బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అరెస్టు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రావణ్ పై యూఏపీఏ యాక్ట్ ప్రకారం కేసు నమోదు కావడంపై చర్చ జరుగుతోంది. ఒక యూట్యూబర్ పై ఆ యాక్ట్ ప్రకారం కేసు పెట్టడం ఏంటని ప్రకాష్ రాజ్ వంటి వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, పోలీసుల విచారణలో రావణ్ కు సంబంధించి అనేక సంచలన విషయాలు వెలుగులోకి రావడం హాట్ టాపిక్ గా మారింది.
రావణ్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ ఫోన్ ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఈ క్రమంలోనే ఆ ఫోన్ లో లభించిన వీడియోలు చూసి పోలీసులు షాకయ్యారట. రావణ్ ఫోన్ లో పదుల సంఖ్యలో కొందరు యువతులకు సంబంధించిన అశ్లీల వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.
అంతేకాదు, ఆ వీడియోలు చూపించి కొందరు యువతులను రావణ్ బెదిరించినట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. అమాయక యువతులను టార్గెట్ చేసి వారిని లైంగికంగా వేధించినట్లుగా తెలుస్తోంది.
రావణ్ ఫోన్ లోని డేటా ఆధారంగా దాదాపు 10 మంది యువతులు బాధితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. అంతేకాదు, రావణ్ అకృత్యాలపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరపాలని డిసైడ్ అయ్యారు. బాధిత యువతుల వివరాలు గోప్యంగా ఉంచుతూ వారి స్టేట్మెంట్లు రికార్డ్ చేయాలని భావిస్తున్నారట. అయితే, ఈ విషయం గురించి పోలీసులు అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates