు. తన తల్లిని మంత్రి పదవి నుంచి తొలగించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లికి అన్యాయం జరిగిందని, అయినా సరే ఆమెను ఎవరూ అణచివేయలేరని స్పష్టం చేశారు. ఆమె గొంతు నొక్కలేరని తేల్చి చెప్పారు. తాను స్వతంత్రురాలినని చెప్పుకున్న ఆమె తన వ్యక్తిగత విమర్శలను తల్లికి ఆపాదించడం, ఆమెను శిక్షించడం సమర్ధనీయం కాదన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి జెడ్పిటీసి, ఒకసారి ఎమ్మెల్సీ, ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా గెలిచారని చెప్పారు. కానీ తన తల్లి కొండా సురేఖ వరసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినారని, ఒక సీనియర్ నాయకురాలికి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధైర్యం వుంటే పరకాలలో తన తల్లి మీద పోటీ చేసి గెలవాలని సవాల్ చేశారు. అంత దమ్ము, ధైర్యం ఆయనకు లేదన్నారు.
గతంలో తన తండ్రి కొండా మురళిని లక్యంగా చేసుకొని రాజకీయాలు చేశారని, ఆయన రాజకీయ జీవితాన్ని దెబ్బ తీసారని విమర్శించారు. ఇప్పుడు తనతల్లి వెంట పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ సామాజిక వర్గం నుంచి రాజకియంగా ఎదగడం సహించలేకనే మా కుటుంబాన్ని టార్గెట్ చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వేం రెడ్డి నరేందర్ రెడ్డి వరంగల్ జిల్లాను శాశించాలనుకుంటున్నారని, వరంగల్ కు కింగ్ కావాలని అనుకుంటున్నారని కామెంట్స్ చేశారు. కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డి, పొంగులేటి అక్రమాల వివరాలను ఈడీ, సిబిఐలకు అందజేయనున్నట్లు వెల్లడించడంతో ఈ వివాదం మరో మలుపు తిరిగినట్లయ్యిందని విశ్లేషకు చెబుతున్నారు.
ఈ విమర్శల వెనక కొండా ఫ్యామిలీ హస్తం వున్నట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కొండా సురేఖ ఎమ్మెల్యే గా కొనగుతూనే మరోవైపు సుస్మిత చేత వ్యూహత్మకంగా ఆరోపణలు చేయిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ లో మున్ముందు ఈ వివాదం మరింతగా ముదిరే సూచనలు కానవస్తున్నాయని సీనియర్లు చెబుతున్నారు.
This post was last modified on September 4, 2026 2:50 pm
టాలెంట్ లోటు లేకపోయినా కథల ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల ప్రియదర్శి కెరీర్ రెండు హిట్లు నాలుగు ఫ్లాఫుల్లా సాగిపోతోంది.…
త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఉద్దేశించి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు సీరియస్‌గా ఉన్న…
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ 2 మీద అంచనాలు ఏ స్థాయిలో…
స్టార్ హీరోలకు వేగం అవసరం. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి లాంటి వాళ్ళు ఏడాదికి పది నుంచి పదిహేను సినిమాలు…
ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోనూ పారిశ్రామిక పెట్టుబడి దారులను కలిసిన ఏపీ మంత్రి నారా లోకేష్.. ఏపీలో…
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను అభిశంసించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఆ పదవికి ఆయన అనర్హుడని.. పేర్కొంటూ..…