Political News

ప్రశ్న రావణ్ అక్రమాల పుట్ట పగిలింది!

తెలుగు రాష్ట్రాల్లో గడచిన కొన్ని రోజులుగా ప్రశ్న రావణ్ కు సంబంధించిన అంశాలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. బచ్చలకూర జోసెఫ్ అనే వ్యక్తి ప్రశ్న రావణ్ గా, జోసెఫ్ చౌదరిగా ప్రచారంలోకి వచ్చిన వైనం తెలిసిందే. పలు కీలక అంశాలపై తనదైన శైలి వ్యాఖ్యలు చేస్తూ సాగుతున్న రావణ్… రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారారు. ప్రముఖులపై ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో అతడిని ఏపీ పోలీసులు అరెస్టు చేయగా… వరుస కేసులు, వరుస బెయిళ్ల నేపథ్యంలో శనివారం రాత్రి అతడు విడుదలయ్యారు. అదే సమయంలో అతడికి సంబంధించిన అక్రమాలు కూడా బయటకు వచ్చేశాయి. అవినీతి, మహిళలపై వేధింపుల వ్యవహారం అతడిని వివాదంలోకి నెట్టేసింది. ప్రత్యేకించి ఓ మహిళతో రావణ్ అత్యంత సన్నిహితంగా గడిపిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోందని చెప్పాలి.

ప్రశ్నించడమే తన హక్కు అంటూ ప్రశ్న పేరిట ఓ యూట్యూబ్ ఛానెల్ తో జోసెఫ్ రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే తనను తాను రావణ్ గా పరిచయం చేసుకుంటూ అతడు సాగారు. ఈ క్రమంలోనే టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లను నేరుగా టార్గెట్ చేసిన రావణ్ ను ఏపీ పోలీసులు ఇటీవల అరెస్టు చేయగా…వరుస కేసుల తర్వాత శనివారం రాత్రి విడుదలయ్యారు. ఇంటికి వెళ్ళే తరుణంలో మరోసారి అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది.

ప్రముఖ న్యూస్ ఛానెల్ లో ప్రసారమైన ఈ కథనాల ప్రకారం… ప్రశ్న రావణ్ ప్రస్థానం మొత్తం అవినీతి మయమేనని చెప్పాలి. యూట్యూబ్ ఛానెల్ కు ముందు ఓ సంస్థలో పనిచేసిన రావణ్.. అక్కడ పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడట. అంతేకాకుండా సదరు సంస్తలో పనిచేస్తున్న మహిళల పట్ల అతడు వేధింపులకు దిగాడని తెలుస్తోంది. రావణ్ లైంగిక వేధింపులు తట్టుకోలేక ఓ మహిళా ఉద్యోగి ఏకంగా ఆత్మహత్యాయత్నం చేసిందట. ఈ క్రమంలోనే సదరు సంస్థ యాజమాన్యం రావణ్ ను ఉద్యోగం నుంచి తొలగించిందట. అయితే ఈ ఆరోపణలపై రావణ్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాతే రావణ్ ప్రశ్న పేరిట యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించారట.

ఏపీలోని విపక్షం వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న రావణ్…చంద్రబాబు, పవన్ కల్యాణ్ లతో పాటుగా వారి పార్టీలకు చెందిన నేతలు, ప్రదాన అనుచరులను టార్గెట్ గా చేసుకుని సంచలన ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇటీవలే ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ పై చేసిన వీడియోలో రావణ్ దారుణ పదజాలాన్ని వాడారు. ఆ తర్వాత ఇటీవలే ఏలూరులో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ పై దారుణ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల ఆధారంగానే ఏపీలో అతడిపై 100కు పైగా కేసులు నమోదు అయ్యాయి. అందులో బాగంగానే అరెస్టు అయిన అతడు…నాలుగు రోజుల తర్వాత శనివారం రాత్రి విడుదలయ్యారు. రావణ్ విడుదలైన మరుక్షణంలోనే అతడి రాసలీలల వీడియోతో పాటు అతడి అవినీతి వ్యవహారాలపై ప్రత్యేక కథనాలు ప్రసారం కావడం గమనార్హం.

This post was last modified on July 5, 2026 1:43 pm

Share

Recent Posts

సర్పంచ్ అంటే ఇలా ఆలోచించాలి

నేటి సమాజంలో కుటుంబ వ్యవస్థలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చదువులు, ఉద్యోగాలు, మెరుగైన జీవన ప్రమాణాల కోసం యువత పట్టణాలు,…

54 minutes ago

అర్జునుడి వెనుక ఇంత మంది పాండవులా

కొత్త హీరో నటించిన సినిమా అంటే జనాల్లో అంత సులభంగా అటెన్షన్ రాదు. ప్రమోషన్లు బలంగా చేసినా ఏదో ఒక…

3 hours ago

2024తో పోలిస్తే కూటమికి ఎంత లాభం? వైసీపీకి ఎంత నష్టం?

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల తర్వాత స్థానిక ఎన్నికలు జరిగాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్ల…

3 hours ago

చెల్లికి ద్రోహం… తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ సినిమా!

మ‌హిళా సెంటిమెంటు రాజ‌కీయాల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తుంద‌న్న‌ది తెలిసిందే. అందునా.. రాజ‌కీయ నేత‌ల కుటుంబాల‌కు చెందిన మ‌హిళ‌ల విష‌యంలో మ‌రింత‌గా…

4 hours ago

జ‌గ‌న్ ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చి ఉంటే.. !

"జ‌గ‌న్ ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చి ఉంటే.. స్థానిక ఎన్నిక‌ల్లో ఫ‌లితం ఎలా ఉండేది"- ఇదీ ఇప్పుడు వైసీపీని వెంటాడుతున్న ప్ర‌శ్న‌.…

5 hours ago

జడ్పీ పీఠాలపై వారసుల కన్ను!

పరిషత్ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెళ్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో అల్లూరి మన్యం జిల్లా మినహాయించి మిగిలిన 27 జిల్లాల్లో అధికశాతం…

5 hours ago