వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై… ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి. తాజాగా చంద్రబాబుపై రాళ్లు రువ్విన ఘటన సుప్రీంకోర్టు వరకు చేరింది. నిందితులను విచారించేందుకు.. సుప్రీకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కస్టడీలోకి తీసుకోకుండానే.. వారిని విచారించాలని తేల్చి చెప్పింది. ఈ పరిణామం మొత్తం వైసీపీ నాయకులపై ప్రభావం చూపిస్తోంది. తద్వారా.. ప్రస్తుత రాజకీయాలపై కేసుల ఎఫెక్ట్ పడుతోందని అంటున్నారు.
టీడీపీలో ఉన్న నాయకులు కూడా కేసులు ఎదుర్కొన్నారు. కానీ, వైసీపీకి, టీడీపీకి చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. టీడీపీ లీగల్ సెల్ ఉన్న పటిష్ఠంగా వైసీపీ లేదన్న విషయం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో టీడీపీ నాయకులు అరెస్టు అయినా.. వారికి బలమైన సపోర్టు ఉంది. దీంతో వారు బయటకు వచ్చేవారు. తిరిగి పార్టీలో యాక్టివ్ అయ్యేవారు. కానీ, వైసీపీ విషయానికి వస్తే.. మారిన చట్టాలు.. నమోదవుతున్న సెక్షన్లు కూడా నాయకులకు, కార్యకర్తలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఒక్కసారి జైలుకు వెళ్తే.. మళ్లీ బయటకు రావడం ఎప్పుడన్నది నాయకులకు సందేహంగా మారింది. కొన్ని కేసుల్లో మాత్రమే నాయకులు బయటకు వస్తుండగా.. మరిన్ని కేసుల్లో మాత్రం.. నాయకులు.. నెలల తరబడి జైళ్లలోనే మగ్గుతున్నారు. ఈ పరిణామం.. పార్టీలో దూకుడుగా ఉండే నాయకులకు మరింత ఇబ్బందిగా మారింది. తాజాగా ఏదైనా కేసు నమోదై.. జైలుకు వెళ్తే.. పాత కేసులను కూడా పోలీసులు వెలికి తీస్తున్నారు. దీంతో బాబు వదలరు.. అనే టాక్ వైసీపీ నాయకుల మధ్య జోరుగా వినిపిస్తుండడం గమనార్హం.
ఇదే సమయంలో గతంలో టీడీపీ అధినాయకత్వం ఆ పార్టీ నాయకులకు ఇచ్చినట్టుగా వైసీపీ నాయకులు తన పార్టీ కార్యకర్తలకు భరోసా ఇవ్వలేక పోతున్నారు. మేమున్నాం.. అనే మాట చెప్పడం లేదు. ఇది కూడా.. నాయకులు పార్టిసేట్ చేసేందుకు.. కేసులకు వెనుకాడకుండా ముందుకు వచ్చేందుకు ప్రతిబంధకంగా మారింది.
ఈ నేపథ్యానికి తోడు.. పటిష్ఠమైన వ్యవస్థతో పోలీసులు డేగకన్ను వేయడం కూడా వైసీపీకి ఇబ్బందిగా మారింది. రాజకీయ వ్యూహాలు ఎన్ని వేసినా.. క్షేత్రస్థాయి కార్యకర్తలను బలంగా ముందుకు నడిపించేందుకు.. సరైన ప్రణాళికను అమలు చేయలేక పోతున్నారు. ఫలితంగా పార్టీ ఇరుకున పడుతోందని చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates