ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై అసభ్య పదజాలాన్ని ప్రయోగించిన కేసులో అరెస్టు అయిన రావణ్ కు న్యాయ సహాయం చేసిన ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్… తాజాగా ఓ ఇంటర్పవ్యూలో ఆసక్తికర అంశాలను వెల్లడించారు. ప్రశ్న రావణ్ తో తనకు అంతగా సంబంధాలేమీ లేవని చెప్పిన శ్రావణ్… రావణ్ కు అతడి కుటుంబం నుంచి కూడా పెద్దగా మద్దతు లేదని సంచలన వ్యాఖ్య చేశారు. రావణ్ వ్యవహారంలో విపక్ష వైసీపీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని కూడా శ్రావణ్ ఆరోపించారు.
ప్రశ్న రావణ్ తో తనకు పెద్దగా స్నేహమే లేదని శ్రావణ్ తెలిపారు. ఆకివీడు వ్యవహారంలోనే తనకు రావణ్ తో పరిచయం అయ్యిందని, ఆ తర్వాత తన ఇంటర్వ్యూ కోసం రావణ్ తనను సంప్రదించారని తెలిపారు. ఆ తర్వాత నుంచి ఇప్పటిదాకా కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే తాను రావణ్ తో ఫోన్ లో మాట్లాడానని ఆయన తెలిపారు. అంతకుమించి రావణ్ తో తనకు ప్రత్యక్ష సంబంధాలేమీ లేవని కూడా ఆయన పేర్కొనడం గమనార్హం. ఇక ఓ బాధ్యత కలిగిన సామాజిక వేత్తగా, న్యాయవాదిగా మాత్రమే తాను రావణ్ కేసులను వాదించానని, అంతకుమించి రావణ్ తో తనకు మైత్రి లేదని ఆయన తేల్చేశారు.
ఇక రావణ్ ఓ రేంజిలో ఎలివేట్ కావడానికి దారి తీసిన ఏలూరు బహిరంగ సభలో అంతా తన ప్రమేయం లేకుండానే జరిగిపోయిందని శ్రావణ్ పేర్కొన్నారు. ఆ సభలో వేదిక మీదకు వచ్చేవారిలో రావణ్ పేరే లేదని ఆయన అన్నారు. ఆహ్వానితుల జాబితాలో పేరు లేకున్నా.. సభ నిర్వాహకుడిగా ఉన్న తన అనుమతి లేకుండానే రావణ్ వేదిక మీదకు వచ్చారని, అంతేకాకుండా తనకంటే ముందుగానే తన అనుమతి లేకుండా రావణ్ మైకందుకుని మరీ ప్రసంగించారని ఆయన ఆరోపించారు. అయితే వేడిపై శ్రవణ్ అన్న రమ్మంటేనే వచ్చానని రావణ్ మాట్లాడడం గమనార్హం. రావణ్ చేసిన ఘాటు వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా ఆయన తేల్చేశారు. తాను నిర్వహించిన సభలో తన అనుమతి లేకుండా మాట్లాడిన రావణ్ అరెస్టు అయ్యారని ఆయన పేర్కొన్నారు. ఈ మాటలు చూస్తుంటే జడ శ్రవణ్ ఈ కేసు నుండి తప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక రావణ్ కు వైసీపీ మద్దతు పలుకుతున్న వైనంపైనా శ్రావణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదికార కూటమికి చెందిన కీలక నేతలపై పరుష పదజాలంతో విరుచుకుపడుతున్న ప్రతి ఒక్కరికి వైసీపీ నుంచి మద్దతు లభిస్తోందని ఆయన అన్నారు. అందులో భాగంగానే రావణ్ కు వైసీపీ నుంచి మద్దతు లభించిందని ఆయన అన్నారు. అయితే రావణ్ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిన తర్వాత వైసీపీ అతడి నుంచి దూరం జరగాలని భావించిందని, అయితే అది అంత ఈజీ కాదన్న విషయం తెలుసుకుని వైసీపీ నేతలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. తనకు మాత్రం వైసీపీ నుంచి ఎలాంటి మద్దతు లేదని ఆయన అన్నారు. ఎంగిలి మెతుకులనూ విదల్చని మాదిరిగా వ్యవహరిస్తున్న వైసీపీ నుంచి తనకు ఎలాంటి సాయం అవసరం లేదని కూడా ఆయన ఘాటు వ్యాఖ్య చేశారు.
ఇక రావణ్ వ్యవహారంలో పరిమితికి మించి స్పందిస్తున్న ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ వ్యవహారంపైనా శ్రావణ్ స్పందించారు. రావణ్, ప్రకాశ్ రాజ్ ల మధ్య చాలా కాలం నుంచే పరిచయం ఉన్నట్టుందని ఆయన వ్యాఖ్యానించారు. రావణ్ గురించి మాట్లాడేందుకే ప్రకాశ్ రాజ్ తనకు పలుమార్లు కాల్ చేశారని ఆయన చెప్పారు. ఇక రావణ్ కు అతడి కుటుంబం నుంచి ఎలాంటి మద్దతు లేదని చెప్పారు. రావణ్ కు న్యాయ సహకారంతో పాటుగా ఇతరత్రా సాయాన్ని కూడా తానే చేస్తున్నానని తెలిపారు. రావణ్ కు అన్నీ తానై సాయం చేస్తుంటే… అతడి బృందంలోని గమన అనే యువతి వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసిన తీరుపై శ్రావణ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates