నిత్యం పాఠశాలల్లోనూ.. జాతీయ పండుగల దినాల్లోనూ అందరూ కలసి పాడుకునే జాతీయ గేయం వందేమాతరం ఇక, చట్టబద్ధం కానుంది. దీనికి సంబంధించి తీసుకువచ్చిన జాతీయ అవమానాల చట్టం సవరణ బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. బుధవారం లోక్‌సభ, గురువారం రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించాయి. అయితే.. దీనిపై ప్రతిపక్షాలు పెద్దగా నిరసన వ్యక్తం చేయకపోవడం గమనార్హం. కేవలం .. నీట్ పరీక్ష, అనంతరం విద్యార్థులు చేసిన నిరసన వంటి అంశాలకే ప్రతిపక్షాలు పరిమితం అయ్యాయి.
బిల్లులో ఏముంది?
ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్-1971 చట్టంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా సవరణలను తెచ్చింది. దీనిలో వందేమాతరం గేయాన్ని కూడా చేర్చారు. ఇప్పటి వరకు జనగణమన, జాతీయ జెండా వంటివాటికే పరిమితమైన ఈ చట్టం.. ఇక నుంచి వందేమాతరానికి కూడా వర్తించనుంది. ఈ గేయాన్ని అవమానించినా లేదా పాడుతున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా అడ్డు తగిలినా తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. జాతీయ గీతమైన జనగణమనకు ఉన్న చట్టపరమైన రక్షణే ఇకపై జాతీయ గేయం వందేమాతరానికీ వర్తిస్తుంది.
ఎవరైనా కేసు పెట్టవచ్చు!
తాజా బిల్లు ప్రకారం.. వందేమాతరం విషయంలో ఎవరైనా కేసులు పెట్టవచ్చు. అంటే.. ఒక వ్యక్తి వందేమాతరం గేయాన్ని పూర్తిగా పాడలేదని పేర్కొంటూ.. ఎవరైనా కేసు పెట్టే అవకాశం ఉంది. దీనిని నిరూపించుకునే బాధ్యత బాధితుడిపైనే ఉంటుంది. అలాగే.. వందేమాతరం పూర్తి చరణాలను(6) పాడక పోయినా.. కూడా ఈ చట్టం కింద శిక్షార్హులు అవుతారు. అక్కడితో కూడా ఆగలేదు… ఈ బిల్లు ఆమోదం పొందితే.. వందేమాతరం గేయాన్ని సరిగా పాడలేదని ఆరోపణలు వచ్చినా.. కూడా నిందితులు విచారణకు అర్హులవుతారు.
ఏం చేయాలి?
+ తాజా బిల్లు ప్రకారం.. వందేమాతరం పూర్తి గేయాన్ని ఆలపించాలి.
+ వందేమాతరం ఆలపిస్తున్నప్పుడు.. వ్యంగ్య చేష్ఠలు చేయరాదు.
+ నిటారుగా నిలబడి..రెండు చేతులను సమానంగా కిందికి పెట్టుకోవాలి.
+ వందేమాతరం గేయం ఆలపిస్తున్నప్పుడు.. తోటివారితో కానీ.. ఫోన్‌లలో కానీ మాట్లాడడాన్ని అవమానంగా భావిస్తారు. దీనికి శిక్ష తప్పదు.
+ వందేమాతరం గేయాన్ని సినిమాల్లోను.. ఇతరత్రా ప్రైమ్ టైమ్ షోలలోనూ వినియోగించరాదు.
+ ప్రస్తుతం జనగణమన గీతానికి ఉన్న అన్ని నిబంధనలు వందేమాతరానికి వర్తిస్తాయి.
+ సరదా కోసం వందేమాతరం ఆలపించకూడదు.
+ ఇష్టం వచ్చిన ట్యూన్‌లోను.. ఫోన్ల రింగ్ టోన్‌ల రూపంలోనూ.. దీనిని వినియోగిచరాదు.
+ అలా చేస్తే.. నిందితులకు మూడు సంవత్సరాల జైలు.. రూ.లక్ష నుంచి 10 లక్షల వరకు జరిమానా విధిస్తారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates

